హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Trending: 87 ఏళ్ల వయసులో టెన్త్, ఇంటర్ పాస్.. ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదండోయ్

Trending: 87 ఏళ్ల వయసులో టెన్త్, ఇంటర్ పాస్.. ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదండోయ్

మార్క్ లిస్టు తీసుకుంటున్న ఓం ప్రకాశ్ చౌతాలా (Image: Twitter)

మార్క్ లిస్టు తీసుకుంటున్న ఓం ప్రకాశ్ చౌతాలా (Image: Twitter)

Haryana: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా 87 ఏళ్ల వయసులో 10వ తరగతి, 12వ తరగతి పాసయ్యారు.

ఏజ్ బార్ అయిన తరువాత కూడా కొందరు టెన్త్, ఇంటర్ పరీక్షలు పాస్ అవుతుంటారు. అయితే 87 ఏళ్ల వయసులో టెన్త్, ఇంటర్ పరీక్షలు పాస్ కావడం మాత్రమే నిజంగా ఓ విశేషమే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా 87 ఏళ్ల వయసులో 10వ తరగతి, 12వ తరగతి పాసయ్యారు. దీంతో ఆయనకు ఈరోజు చండీగఢ్‌లో హర్యానా (Haryana) ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు ఆయనకు మార్కుల పత్రాలను అందజేశారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (Om Prakash Chautala) గతేడాది తన 10వ తరగతి ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరీక్ష రాశారు. సిర్సాలోని ఆర్య గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఆయన పరీక్షకు హాజరయ్యారు. 86 ఏళ్ల వయసులో హర్యానా ఓపెన్ బోర్డ్ కింద 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయినప్పటికీ ఆయన ఇంకా 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనందున ఆయన పరీక్ష ఫలితం నిలిపివేయబడింది. దీంతో ఆయన తన 12వ తరగతి ఫలితాలను క్లియర్ చేయడానికి 10వ తరగతి పరీక్షకు హాజరయ్యారు.

అంతకుముందు చౌతాలా విద్యా శాఖ నుండి పరీక్ష రాసేందుకు అనుమతి తీసుకున్నారు. ఇందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. పరీక్ష ముగించుకుని రెండు గంటల తర్వాత సెంటర్ నుంచి వెళ్లిపోయాడు. ఇక చౌతాలా 2017లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుండి 10వ తరగతి పరీక్షలో ఉర్దూ, సైన్స్, సోషల్ స్టడీస్, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్‌లలో 53.4 శాతం మార్కులు సాధించి 82 సంవత్సరాల వయస్సులో ఉత్తీర్ణత సాధించారు. ఆయన తన 10వ తరగతి పరీక్షల కోసం 2013 సంవత్సరం నుండి జూలై 2, 2021 వరకు JBT రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో శిక్ష అనుభవిస్తూ తీహార్ జైలులో చదువుకోవడం విశేషం.

తాజాగా ఓం ప్రకాశ్ చౌతాలా 10, 12 తరగతి పరీక్షలు పాస్ కావడంతో.. ఆయన ఇంకా ఉన్నతస్థాయి చదవులు కూడా చదువుతారా ? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన పైచదువులు కూడా చదివేందుకు సిద్ధపడితే.. ఈ వయసులో కూడా చదువుకునేందుకు సిద్ధపడ్డ సీనియర్ రాజకీయ నేతగా అరుదైన రికార్డ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Karimnagar:సరిగ్గా కదల్లేని వాడు ఎస్‌ఐ ఏంటీ..ఆడవాళ్లను ఆ విధంగా టార్చర్‌ పెట్టడం ఏమిటి..

Pamban Bridge: ఇంజనీరింగ్ అద్భుతం.. ఇండియన్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి గురించి తప్పక తెలుసుకోండి..

ఇక రాజకీయాల విషయానికొస్తే ఓం ప్రకాశ్ చౌతాలా హర్యానాకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. జేబీటీ రిక్రూట్‌మెంట్ కేసులో ఆయనకు పదేళ్లపాటు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన పెరోల్ మీద బయట ఉన్నారు.

First published:

Tags: 10th Class Exams, Haryana

ఉత్తమ కథలు