హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Leopard: అధికారులకు చుక్కలు చూపించిన చిరుత పులి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Leopard: అధికారులకు చుక్కలు చూపించిన చిరుత పులి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

అదికారులపై దాడిచేస్తున్న చిరుతపులి

అదికారులపై దాడిచేస్తున్న చిరుతపులి

Haryana: చిరుతపులి దారి తప్పి గ్రామంలోనికి ప్రవేశించింది. దీంతో గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతపులిని రెస్క్యూ చెద్దామనుకుంటే.. వారే రిస్క్ లో పడ్డారు.

అడవిలోని జంతువులు కొన్నిసార్లు దారితప్పి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. అవి ఆహారం, నీటి జాడ కోసం అడవికి దగ్గరలోని గ్రామలలోకి వస్తుంటాయి. ఈ క్రమంలో మనుషులపై దాడి చేస్తుంటాయి. సాధారణంగా పులులు, చిరుతపులులు,ఎలుగు బంట్లు, ఏనుగులు దారితప్పి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. ఇవి మనుషులపై దాడిచేసిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ప్రస్తుతం ఒక చిరుతపులి గ్రామంలోనికి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana)  పాటిపట్ లో ఈ ఘటన జరిగింది. బెహ్రంపూర్ గ్రామ పరిధిలో ఒక చిరుత పులి హాల్ చేసింది. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే తమ సిబ్బందితో పాటు అక్కడికి చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంట్లో నక్కిన చిరుత పులి (Leopard) భయంతో బయటకు వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న అధికారులపై దాడికి పాల్పడింది. ముగ్గురు అధికారులను తన పంజాతో గాయపర్చింది. దీంతో అధికారులు దానిపై ఒక నిద్రమత్తు కల్గే సిరంజితో కాల్చారు. వెంటనే అది కిందపడిపోయింది. ఆ తర్వాత.. దాన్ని బోనులో బంధించారు.

ప్రస్తుతం చిరుత పులి (Leopard attack) అధికారులపై చేసిన దాడులను కొందరు గ్రామస్థులు వీడియో తీశారు. కాగా, హర్యానా ఎస్పీ దీనిపై స్పందించారు. తన ట్విటర్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశారు. అటవీ శాఖ అధికారులు ప్రాణాలకు తెగించి, చూపిన ధైర్యసాహాసాలకు పోలీసుల మీద ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత.. చిరుత పులిని సమీపంలోని అడవిలో తిరిగి వదిలేశారు. గాయలపాలైన ముగ్గురు పోలీసులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

First published:

Tags: Forest, Haryana, Leopard attack

ఉత్తమ కథలు