హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Cow Dung-Neem Plaster : పేడతో ఇటుకలు.. ఇది కదా ఇన్నోవేషన్ అంటే..

Cow Dung-Neem Plaster : పేడతో ఇటుకలు.. ఇది కదా ఇన్నోవేషన్ అంటే..

పేడతో ఇటుకలు (image credit - twitter - @ErikSolheim)

పేడతో ఇటుకలు (image credit - twitter - @ErikSolheim)

Cow Dung-Neem Plaster : ఓ పెద్దాయన మనసులో మెదిలిన ఆలోచన.. సరికొత్త ఆవిష్కరణకు కేంద్రమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన పేరు మారు మోగుతోంది. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇండియా సంగతి మనకు తెలియందేముంది ఎండ ఎక్కువ. విపరీతమైన ఉక్కపోత. వేసవిలో ఎన్ని ఫ్యాన్లు వేసుకున్నా సరిపోదు. అలాగని అందరం ఏసీలు వాడలేం కదా. మరి ఎలా.. ఇళ్లలో వేడి తగ్గాలంటే ఏం చెయ్యాలి? అనే ప్రశ్నకు తన వంతుగా సమాధానం వెతికాడు హర్యానాకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శివదర్శన్ మాలిక్. ఓ మహిళ తన ఇంటికి పిడకలు వేయడాన్ని చూసిన ఆయన.. ఆ ఇంటి లోపల చల్లదనం ఎక్కువగా ఉండటాన్ని గమనించారు. అంటే.. పిడకలు ఇంటికి చల్లదనం ఇస్తున్నాయని గ్రహించారు. అలాంటప్పుడు అవే పిడకలతో ఇటుకలు తయారుచెయ్యలేమా అనే ఆలోచన ఆయన మనసులో మెదిలింది. అదే సంచలన ఆవిష్కరణకు దారితీసింది.

  శివదర్శన్ తయారుచేస్తున్న ఇటుకలు ప్రకృతికి హాని చెయ్యవు (eco-friendly). వాటిలో పేడతోపాటూ.. మరికొన్ని పదార్థాలు కలిపి చేస్తున్నారు. ఈ ఇటుకలు, పొడి వల్ల.. ఇళ్లలో వేడి 7 డిగ్రీలు తగ్గుతోందని తెలిసింది. ఇళ్ల నిర్మాణంలో వాడే కాంక్రీట్.. వేడిని పెంచుతుంది. శివదర్శన్ ఇటుకల వల్ల కాంక్రీట్ వాడకం బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఇళ్లలో వేడి తగ్గుతుంది. కాంక్రీట్ వల్ల పర్యావరణానికి హాని కూడా. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

  ఈ ట్వీట్‌ని నార్వేలో మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హెమ్ పోస్ట్ చేశారు. ఆవు పేడ, వేపతో తయారుచేసే ప్లాస్టర్ వల్ల ప్రొఫెసర్ ఏడాదికి రూ.10 లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ ట్వీట్‌ని నవంబర్ 22న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ 3.72 లక్షల మందికి పైగా చూశారు. 12 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

  ది బెటర్ ఇండియా చేసిన ఇంటర్వ్యూలో శివదర్శన్ తన వేదిక్ ప్లాస్టర్ (Vedic Plaster) గురించి తెలిపారు, దాన్ని పేడ, మట్టి ఇతర సహజ పదార్థాలతో తయారుచేసినట్లు వివరించారు. ఈ ప్లాస్టర్.. బయటి నుంచి వచ్చే వేడిని ఇళ్లలోకి రానివ్వదని తెలిపారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకూ, కరెంటు వాడకాన్ని తగ్గించేందుకూ ఇది మేలు చేస్తుందన్నారు.

  Crime : తాంత్రికుడి దుశ్చర్య.. శృంగారం చేస్తున్న జంట హత్య.. ఫెవీక్విక్‌తో..

  శివదర్శన్.. గోక్రీచ్ బ్రిక్స్ (Gocrete bricks) పేరుతో.. పేడతో ఇటుకలు తయారుచేస్తున్నారు. ఈ ఇటుకలు 70 శాతం వేడిని ఇళ్లలోకి రాకుండా ఆపుతాయని చెబుతున్నారు. వీటిని సాధారణ ఇటుకల కంటే 7 రెట్లు తక్కువ ధరకే ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్‌కి ప్రశంసలు దక్కుతున్నాయి.

  Published by:Kumar Krishna
  First published:

  Tags: Startups, Viral, Viral Video

  ఉత్తమ కథలు