హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

సెక్యురిటీ సిబ్బందిపై అమానుషం... నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ.. ఆపై.. షాకింగ్ వీడియో వైరల్..

సెక్యురిటీ సిబ్బందిపై అమానుషం... నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ.. ఆపై.. షాకింగ్ వీడియో వైరల్..

సెక్యురిటీ సిబ్బందిపై దాడిచేస్తున్న వ్యక్తి..

సెక్యురిటీ సిబ్బందిపై దాడిచేస్తున్న వ్యక్తి..

Haryana: అపార్ట్ మెంట్ లోని వ్యక్తి లిఫ్ట్ ఎక్కాడు. అది కాస్త సాంకేతిక కారణాలతో కొన్ని నిముషాలపాటు ఆగిపోయింది. దీంతో లిఫ్ట్ నుంచి ఎమర్జెన్సీ అలారం మోగించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

కొందరు ప్రతిదానికి కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. ఒకరిపై కోపాన్ని మరోకరిపై తీస్తుంటారు. తమకు అధికారం ఉందని, హోదా ఉందని అమాయకులపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. ఇంకొందరు డబ్బులున్నాయని కోపంతో, చిన్న ఉద్యోగులను వేధిస్తుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana)  గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన జరిగింది. సెక్టార్ 50 లోని గురుగ్రామ్ క్లోజ్ నార్త్ అపార్ట్ మెంట్లో ఒక వ్యక్తి చేసిన పనిని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో ఉండే వరుణ్ నాథ్ అనే వ్యక్తి లిఫ్ట్ లో తన అపార్ట్ మెంట్ వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో లిఫ్ట్ కాస్త మధ్యలో ఆగిపోయింది. వెంటనే అతను ఎమర్జెన్సీ అలారం మోగించాడు. అప్పుడు.. వెంటనే సెక్యురిటీ సిబ్బంది, మరో వర్కర్ లు అక్కడికి చేరుకున్నారు. నిముషాల వ్యవధిలోనే లిఫ్ట్ తేరుచుకునేలా చేశారు. అయితే.. అతను బయటకు రాగానే కోపంతో ఊగిపోయాడు. వెంటనే, సెక్యురిటీ సిబ్బందిని నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ.. తన ప్రతాపం చూపించాడు. సోమవారం ఈ ఘటన జరిగింది.
సెక్యురిటీని తిడుతూ.. చెయిచేసుకున్నాడు. వెంటనే సెక్యురిటీ సోసైటి వారు నిరసన తెలిపారు. అంతే కాకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ తప్పేమి లేకున్నా.. తమపై అన్యాయంగా దాడిచేశాడని అతనిపై చర్యలు తీసుకొవాలని సెక్యురిటీ కుమార్ పోలీసు అధికారులకు తెలిపాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు.. అతను చేసిన పనిని ఆగ్రహంతో..‘నీ బలుపును ఇంట్లో చూయించుకో..’అంటూ ఏకీ పారేస్తున్నారు.


Published by:Paresh Inamdar
First published:

Tags: Haryana, Viral Video

ఉత్తమ కథలు