HARYANA YOUTH PICKS TRACTOR OVER MERCEDES TO REACH WEDDING VENUE TO SHOW SUPPORT TO FARMERS PROTEST NS GH
బెంజ్ కారు వదిలి ట్రాక్టర్ పై మండపానికి వెళ్లిన పెళ్లి కొడుకు.. వినూత్న రీతిలో రైతుల ఆందోళనకు మద్దతు.. ఎక్కడంటే..
ట్రాక్టర్ పై పెళ్లి మండపానికి వెళ్తున్న వరుడు( (Credit: ANI/Twitter))
సుమిత్ అనే యువకుడు ఎంతో ప్రత్యేకంగా రైతుల ఆందోళన(Farmer's Protest)కు తన మద్దతును ప్రకటించాడు. పెళ్ళి మండపానికి ఫ్యాన్సీ కారులో కాకుండా ట్రాక్టర్లో వెళ్ళి తన రాష్ట్ర రైతులు చేస్తున్న ఉద్యమానికి తన మద్దతు తెలిపి ఆదర్శంగా నిలిచాడు.
ఈ పెళ్ళికొడుకు చేసిన పనికి అంతా నివ్వెరపోయారు. ఆనంద భాష్పాలతో ఎంతో మెచ్చుకున్నారు. పెళ్ళికొడుకుగా మండపానికి వెళ్ళడానికి మెర్సిడెస్ బెంజ్ కారు అందంగా అలకరించుకొని కూడా చివరికి ట్రాక్టర్ పైన వెళ్ళాడు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తడు. అందరిలాగే సుమిత్ ధుల్ కూడా తన పెళ్ళిని ఎంతో ఘనంగా చేసుకోవాలని అనుకున్నాడు. దాని కోసం ఏకంగా బెంజ్ కారునే డెకరేట్ చేయించాడు. పెళ్లిమండపానికి హుందాగా వెళ్ళడానికి అన్ని హంగులూ పూర్తైన తర్వాత అతనికి ఒక గొప్ప ఆలొచన కలిగింది. వ్యవసాయ కుటుంబ మూలాలున్న సుమిత్ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు తన వంతుగా మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నడు. రైతులకు మద్దతుగా ట్రాక్టర్లో పెళ్ళిమండపంలో అడుగుపెట్టాడు. 'ఢిల్లీ చలో' ఆందోళనలో భాగంగా వేలమంది రైతన్నలు రాజధాని ఢిల్లీ వైపుగా కథం తొక్కరు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమంలో నలుమూలల నుంచి రైతులంతా తమ మద్దతును తెలియజేసారు. ఈ క్రమంలో కర్నల్ ప్రాంతానికి చెందిన సుమిత్ అనే యువకుడు ఎంతో ప్రత్యేకంగా అతని మద్దతును ప్రకటించాడు. పెళ్ళి మండపానికి ఫ్యాన్సీ కారులో కాకుండా ట్రాక్టర్లో వెళ్ళి తన రాష్ట్ర రైతులు చేస్తున్న ఉద్యమానికి తన మద్దతు తెలిపి ఆదర్శంగా నిలిచాడు.
సుమిత్ ధుల్ కర్నల్లోని సెక్టార్ 6 నివాశి. తాను అలా పెళ్ళిమండపానికి హుందాగ ఉండే కారును వదిలి సాధారణంగా ఒక ట్రాక్టర్లో వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని అడిగితే ఇలా చెబుతాడు... 'నేనూ రైతు కుటుంబం నుంచి వచ్చాను. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి నా వంతు ఏదో ఒకటి చేయాలని అనిపించింది. అందుకే ఇలా కారును కాదని ట్రాక్టర్లో వచ్చాను. మనం గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్ళి వుండొచ్చు. కాని మన మూలాలు వ్యవసాయంతోనే ముడిపడి వున్నాయని మరచిపోకూడదు. అందుకే రైతులకు ప్రజలందరి మద్దతు ఉందనే సమాచారం అందరికి చేరాలి. అందుకే ఇలా చేశాను’ అంటూ వివరించాడు.
Haryana: Groom in Karnal leaves his luxury car behind & rides a tractor to his wedding venue to show support to farmers' protest.
“We might be moving to city but our roots are farming. Farmers should be priority. We want to send message that farmers have public support,” he says pic.twitter.com/KUgJkLleAy
అతని మేనమామ సురిందర్ నర్వల్ మాట్లాడుతూ ...'నా మేనల్లుడు వివాహానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశాము. అందంగా డెకరేట్ చెసిన వాహనాలను వియ్యలవారి కోసం సిద్ధం చేశాం. కానీ సుమిత్ అతని పెల్లి రథాన్ని చివరి క్షణంలో మర్చేశాడు. ట్రాక్టర్లో వచ్చి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. రైతులకు మద్దతు తెలియజేయడానికి సుమిత్ చేసిన ఈ చిన్న ప్రయత్నం ఎంతో మంచిది" అన్నారు నర్వల్. ఇక్కడ మరో విశేషం ఏమంటే పెళ్లి తంతు పూర్తైన తర్వాత ధుల్ దంపతులిద్దరూ కలిసి ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతుల నిరసన స్థలానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉంటే వారం రోజులకు పైగా కొనసాగుతున్న రైతుల నిరసనలో కథం తొక్కుతున్న రైతులకు, వారిస్తున్న భద్రతా సిబ్బందికి నడుమ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాల నుంచి వచ్చే రైతులతో ఢిల్లీ సరిహద్దులు ఉడికిపోతున్నాయి. ప్రస్తుతం రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఏకధాటిగా కొనసాగుతున్న చర్చలు గురువారానికి విఫలమయ్యాయి. నిరసనకారులైన రైతు సంఘాలు తమ డిమాండ్లలో ఏమాత్రం మార్పు ఉండదని తెగేసి చెప్పరు. తదుపరి చర్చలు శనివారం కొనసాగుతాయి.
హర్యానా, ఢిల్లీ సరిహద్దులో రైతులతో ప్రతిపక్షాలు కలిసాయి. కలసిన త్రుణముల్ కాంగ్రేసుకు చెందిన డెరెక్ ఓబ్రీన్ అక్కడ ఆందూళన చేస్తున్న రైతులను కలిశారు. సింఘు సరిహద్దు రహదారిలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను నిలిపి నిరసన తెలియజేస్తున్న రైతులతో నాలుగు గంటలపాటు మాట్లాడారు. ఇది ఇలా వుంటే, మరో వైపు రైతులకు మద్దతు తెలియజేసే క్రమంలో సమాజ్ అవాది పార్టీ సోమవారం నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుంచి 'కిసాన్ యాత్ర ' చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, సమాజ్ వాది పార్టి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.