Home /News /trending /

HE LEFT HIS JOB AT TCS AND JOINED JOMATO AS A DELIVERY AGENT APART FROM THAT HE IS FIGHTING AGAINST THE INCREASE IN PETROL DETAILS HERE GH VB

Techie Turns Delivery Agent: టీసీఎస్(TCS) లో ఉద్యోగం వదిలి.. జొమాటో డెలివరీ ఏజెంట్‌గా విధులు.. కారణం ఏంటి..?

శ్రీనివాసన్ జయరామ్ (Image Credit : Money Control)

శ్రీనివాసన్ జయరామ్ (Image Credit : Money Control)

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా టీసీఎస్‌ (TCS)లో జాబ్ (Job) సంపాదించాలనే కోరిక చాలామంది ఇంజనీర్లకు ఉంటుంది. ఎందుకంటే టీసీఎస్‌లో జాబ్స్ సెక్యూరిటీ ఎక్కువ. అలాంటి జాబ్ ను ఓ వ్యక్తి వదిలేశాడు. ఎందుకు.. అతడు అలా చేయడానికి కారణం ఏంటి.. ఇక్కడ తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
సోర్స్:  మనీ కంట్రోల్(Money Control)

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా టీసీఎస్‌ (TCS)లో జాబ్ (Job) సంపాదించాలనే కోరిక చాలామంది ఇంజనీర్లకు ఉంటుంది. ఎందుకంటే టీసీఎస్‌లో జాబ్స్ సెక్యూరిటీ ఎక్కువ. అయితే ఇటీవల శ్రీనివాసన్ జయరామ్ అనే ఓ టెక్కీ అలాంటి జాబ్ వదిలేసి జొమాటో (Zomato) కంపెనీలో డెలివరీ ఏజెంట్‌ (Delivery Agent)గా చేరారు. హై-పేయింగ్ జాబ్ విడిచిపెట్టిన తరువాత విరామ సమయంలో న్యూ స్కిల్స్ నేర్చుకోవాలని, తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలని శ్రీనివాసన్ అనుకున్నాడు. ఈ ఆలోచనతోనే చెన్నైకి చెందిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) జొమాటోలో డెలివరీ ఏజెంట్‌గా ఓ పార్ట్‌టైమ్ జాబ్ లో చేరాడు. అంతేకాదు, ఈ ఛాలెంజింగ్ జాబ్ చేస్తూనే ఈ జాబ్ లోని కొన్ని ఛాలెంజెస్ (Challenges)ని ఒక లింక్డ్‌ఇన్‌ (LinkedIn) పోస్ట్ ద్వారా అందరితో పంచుకున్నాడు. ఇప్పుడా పోస్టు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.

Viral Video:పెళ్లి పీటల మీద కాబోయే భర్తతో కన్నీళ్లు పెట్టించిన యువతి.. కారణం తెలిస్తే షాక్

జాబ్ లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఫుడ్ డెలివరీ ఏజెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను శ్రీనివాసన్ జయరామన్ క్లియర్ వ్యూలో చూశారు. అనంతరం అతను ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో జొమాటో డెలివరీ ఏజెంట్‌గా తాను తెలుసుకున్న ఆరు కీ లెర్నింగ్స్ షేర్ చేశారు. చాలా సందర్భాలలో కస్టమర్లు డెలివరీ కరెక్ట్ లొకేషన్‌ను సరిగ్గా చెప్పరు. లేదా వారి ఫోన్ నంబర్లను అప్‌డేట్ చేయరు అని ఈ పోస్టులో జయరామన్ వెల్లడించారు. “కొన్నిసార్లు మేం లొకేషన్‌కి కొత్తగా వచ్చినట్లయితే రెస్టారెంట్‌ని గుర్తించలేం. గూగుల్ మ్యాప్స్‌ని యూజ్ చేసినా వీటిని గుర్తించడం అంత సులభం కాదు” అని పాయింట్ అవుట్ చేశారు.

కొన్నిసార్లు దూరం సమస్యగా మారుతుందని.. ఒక్కోసారి ఫుడ్ డెలివరీ లొకేషన్ 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అతను చెప్పుకొచ్చారు. ఈ టెక్కీ మూడు గంటల్లో కేవలం మూడు ఆర్డర్లు మాత్రమే రిసీవ్ చేసుకున్నాడట. హాట్‌స్పాట్ లొకేషన్లు అని పిలిచే ప్రాంతాల్లో ఎక్కువ ఆర్డర్‌లను వస్తాయని అనుకుంటారు కానీ అటువంటి ప్రాంతాల నుంచి తనకు తక్కువ ఆర్డర్లు అందాయని, అది కూడా పీక్ అవర్స్‌లో తనకు తక్కువ ఆర్డర్లు అందాయని జయరామన్ చెప్పారు.

OMG: అదృష్టం అంటే ఇతనిదే.. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటే.. ఏకంగా కోట్లు వచ్చిపడ్డాయి..

అలాగే భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు చాలా పెద్ద సమస్య అని ఆయన అన్నారు. జొమాటోని ట్యాగ్ చేస్తూ, "పెట్రోల్ సమస్యని దృష్టిలో పెట్టుకొని మన వారియర్స్ కి సపోర్ట్ చెయ్యండి. పెట్రోల్ ధరల పెంపు విషయంలో మీరు సహాయం చేయడానికి ప్లాన్ చేస్తున్న కొన్ని నోటిఫికేషన్‌లను నేను చూశాను. అందుకు మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నాను. వారికి సహాయం చేస్తూ ఉండండి." అని శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఒక ఇంజనీర్ కస్టమర్లకు ఆహారాన్ని డెలివరీ చేయడానికి సమయంతో పోరాడుతున్న డెలివరీ ఏజెంట్ల సవాళ్లను అందరికీ తెలియజేశారు.
Published by:Veera Babu
First published:

Tags: Trending, Trending news, Trending videos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు