జాన్ కర్కోరాన్ (John Corcoran). అమెరికాలో 1939లో జన్మించాడు. ఆరుగురు తోబుట్టువులలో అతను ఒకడు. అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నవ్యక్తి. చిన్నప్పుడు డిస్లెక్సియా(Dyslexia) అనే రుగ్మతతో బాధపడేవారు. తల్లిదండ్రులు జాన్ వ్యాధిని గుర్తించడంలో అశ్రద్ధ చేశారు. దీంతో అతనికి చదవడం(read), రాయడం(write) వచ్చేది కాదు. కానీ పాఠాలు చెప్పాలని, టీచర్(teacher) కావాలని ఆయనకు బలమైన కోరిక ఉండేది. అందుకే పాజిటివ్ విధానంలో ఆలోచించడం ప్రారంభించారు. కావల్సినంత ఆత్మస్థైర్యం పెంచుకున్నారు. ఏదో సాధించాలన్న కసి ఆయన్ని క్రీడల వైపు ఆసక్తి పెంచుకునేలా చేసింది. అంతే రాష్ట్ర స్థాయిలో ఫుట్‌బాల్(football) ఛాంపియన్ అయ్యాడు. పరీక్షల(exams)కు హాజరయ్యేటప్పుడు కావాలనే చేతులకు దెబ్బలు తగిలించుకుని, మరో వ్యక్తి సహాయంతో పరీక్షలు రాసేవారు. కొన్ని సార్లు చీటింగ్(cheating) చేసి, డబ్బులిచ్చి పాస్(pass) అయ్యాడు కూడా. అలా డిగ్రీ వరకు నెట్టుకొచ్చాడు మన జాన్. డిగ్రీ అంటే అది మామూలు డిగ్రీ కాదు సుమా.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనే డిగ్రీ పాస్ అయ్యాడు జాన్. ఇంకేం ఉద్యోగ వేటలోనూ పడ్డాడు. చివరికి స్పోర్ట్స్ కోటాలో కష్టపడకుండానే జాన్ (John Corcoran)కి ఉద్యోగం వచ్చింది. అదీ హైస్కూల్ టీచర్(teacher) ఉద్యోగం. కానీ తనకు చదవడం(read), రాయడం(write) రాదు కదా..! అందుకే విద్యార్థులకు ఓరల్(oral) టెస్టులు పెట్టేవాడు. వారికి తనకున్న వాగ్దాటితో వక్తృత్వంలో కోచింగ్ ఇచ్చేవాడు. బోర్డుపై ఏదైనా రాయాల్సి వస్తుంది కదా. మరి అప్పడెలా మ్యానేజ్(manage) చేశాడంటే. ఆ పని చేయడం కోసం ఒక జూనియర్ అసిస్టెంట్‌ని మాత్రం పెట్టుకున్నాడు. అతనికి ఏం రాయాలో ముందే తర్పీదు ఇచ్చి బోర్డుపై రాయించేవాడు. ఆ అసిస్టెంట్ కూడా మారుమాట్లాడకుండా అన్నీ రాసేవాడట. ఇలా ప్రతిరోజు జాన్ కార్కోరాన్ అలాగే చేసేవాడంట. అలా 17 సంవత్సరాలు గడిపాడు. జాన్ కర్కోరాన్ శిక్షణలో ఎందరో గొప్ప విద్యార్థులు తయారయ్యారు.
ఇంతకీ జాన్ ఎలా దొరికాడు అనుకుంటున్నారా?.. 17 ఏళ్లు గడిచాక.. ఒక రోజు తనకు తాను చేస్తున్న పని సరైనది కాదు అనిపించింది. అందుకే తన జీవితంలో అతి గొప్ప రహస్యాన్ని జాన్ బహిర్గతం చేశాడు. అంతేనా టీచర్ ఉద్యోగం కూడా వదులుకున్నాడు. 50 ఏళ్లకు చేరువ అవుతున్న వయసులో మళ్లీ A,B,C,D లు దిద్దడం ప్రారంభించాడు. 5 ఏళ్లలో ఒక పుస్తకం రాయగలిగే స్థాయికి చేరుకున్నాడు. జాన్ కథ విని ప్రపంచమే ఆశ్చర్యపోయింది. కానీ అదే జాన్(John Corcoran) తర్వాతి కాలంలో గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కితాబునందుకున్నారు. అయితే జాన్ తన పేరుమీద ఓ ఫౌండేషన్ సైతం ప్రారంభించడం విశేషం. అదే జాన్ కార్కోరన్ ఫౌండేషన్. చదవడం, రాయడం రాకుండా 17 సంవత్సరాలు జాన్ ఉపాధ్యాయుడిగా ఎలా సేవలు అందించాడన్నది ఇప్పటికీ ఎందరో మేధావులకు సైతం అర్ధం కానీ నిగూఢ రహస్యమనడంలో సందేహం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aim teacher, America, Fake id, Teaching