HOME »NEWS »TRENDING »harsh goenka shares valuable life lesson in his twitter post goes viral ms gh

Harsh Goenka: మీకేం కావాలో మీకు మాత్రమే తెలుసని అంటున్న హర్ష గోయెంకా.. ట్వీట్ వైరల్

Harsh Goenka: మీకేం కావాలో మీకు మాత్రమే తెలుసని అంటున్న హర్ష గోయెంకా.. ట్వీట్ వైరల్
హర్ష గోయెంకా (ఫైల్)

Harsh Goenka: హర్ష గోయెంకా ప్రస్తుత RPG గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలను, ఇతరులకు స్ఫూర్తినిచ్చే సందేశాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

  • News18
  • Last Updated: January 15, 2021, 19:09 IST
  • Share this:
సామాన్య నేపథ్యం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతోమంది ప్రముఖులు మన చుట్టూ ఉంటారు. ఇలాంటి వారి జీవిత పాఠాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలకు, సవాళ్లకు ఏమాత్రం బెదరకుండా లక్ష్యాలను సాధించడానికి కృషి చేసే మానసిక స్థైర్యాన్ని ఇలాంటి వారి అనుభవాలు మనకు ప్రసాదిస్తాయి. తాజాగా పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దీంట్లో ప్రజలకు ఆయన శక్తిమంతమైన సందేశాన్ని ఇచ్చారు. దీన్ని ఆయన అభిమానులు, ట్విట్టర్ ఫాలోవర్లు షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన తన ట్వీట్ లో ఏం చెప్పారంటే..

"We are who we choose to be" అనే టైటిల్‌తో ఉన్న ఈ ట్వీట్‌లో లక్ష్యాలు, కలల గురించి వివరించారు. మనం ఎంచుకున్న లక్ష్యాలను, సాధించాలనుకున్న కలలను ఎప్పటికీ విస్మరించకూడదని చెప్పారు. లక్ష్యాలను ఛేదించేందుకు నిరంతరం శ్రమ అవసరమని, ప్రయత్నాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉండాలని ఆయన సూచించారు.



హర్ష గోయెంకా ప్రస్తుత RPG గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలను, ఇతరులకు స్ఫూర్తినిచ్చే సందేశాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. "మిమ్మల్ని ఎవ్వరూ రక్షించరు. మిమ్మల్ని మీరే సేవ్ చేసుకోవాలి. జీవితంలో ఎవ్వరూ మీకు ఏమీ ఇవ్వరు. మీరే వాటిని పొందాలి. మీకు ఏం కావాలనేది మీకు తప్ప ఎవరికీ తెలియదు. అనుకున్నది సాధించకపోతే మీరు మాత్రమే ఓడిపోతారు. అందువల్ల జీవితంలో ఏ విషయంలోనైనా వెనకడుగు వేయకండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి" అని హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ పోస్ట్‌లో వివరించారు.

వైరల్ అవుతున్న ట్వీట్





ఈ ట్వీట్‌ను గోయెంకా అభిమానులు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కొన్ని వందలమంది యూజర్లు ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. అభిమానులు కామెంట్లు పెడుతూ ఆయన మీద ఎంత గౌరవం ఉందో చెబుతున్నారు. "మీ మాటలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి" అని ఒక వ్యక్తి గోయెంకా ట్వీట్‌కు కామెంట్ పెట్టాడు. ‘మీ మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి’ అని మరో వ్యక్తి కామెంట్ రాశాడు. ఇలా కొన్ని వందల మంది ఆయనపై అభిమానాన్ని చాటుతున్నారు.
Published by:Srinivas Munigala
First published:January 15, 2021, 19:07 IST