మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్ర ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడి

ఇటీవలికాలంలో మహిళలు మద్యం తాగడం కామన్‌గా మారుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఈ పోకడ ఉన్నప్పటికీ.. భారత్‌లో కూడా క్రమంగా మహిళలు మద్యం సేవించడం పెరుగుతోంది.

news18-telugu
Updated: October 30, 2020, 9:53 AM IST
మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్ర ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవలికాలంలో మహిళలు మద్యం తాగడం కామన్‌గా మారుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఈ పోకడ ఉన్నప్పటికీ.. భారత్‌లో కూడా క్రమంగా మహిళలు మద్యం సేవించడం పెరుగుతోంది. అయితే భారత్‌లో ఏ రాష్ట్రంలోని మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారో తెలుసుకోవాలని ఉందా.. అయితే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేను చూడాల్సిందే. మద్యం సేవించడంలో అసోంలోని మహిళలు దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే టాప్‌లో ఉన్నారని ఆ సర్వేలో వెల్లడైంది. 2019-2020 డేటా ప్రకారం అసోంలో 15 నుంచి 49 ఏళ్ల వయస్సు ఉన్న 26.3 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్టుగా తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇదే అత్యధికం. ఇక, ఆ తర్వాత స్థానంలో మేఘాలయాలో 8.7 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇక, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మద్యం సేవించే మహిళల సంఖ్య 10శాతంలోపే ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో తేలింది.

దేశవ్యాప్తంగా ఈ క్యాటగిరీలో మద్యం సేవిస్తున్న మహిళలు 1.2 శాతం మాత్రమే కావడం విశేషం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసోంలోని మహిళలు మద్యం సేవించడంలో చాలా ముందు ఉన్నారని గణంకాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక, 2015-16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4లోని(National Family Health Survey) గణంకాలను కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. అయితే 2018-19లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మరోవైపు 2005-06లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-3 నివేదికలో అసోంలో 15 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న 7.5 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తారని వెల్లడైంది. ఆ నివేదికలో అసోం కన్నా ముందు అరుణాచల్ ప్రదేశ్(33.6 శాతం), సిక్కిం(19.1 శాతం), ఛత్తీస్‌ఘర్(11.4 శాతం), జార్ఖండ్(9.9 శాతం), త్రిపుర(9.6 శాతం)తో ముందు నిలిచాయి. కానీ, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-3 నుంచి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-4కు వచ్చేసరికి అదే క్యాటగిరీలో అస్సోంలో మద్యం సేవించేవారి సంఖ్య 7.5 శాతం నుంచి 26.3 శాతానికి పెరిగింది. మరోవైపు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-3లో ఆ క్యాటగిరీలో అసోంకు కంటే ముందు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజా గణంకాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లో 3.3శాతం, సిక్కింలో 0.3 శాతం, ఛత్తీస్‌ఘర్‌లో 0.2 శాతం, జార్ఖండ్ 0.3 శాతం, త్రిపురలో 0.8 శాతానికి తగ్గింది.

ఇక, ఇదే అసోంలో 15 నుంచి 49 మధ్య వయసున్న 35.6 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. అదే క్యాటగిరీలో దేశవ్యాప్తంగా 29.2 శాతం మంది మందు తాగుతున్నారు. పురుషులు ఎక్కువగా మద్యం సేవిస్తున్న రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. ఇక్కడ 59 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వారానికి ఒకసారి మద్యం సేవించే మహిళలు 35 శాతం ఉండగా, అసోంలో మాత్రం 44.8 శాతంగా ఉంది. అదేవిధంగా వారానికి ఒకసారి మద్యం సేవించే పురుషులు అసోంలో 51.9 శాతం ఉండగా, దేశవ్యాప్తంగా 40.7 శాతంగా ఉంది.
Published by: Sumanth Kanukula
First published: October 30, 2020, 9:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading