Home /News /trending /

HARYANA COP WITH AXE THREATENS KICKS BIKERS PAH

Traffic Police: ఇదేం డ్యూటీరా నాయన.. గొడ్డలితో బెదిరిస్తూ.. కాలితో తన్నుతూ..

దాడి చేస్తున్న ట్రాఫిక్ పోలీసు

దాడి చేస్తున్న ట్రాఫిక్ పోలీసు

Haryana: ట్రాఫిక్ కానిస్టేబుల్ టూవీలర్ పైన తన ప్రతాపాన్ని చూపించాడు. గొడ్డలితో బెదిరిస్తు, కాలితో తన్నుతూ ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించాడు.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొన్ని సార్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police)  రోడ్లపైన ఇష్టమోచ్చినట్లు ప్రవర్తింస్తుంటారు. కొందరు ప్యాసింజర్ లపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపైన వెహికిల్స్ ను తనిఖీలు చేస్తుంటారు. కొన్నిసార్లు.. సరైన బండికాగితాలు లేకుండా వాహనదారులు రోడ్లపైకి వస్తుంటారు. ట్రిబుల్ రైడింగ్ చేస్తుంటారు. హెల్మెట్ లు పెట్టుకొరు, అంతే కాకుండా ఇన్సూరెన్స్ ఉంచుకోరు. ఇలాంటి..సందర్బాలలో ట్రాఫిక్ పోలీసులు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. భౌతిక దాడులకు పాల్పడటం, నోటికొచ్చినట్లు తిట్టడం చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana)  ఒక ట్రాఫిక్ పోలీసు (Traffic police) నడిరోడ్డుమీద కంట్రోల్ తప్పాడు. ఫరీదాబాద్ లోని బాటా చౌక్ సమీపంలో.. టూవీలర్ మీద ముగ్గురు యువకులు డ్రైవింగ్ చేసుకుంటూ రాంగ్ రూట్ లో రోడ్డు మీదకు వచ్చారు. వీరిని అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే కోపంతో.. అక్కడ ఉన్న ఒక గొడ్డలి తీసుకున్నాడు. నరుకుతా.. అంటూ వారి మీదకు వెళ్లాడు.



అంతటితో ఆగకుండా.. కాలితో తంతూ ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించాడు. ట్రాఫిక్ పోలీసును చూసి అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. మరో ప్రయాణికుడు తన మోబైల్ లో ఈ ఘటన రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త గా మారింది. ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.

ఇదిలా ఉండగా వెస్ట్ బెంగాల్ మంత్రిపై ఒక మహిళపై నిరసన తెలిపింది.

వెస్ట్ బెంగాలో (West bengal) వెలుగులోనికి వచ్చిన మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) స్కామ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయనను పదవిలో నుంచి తొలగించారు. ఆయనను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, మంత్రి పార్థ ఛటర్జీ.. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కోట్లాది రూపాయల వెనుకేసుకున్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఈ క్రమంలో.. ఆయనను ఈడీ ఆఫీస్ కు విచారణకు తీసుకెళ్తుండగా, ఈఎస్ఐ ఆస్పత్రిలో టెస్ట్ ల కోసం తీసుకెళ్లారు. ఆస్పత్రి బయట.. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి తమ నిరసనను తెలిపారు.
 అంతేకాకుండా.. ఒక మహిళ పార్థ ఛటర్జీపై ఏకంగా తన చెప్పును విసిరింది. మంత్రిపై ఆగ్రహంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా.. ఆయనపై విమర్శలు చేశారు.. "తాను మంత్రిపై నా షూ విసిరేందుకు వచ్చానని చెప్పింది. అతను అమాయక ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశాడని తెలిపింది. అతని తలపై షూ తగిలి ఉంటే నేను మరింత సంతోషంగా ఉండేవాడిని ”ఆమె చెప్పింది. అయితే.. ఈడీ అధికారులకు మంత్రి పార్థఛటర్జీ సరిగ్గా సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. తాము.. ప్రశ్నలడిగితే.. దాటవేస్తున్నాడని, అలిసిపోయినట్లు చేస్తున్నాడని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Haryana, Traffic police, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు