Heartbreak Insurance Fund : బీమా లేదా ఇన్స్యూరెన్స్ చేయించాలి..ఇది మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చాలా మందికి తెలుసు. అయితే చాలా సార్లు మనకేమవుతుంది,మనకెందుకులే లేని ఇన్స్యూరెన్స్ తీసుకోవడానికి కొందరు వెనకాడతారు. బీమా నిజంగా మంచి మార్గంలో చేయాలి. మన పొదుపుగా చెప్పుకోవచ్చు. ఇది మన కాలానికే కాకుండా మన తర్వాతి తరానికి కూడా ఉపయోగపడుతుంది. జీవిత బీమా, విద్యార్థుల బీమా, ప్రమాద బీమా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బీమా(Insurance)సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది.
ఈ రోజుల్లో లవ్ బ్రేకప్ చాలా సర్వసాధారణం.సగానికి పైగా ప్రేమలు పెళ్లికి ముందే బ్రేకప్ అవుతున్నాయి. ఆ మాటకి వస్తే నాలుగైదు రోజులకే బ్రేకప్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే లవ్ బ్రేకప్ అయినదానికి కూడా ఇప్పుడు ఇన్స్యూరెన్స్ పాలసీ వచ్చేసింది. దీనికి హార్ట్ బ్రేక్ ఇన్స్యూరెన్స్ ఫండ్(HIF)అని పేరు కూడా పెట్టారండోయ్. హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ నుండి రూ.25,000 అందుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Train Mileage : రైలు ఎంత మైలేజీని ఇస్తుంది? 1 కి.మీ దూరం నడిస్తే ఎంత డీజిల్ ఖర్చవుతుందో తెలుసా?
ప్రతీక్ ఆర్యన్ అనే వ్యక్తి ట్విట్టర్ లో తన వ్యక్తిగత విషయాన్ని షేర్ చేశారు. ప్రతీక్ ఆర్యన్ ప్రకారం, అతనికి మరియు అతని మాజీ ప్రియురాలి మధ్య రెండేళ్లుగా సంబంధం ఉంది. వారి సంబంధం ప్రారంభమైనప్పుడు వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం, అతను హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ అనే జాయింట్ అకౌంట్ ను తెరిచాడు. వారిద్దరూ ప్రతినెలా 500 రూపాయలు ఈ ఖాతాలో జమ చేసేవారు. ఒప్పందం ప్రకారం, ఈ సంబంధంలో ఎవరు మోసపోయినా ఈ డబ్బు పొందాలి. అంటే అబ్బాయి విడిపోతే ఆ డబ్బు అమ్మాయికే దక్కాలి. అమ్మాయి విడిపోతే ఆ డబ్బు అబ్బాయికే దక్కాలనేది వారి మధ్య ఒప్పందం. వీరిద్దరూ రెండేళ్లపాటు ఒక్కొక్కరు 500 రూపాయలు డిపాజిట్ చేయడంతో 25 వేల రూపాయలు ఖాతాలో జమ అయ్యాయి. ఇటీవల వీరి లవ్ బ్రేకప్ అయింది. ఈ క్రమంలో తనను ప్రియురాలు మోసం చేసిందని పేర్కొంటూ అకౌంట్ లోని రూ.25వేలు తీసుకున్నట్లు ప్రతీక్ ఆర్యన్ పేర్కొన్నాడు. వీరిద్దరూ రెండేళ్లపాటు ఒక్కొక్కరు 500 రూపాయలు డిపాజిట్ చేయడంతో 25 వేల రూపాయలు ఖాతాలో జమ అయ్యాయి. ఇందులో ప్రతీక్ ఆర్యన్ కంట్రిబ్యూషన్ పోగా మిగిలిన రూ.12,500 పరిహారంగా లభించింది.
I got Rs 25000 because my girlfriend cheated on me .When Our relationship started we deposited a monthly Rs 500 each into a joint account during relationship and made a policy that whoever gets cheated on ,will walk away with all money. That is Heartbreak Insurance Fund ( HIF ).
— Prateekaaryan (@Prateek_Aaryan) March 15, 2023
ప్రతీక్ ఆర్యన్ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ యొక్క CEO మరియు వ్యవస్థాపకుడిగా తనను తాను ఉంచుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ లాంటి ఆలోచన తమ రిలేషన్ షిప్‌లో అమలైతే అబ్బాయిలకు కూడా మంచి బిజినెస్ ఫండ్‌గా మారవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love cheating, VIRAL NEWS, Viral story