• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • HARSH GOENKA SHARES A FUNNY VIDEO IN TWITTER GOES VIRAL IN SOCIAL MEDIA MS

Harsh Goenka: అద్భుతాలు జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక పరుగందుకోక మానరు.. ఇదిగో ఈ వీడియోలాగా..

Harsh Goenka: అద్భుతాలు జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక పరుగందుకోక మానరు.. ఇదిగో ఈ వీడియోలాగా..

image credits Twitter

Viral Video: ఇక్కడ ఒక వ్యక్తి అద్భుతం చేశాడు. కానీ దానిని అందరూ గుర్తించే సమయంలోనే అక్కడ్నుంచి పరుగందుకున్నాడు. అదేంటి.. అతడినెవరైనా కొట్టారా...? అని అనుకుంటున్నారా..? అస్సలు కాదు.. ఇది చదివితే ఆ అద్భుతమేంటో మీకూ తెలుస్తుంది.

  • News18
  • Last Updated:
  • Share this:
    ‘అద్భుతాలు జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు. కానీ జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన పన్లేదు...’ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. అదేనండి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ఖలేజా సినిమాలోనిది. ఇక్కడ ఒక వ్యక్తి కూడా అలాంటి అద్భుతమే చేశాడు. కానీ దానిని అందరూ గుర్తించే సమయంలోనే అక్కడ్నుంచి పరుగందుకున్నాడు. అదేంటి.. అతడినెవరైనా కొట్టారా...? అని అనుకుంటున్నారా..? కాదు అతడే జనాల దగ్గర అన్యాయంగా నొక్కేసిన డబ్బులను మరో వ్యక్తి కొట్టేసినందుకు అతడు పరుగందుకున్నాడు. ఇందులో వింతేముంది...! అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నా. అప్పటిదాకా కాళ్లు లేని వాడు.. ఉన్నపళంగా పరుగు లంకించుకుంటే వింతే కదా మరి....

    సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. వీడియోలో ఒక వ్యక్తి బిజీగా ఉన్న రోడ్డులో ‘కాళ్లు లేని కబోదిని బాబు.. ధర్మం చేయండి బాబు....’ అంటూ యాచిస్తూ ఉన్నాడు. అతడి ధీన స్థితిని చూసి పలువురు నిజంగా అతడికి కాళ్లు లేవేమో అని తమకు చేతనైన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అతడు రోడ్డు మీద చిన్న తోపుడు బండి సాయంతో తోసుకుంటూ ముందుకెళ్తున్నాడు.

    అదే సమయంలో అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు దీనిని వీడియో తీస్తున్నారు. అప్పుడు అక్కడికి ఒక యువకుడు వచ్చి.. ఆ వికలాంగుడు (వాస్తవానికి కాదు) దగ్గరికెళ్లి తన ముందు ఉన్న డబ్బాలో డబ్బులు వేయబోయాడు. ఇంతలో అతడితో ఏదో మాట్లాడుతూ కింద ఉన్న వాడిని మాటల్లో పెట్టాడు. డబ్బులు డబ్బాలో వేసినట్టుగా వేసి.. దానిని పట్టి పక్కనే ఉన్న వీధిలోకి పరిగెత్తాడు. ఇది చూసిన ఆ వికలాంగ నటుడికి ఉన్నట్టుండి కాళ్లు వచ్చాయి. తన డబ్బుల డబ్బాను ఎత్తుకెళ్తున్న వాడి వెనక ఇతడు పరిగెత్తాడు.





    ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హర్ష్ గోయెంకా ఈ వీడియోను షేర్ చేస్తూ... ‘అద్భుతాలు జరుగుతాయి...’ అంటూ రాసుకొచ్చారు. దీనికి నెటిజన్లు కూడా అంతే హాస్యంగా స్పందిస్తున్నారు. పలువురు నెటిజన్లు దీనికి.. ‘సార్.. ఇది మనిషి చేసిన అద్భుతం...’ అని మరికొందరు 100*100 మీటర్ల పరుగు పందెమని కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకాలస్యం. మీరూ ఓ లుక్కేయండి. ఆ అద్భుతాన్ని వీక్షించండి.. ఇలాంటి వీడియోలు షేర్ చేయడంలో హర్ష్ గోయెంకా ది ప్రత్యేక శైలి. కోవిడ్ సమయంలో కూడా ఆయన పలు ఆసక్తికర వీడియోలను ట్విట్టర్ లో పంచుకున్న విషయం విదితమే.
    Published by:Srinivas Munigala
    First published: