HASNU RAM WHO IS 75 YEARS OLD CONTESTED 93 UNSUCCESSFUL ELECTIONS TARGET OF DEFEAT IN 100 ELECTIONS IN UTTAR PRADESH AK
OMG: వీడెవడండీ బాబూ.. ఎన్నికల్లో 'మగధీర'.. అసలు టార్గెట్ ఇదే.. ఇప్పటికి ఎన్నిసార్లు పోటీ చేశాడంటే..
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన హస్ను రామ్
Viral News: దాదాపు 36 ఏళ్ల క్రితం ఓ పెద్ద పార్టీ హస్ను రామ్‌కి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిందట. కానీ చివరి నిమిషంలో అలా జరగలేదు.
ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నది చాలామంది కల. అయితే ఈ కలను కొంతమంది మాత్రమే సాకారం చేసుకుంటారు. అయితే ఇప్పుడు కాకపోయినా.. మరోసారి తమను విజయం వరిస్తుందని ఆశగా ఎదురుచూసే వాళ్లు చాలామంది ఉంటారు. పదే పదే ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ జాబితాలోకే వస్తారు. కానీ ఈయన వీరి కంటే ఇంకాస్త భిన్నం. ఓడిపోతామని తెలిసినా.. కచ్చితంగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడం ఈయన అలవాటు. పంచాయతీ ఎన్నికలు మొదలుకుని దేశ రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్నింటిలోనూ పోటీ చేయాలన్నది ఈ టార్గెట్. ఈ వ్యక్తి ఇప్పటి వరకు 93 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. అన్నింట్లోనూ ఓడిపోయారు. ఇప్పుడు 94వ సారి నామినేషన్ ఫారం నింపేందుకు సిద్ధమవుతున్నారు. 100 ఎన్నికల్లో ఓడిపోయి రికార్డు సృష్టించాలన్నది ఆయన ఆశయం. ఆయన పేరే హస్ను రామ్. ఈసారి ఎన్నికల్లో కూడా తన ఓటమిని ఎవరూ ఆపలేరని అంటున్నారు హస్నురామ్.
ఓడిపోవడానికే ఇప్పటివరకు 93 ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ హస్ను రామ్ మరోసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. హస్ను రామ్‌కి ఇది 94వ ఎన్నిక. తాను ఓడిపోకుండా అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. 100 ఎన్నికల్లో ఓడిపోయి రికార్డు సృష్టించాలని హస్నురామ్ భావిస్తున్నారు. 75 ఏళ్ల హస్ను రామ్ ఇప్పటివరకు 93 వేర్వేరు ఎన్నికల్లో పోటీ చేశారు. తన ఓటమిని చూసి సంతోషంగా ఉన్నారు. ఖేరాగఢ్ తహసీల్‌లోని నాగ్లా దుల్హా నివాసి హస్ను రామ్ మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది.
దాదాపు 36 ఏళ్ల క్రితం ఓ పెద్ద పార్టీ హస్ను రామ్‌కి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిందట. కానీ చివరి నిమిషంలో అలా జరగలేదు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. హస్ను రామ్ గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అమీన్‌గా పని చేసేవారు. అయితే ఎన్నికల కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఉద్యోగం మానేసినా పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్, విధానసభ, లోక్‌సభకు జరిగే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆగష్టు 15, 1947న జన్మించిన హస్ను రామ్ అంబేద్కర్.. అంతకుముందు కూడా WAMCEFలో చురుకుగా ఉన్నారు. తాను ఓ పార్టీ నుంచి టికెట్ అడిగానని, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు నీకు పక్కింటి వాళ్లు కూడా ఓటు వేయరని.. ఎన్నికల్లో పోటీ చేసి ఏం చేస్తావని అన్నారని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత హస్ను రామ్ ఎన్నికల్లో ఓటమిని స్వీకరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు ఆయన ఫతేపూర్ సిక్రీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 17,111 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అప్పటి నుండి హస్ను రామ్ ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. 1985 నుండి ఇప్పటి వరకు అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ సహా అన్ని ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
హస్ను రామ్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు సహకార బ్యాంకులు MLC సహా వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, హస్ను రామ్ ఆగ్రా జిల్లాలోని 2 స్థానాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. నామినేషన్ పత్రాలను కొనుగోలు చేసిన తర్వాత న్యూస్ 18తో మాట్లాడు. తన ఓటమి ఖాయమని, ఓడిపోకుండా ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఓడిపోవడమే తన జీవిత లక్ష్యమన్నారు. మొత్తానికి హస్ను రామ్ ఎన్నికల పోరాటం అనేది ఒక ఆసక్తికరమైన కథ అని చెప్పుకోవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.