Roshni Nadar: భారత్‌లో సంపన్నమైన మహిళగా నిలిచిన రోష్ని నాడార్‌

Roshni Nadar: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ సంస్థ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మరో రికార్డును సాధించారు. భారతదేశంలో సంపన్నమైన మహిళల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు.

news18-telugu
Updated: December 4, 2020, 6:27 PM IST
Roshni Nadar: భారత్‌లో సంపన్నమైన మహిళగా నిలిచిన రోష్ని నాడార్‌
రోష్ని నాడార్‌(ఫైల్ ఫొటో)
  • Share this:
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ సంస్థ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మరో రికార్డును సాధించారు. భారతదేశంలో సంపన్నమైన మహిళల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. ‘కొటక్ వెల్త్ హరూన్- లీడింగ్ వెల్తీ ఉమెన్’ (Kotak Wealth Hurun: Leading Wealthy Women) పేరుతో కొటక్ సంస్థ నిర్వహించిన సర్వేలో రోష్ని టాప్‌ ప్లేస్‌ దక్కించుకున్నారు. ఆమె నికర సంపద రూ.54,850 కోట్లు. రోష్ని ప్రస్తుతం హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ HCLటెక్, HCL ఇన్ఫోసిస్టమ్స్‌కు హోల్డింగ్ కంపెనీ. సంపన్న మహిళల జాబితాలో రెండవ స్థానంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఎండీ కిరణ్ మజుందార్ షా నిలిచారు. ఆమె నికర సంపద రూ.36,600 కోట్లు. ఆ తరువాతి స్థానాల్లో లీనా గాంధీ తివారీ (రూ.21,340 కోట్లు), నిలిమా మోటపార్తి (రూ.18,620 కోట్లు), రాధా వెంబు (రూ.11,590 కోట్లు) ఉన్నారు. సంపన్నుల లిస్ట్‌లో ఉన్న వారిలో ఎక్కువమంది ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, అప్పారెల్స్, యాక్సెసరీస్, హెల్త్ కేర్ సర్వీసెస్‌ రంగాలకు చెందినవారే ఉన్నారని నివేదిక చెబుతోంది.

* ఇంకా సమస్యలు పోలేదు

"కొటక్ వెల్త్ హరూన్: లీడింగ్ వెల్తీ ఉమెన్" జాబితా కోసం రూ.100కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సర్వే భారతదేశంలోని సంపన్న మహిళల జాబితాను, వారి నికర ఆస్తుల విలువను గుర్తిస్తుంది. ఈ జాబితాలో మహిళల సగటు సంపద సుమారు రూ.2,725 కోట్లు అని కొటక్ వెల్త్ సంస్థ ప్రకటించింది. మహిళల నేతృత్వంలో పనిచేసే సంస్థలకు లిమిటెడ్ ఫండింగ్‌ అవకాశాల రూపంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పినట్లు కొటక్ వెల్త్ వెల్లడించింది. కరోనా వల్ల ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని చాలామంది చెప్పారు. ఈ జాబితాలో ఎనిమిది మంది పద్మ అవార్డు గ్రహీతలు, 31 మంది సెల్ఫ్‌ మేడ్ ఉమెన్, ఆరుగురు ప్రొఫెషనల్ మేనేజర్లు, 25మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ ఫీచర్ విభాగానికి చెందిన ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు కూడా జాబితాలో ఉన్నారు.

* గతంలోనే రోష్నికి గుర్తింపు
హెచ్‌సీఎస్‌ను భారత్‌లో టాప్‌ కంపెనీగా తీర్చిదిద్దిన శివ్ నాడార్‌ కూతురే రోష్ని నాడార్. ఆమె దిల్లీలో పుట్టి పెరిగింది. అమెరికాలో ఎంబీఏ చేసింది. 2009లో హెచ్‌సీఎల్ అనుబంధ సంస్థ హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్ల బోర్డులో చేరి, మొదటిసారి తండ్రి కంపెనీలో అడుగుపెట్టింది. ఈ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఇన్‌ఫోసిస్టమ్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఈ బాధ్యతల్లో నాలుగేళ్లు ఉన్న తరువాత హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ అడిషనల్ డైరెక్టర్‌గా చేరింది. అప్పటికే ఈ కంపెనీ దేశంలో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో మూడో అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది. శివ్‌నాడార్ నిష్ర్కమణ తరువాత ఆ సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది. కార్పొరేట్‌ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో ఆమె ఎక్కువగా పాల్గొంటుంది. హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది. వణ్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా హ్యాబిటాట్స్ ట్రస్ట్ స్థాపించింది. సస్టెయినబుల్ ఎకో సిస్టమ్‌కు ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఫోర్బ్స్‌ మేగజైన్ 2019లో ప్రకటించిన అత్యంత శక్తిమంతమైన మహిళల్లో 54వ స్థానంలో రోష్ని నిలిచింది.
Published by: Sumanth Kanukula
First published: December 4, 2020, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading