శీతాకాలపు (Winter Season) చలిని తట్టుకోవడానికి మనం స్వెటర్లను, రగ్గులను ఆశ్రయిస్తుంటాం. అయితే, కొన్ని సందర్భాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అవి చలి నుండి మనల్ని రక్షించడంలో ఏమాత్రం దీనికి సరిపోవు. దీనికి ఉత్తమ పరిష్కారం ఒక్కటే.. మన శరీరం లోపల వేడి చేసుకోవడం. దీనికి బెల్లం చక్కగా పనిచేస్తుంది. అందువల్లే రోజూ ఉదయం ఒక గ్గాసు వెచ్చని నీటిలో బెల్లం(Jaggery) కలిపి త్రాగండని చెబుతున్నారు వైద్యులు.. బెల్లంలోని వ్యాధి నిరోధక శక్తి శీతాకాలంలో తరచూ వచ్చే సీజనల్ వ్యాధులను తగ్గించడానికి, చల్లటి వాతావరణం నుంచి మనల్ని కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. మనిషి శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఆహారంగానూ ఇది పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు. శీతాకాలంలో ఉదయాన్నే వెచ్చని బెల్లం నీరు త్రాగటం వల్ల శరీరం వెచ్చగా ఉండటమే కాక, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. అవేంటో ఓలుక్కేయండి.
బెల్లం నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలలో నెలకొన్న బ్లాకేజెస్ను నివారించడానికి, శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడానికి బెల్లం నీరు ఎంతగానో సహాయపడుతుందని వారు పేర్కొంటున్నారు. కాబట్టి, శీతాకాలంలో బెల్లం వాడటం చాలా అవసరమని గుర్తించుకోండి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభించే బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక, ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను దూరం చేయడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. చక్కెర వంటి తీపి పదార్థాలతో పోలిస్తే ఇది సహజ సిద్ధమైన రుచిని అందిస్తుంది. అయితే, బెల్లంతో ఉత్తమంగా ఆరోగ్య ప్రయోజనాల పొందాలంటే మాత్రం మీరు దానిని వెచ్చని నీటిలో కరిగించి, ఖాళీ కడుపుతో త్రాగడం మంచిదని డాక్టర్లు సలహాలిస్తున్నారు. ఈ పానీయం బరువు తగ్గడానికే కాక సున్నితమైన జీర్ణక్రియకు కూడా తోడ్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, బెల్లం నీటిలో ఇనుము(Iron), యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants), విటమిన్ ‘సి’(Vitamin C) కంటెంట్ అధికంగా లభిస్తాయి. కాబట్టి, గోరు వెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగడం వల్ల శ్వాసకోశ (Respiratory), గొంతు సమస్య(Throat Issues)లను అరికట్టవచ్చు.
బెల్లం నీరు తయారీ విధానం..
ఒక గిన్నెలో గ్లాసు నీరు వేడి చేసి, దానిలో 1 అంగుళం బెల్లం(Jaggery) ముక్కను వేయండి. ఆ మిశ్రమం కరిగే వరకు తిప్పండి. కొద్ది సమయం తర్వాత అది చల్లబడినప్పుడు వడకట్టి త్రాగండి. లేదా బెల్లం పొడిని తయారు చేసి పెట్టుకొని, రోజూ ఉదయం గ్లాసు వెచ్చని నీటిలో దాన్ని కలిపుకొని త్రాగండి. బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం. ఇది ఉత్తమ క్యాలరీ విలువను కలిగి ఉంటుంది. ఈ పానీయం ఎంతో రుచిని అందిస్తుంది.