Home /News /trending /

HEARTBREAKING PHOTO OF DOG LOOKING FOR FAMILY MEMBERS AFTER AFGHANISTAN EARTHQUAKE MOVES INTERNET PAH

నిజంగా కంట తడిపెట్టిస్తున్న ఫోటో.. శిథిలాల్లో తన వాళ్ల కోసం వెతుకుతున్న కుక్క..

తన వాళ్ల కోసం వెతుకుతున్న కుక్క

తన వాళ్ల కోసం వెతుకుతున్న కుక్క

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం కొన్ని ప్రాంతాల రూపురేఖలనే పూర్తిగా మార్చేసింది. అనేక భవానాలు శిథిలాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసిన కుప్పలుగా పడిన శవాలు వెలుగులోనికి వచ్చాయి.

గత బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌లో (Afghanistan)  భారీ భూకంపం (Earthquake)  సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో.. వందల మంది తమ ప్రాణాలను కొల్పోయారు. అనేక గృహాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది శవాలు చిక్కుకుపోయాయి. అక్కడ ప్రజల పరిస్థితి దయానీయంగా మారిపోయింది. తినడానికి తిండిలేక ,ఉండటానికి ఇల్లు లేక సహాయక శిబిరాలలో అనేక మంది తలలు దాచుకుంటున్నారు. ఇప్పటికే అనేక దేశాలు తమ వంతుగా ఆఫ్ఘనిస్తాన్‌ కు ఆపన్నహస్తం అందిస్తున్నాయి.

ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలలో పరిస్థితి ఇంకా అదుపులోనికి రాలేదు. ఈ క్రమంలో సైన్యం రంగంలోనికి దిగి సహాయ చర్యలు చేపట్టింది. అక్కడి బాధితులకు.. ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో... అక్కడ పక్తికాలోని గయాన్‌లోని ఓచ్కి గ్రామంలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. అక్కడ ఒక కుక్క (Dog Looking For Family Members) శిథిలాలలో తన వాళ్ల కోసం వెతుకుతుంది. అతి కంటతడి పెట్టుకుంటూ.. అరుస్తు.. తన వాళ్ళ కోసం ఆ చుట్టుపక్కల గాలిస్తుంది.

దీన్ని అక్కడి వారి గమనించి ఫోటోలు తీశారు. దీన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఇంట్లోని వారంతా భూకంప ప్రభావం వలన చనిపోయినట్లు సమాచారం. కాగా, ఇప్పుడు తన యజమాని కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్న కుక్క హృదయ విదారక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఎమోషన్ కు గురౌతున్నారు. మరికొందరు కంట తడిపెడుతూ.. కామెంట్ లను పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఒక యువతి తన పెద్ద మనసును చాటుకుంది.

రోడ్డుపక్కన ఒక ఉడతను అమ్మాయి చూసింది. అది నీళ్ల కోసం అక్కడ వెతుకుతుంది. కింద పడిన కొద్దిగా ఉన్న నీళ్లను తన నాలుకతో నాకుతుంది. దీన్ని అమ్మాయి గమనించింది. వెంటనే తన చేతిలోని బాటిల్ ను ఉడత ముందు పెట్టింది. ఉడత కూడా ఏమాత్రం భయపడకుండా బాటిల్ లోని నీళ్లలను గట గట తాగేసింది. అమ్మాయి కూడా ఉడత నీళ్లు తాగే వరకు ఒపిగ్గా అక్కడే బాటిల్ పట్టుకుని నిలబడింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను బ్యూటెంగెబిడెన్ అనే ఖాతా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో (viral video) నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Afghanistan, Pet dog, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు