Income Tax Refund: ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ కాలేదా?.. అయితే, మీ రీఫండ్ వేగవంతంగా ప్రాసెస్ కావడానికి ఇలా చేయండి

(ప్రతీకాత్మకచిత్రం)

Income Tax Return: 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసినా, ఇప్పటివరకు రీఫండ్ పొందలేదా?.. అయితే, ఆందోళన చెందకండి.

  • Share this:
2019–20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసినా, ఇప్పటివరకు రీఫండ్ పొందలేదా?.. అయితే, ఆందోళన చెందకండి. ఎందుకంటే ఆదాయ పన్ను రిటర్నులను వేగవంతంగా ప్రాసెసింగ్ చేయడానికి టెక్నికల్ అప్గ్రేట్ ఫ్లాట్ఫామ్ (సిపిపి 2.0)ను పరిశీలిస్తుంది ఆదాయ పన్ను శాఖ. ఇటీవలి కాలంలో ఆదాయ పన్ను రీఫండ్లను ప్రాసెస్ చేయడంలో జాప్యం జరుగుతోందని పన్ను చెల్లింపుదారుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ టెక్నికల్ అప్గ్రేడ్ పనిలో ఉన్నామని అందుకే, రీఫండ్ ఆల్యసం అవుతుందని స్పష్టంచేసింది. ఒక పన్ను చెల్లింపుదారుడు చేసిన ట్వీట్కు స్పందిస్తూ“చెల్లింపుదారులకు ఉత్తమ సేవలను అందించడానికి మేం నిబద్ధతలో పనిచేస్తున్నాం. ఐటిఆర్‌లను వేగంగా ప్రాసెస్ చేయడానికి నూతన టెక్నికల్ అప్‌గ్రేడ్ ప్లాట్‌ఫామ్ (సిపిసి 2.0) వైపు మారుతున్నాం. అసెస్మెంట్ ఇయర్ 2020–21 కొరకు ఇకపై ఐటీఆర్లు CPC 2.0పై ప్రాసెస్ చేయబడతాయి. మేము క్రొత్త వ్యవస్థకు మారేటప్పుడు మీరు చూపిస్తున్న సహనానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం." అని పేర్కొంది.

రీఫండ్ ఆలస్యం కావడానికి కారణాలు
అయితే, 2020–21 అసెస్మెంట్ ఇయర్ కొరకు పన్ను రిటర్న్లు ఎప్పుడు ప్రాసెసింగ్ ప్రారంభం అవుతాయి అనే విషయంపై ఎలాంటి టైమ్ లైన్ను పేర్కోనలేదు ఐటీ శాఖ. కాబట్టి, ప్రస్తుతానికి, పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన అన్ని ఆదాయపు పన్ను రిటర్నులు బెంగళూరులోని ఐ-టి విభాగం సిపిసి లేదా కేంద్రీకృత ప్రాసెసింగ్ కేంద్రంలో ప్రాసెస్ చేయబడతాయి. కాగా, ఈ ఏడాది కోవిడ్‌తో పాటు, ప్రభుత్వ నిధుల కొరత వల్ల రిటర్న్‌లను ప్రాసెస్ చేయడానికి ఆలస్యం అవుతుందని టిపి ఓస్ట్వాల్ & అసోసియేట్స్ ఎల్ఎల్పికి చెందిన కుష్ వత్సరాజ్ పేర్కొన్నారు.

సాధారణంగా ITR ని దాఖలు చేసిన నెల రోజుల వ్యవధిలో రీఫండ్ ప్రాసెస్ చేయబడుతుంది. కేంద్రీకృత ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా రీఫండ్ ప్రాసెసింగ్ పూర్తయిన వెంటనే 20 నుండి 45 రోజులలోపు పన్ను రీఫండ్ చేయబడుతుంది. 5 లక్షల రూపాయల వరకు రీఫండ్ పొందే అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ ప్రాసెస్ చేయబడిన వారంలోనే బ్యాంకులో ఖాతాలో డబ్బు జమ అవుతుంది. అయితే, ఐటిఆర్ దాఖలులో పన్ను చెల్లింపుదారుడు పొరపాటు చేస్తే మాత్రం రీఫండ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో, పన్ను చెల్లింపుదారుడు బ్యాంక్ ఖాతా వివరాలను తప్పుగా ఇవ్వడం వల్ల రీఫండ్ ఆలస్యమవుతుంది లేదా తిరస్కరించబడుతుంది. అందువల్ల, ఐటీఆర్ దాఖలు సమయంలోనే మీ బ్యాంక్ ఖాతా వివరాలను చెక్ చేసుకోవడం మంచింది.

ఇన్కమ్ టాక్స్ రీఫండ్ స్టేటస్ను ఎలా చెక్ చేయాలి?
స్టెప్ 1.
ఐటీ విభాగానికి చెందిన ఈ–ఫైలింగ్ పోర్టల్ www.incometaxindiaefiling.gov.in, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) వెబ్‌సైట్ల ద్వారా మీరు మీ రీఫండ్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు.

స్టెప్ 2. ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో మీ రిజిస్టర్డ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి మీ పాన్, పాస్‌వర్డ్ను ఉపయోగించండి.

స్టెప్ 3. మీ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత, ‘వ్యూ ఈ–ఫైల్ రిటర్న్స్ /ఫారమ్స్’ సెక్షన్కు వెళ్లండి.

స్టెప్ 4. ఆదాయపు పన్ను రిటర్నులు, సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ను ఎంచుకోండి. దీని తరువాత, ఐటిఆర్ దాఖలు, ఐటిఆర్ ప్రాసెసింగ్, రీఫండ్ ఇష్యూ లేదా స్టేటస్ వంటి ఐటిఆర్ రిటర్న్ స్టేటస్ వివరాలను చెక్ చేసుకోవడానికి కొత్త పేజీ తెరుచుకుంటుంది. ఈ సమాచారం అంతా ‘మై రిటర్న్’ విభాగంలో లభిస్తుంది.

స్టెప్ 5. పేమెంట్ మోడ్, రీఫండ్ అమౌంట్, క్లియరెన్స్ డేట్ వంటి వివరాలను ‘స్టేటస్’ విభాగం కింద చెక్ చేయవచ్చు.

స్టెప్ 6. మీ బ్యాంక్ ఖాతా వివరాలను అందించడంలో ఏవైనా పొరపాటు చేసినట్లైతే, మీరు ఈ–-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో మీ వివరాలను అప్డేట్ చేయవచ్చు. మీరు మీ బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేసి, రీఫండ్కు రిక్వెస్ట్ చేస్తే కొద్ది రోజుల్లో మీ ఖాతాకు రీఫండ్ అమౌంట్ జమ అవుతుంది.

ఇన్కమ్ టాక్స్ రీఫండ్ రీ-ఇష్యూకు రిక్వెస్ట్ ఎలా చేయాలి?
స్టెప్ 1:
‘ఈ–-ఫైలింగ్’ పోర్టల్ www.incometaxindiaefiling.gov.in కు లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2: 'మై అకౌంట్' మెనులోకి వెళ్లి, 'సర్వీస్ రిక్వెస్ట్' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: న్యూ రిక్వెస్ట్లో 'రిక్వెస్ట్ టైప్'ను సెలెక్ట్ చేసుకొని 'రిక్వెస్ట్ కేటగిరీ'ని ఎంచుకోండి.

స్టెప్ 4: 'సబ్మిట్'పై క్లిక్ చేయండి. పాన్, రిటర్న్ టైప్, అసెస్‌మెంట్ ఇయర్, రిసిప్ట్ నెంబర్, కమ్యూనికేషన్ రిఫరెన్స్ నంబర్, రీఫండ్ వైఫల్యానికి కారణం, రెస్పాన్స్ వంటి వివరాలు ప్రదర్శించబడతాయి.

స్టెప్ 5: 'రెస్పాన్స్' కాలమ్ కింద ఉన్న 'సబ్మిట్' హైపర్ లింక్పై క్లిక్ చేయండి.

స్టెప్ 6: పన్ను రీఫండ్ జమ చేయవలసిన బ్యాంకు ఖాతాను ఎంచుకుని, 'కంటిన్యూ'పై క్లిక్ చేయండి. పన్ను చెల్లింపుదారుడు తన వివరాలను వెరిఫై చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ, బ్యాంక్ నేమ్, అకౌంట్ టైప్ వంటి వివరాలు ప్రదర్శించబడతాయి.
Published by:Sumanth Kanukula
First published: