Home /News /trending /

HARIDWAR GROOM SUED BY FRIENDS FOR RS 50 LAKH AFTER HE DITCHED THEM AND LEFT WITH BAARAT EARLY

పెళ్లిలో హర్ట్ అయిన స్నేహితులు.. వరుడిపై 50 లక్షల పరువు నష్టం దావా.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttarakhand: పెళ్లి వేడుక జరుగుతుంది. మండపంలో స్నేహితులు, బంధువులు వస్తున్నారు. అయితే, వరుడి స్నేహితులు వింతగా ప్రవర్తించారు. తమను పెళ్లికి పిలిచి ఇన్సల్ట్ చేశారని బాధపడ్డారు.

పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రతి ఒక్కరు తమ పెళ్లిని జీవితంలో మరిచిపోలేని విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకప్పటి లాగా పెళ్లిళ్లను ఇప్పటి యువకులు సాదాసీదగా జరుపుకొవడం లేదు. పెళ్లి కోసం ఈవేంట్ ఆర్గనైజర్స్ లను సంప్రదిస్తున్నారు. ఎంత ఖర్చు చేయడానికైన వెనుకాడటం లేదు. ప్రీవెడ్డింగ్ నుంచి హల్దీ, బరాత్, మెహందీ ప్రతి ఒక్క వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పెళ్లిళ్లలో ఉండే సందడే వేరు. స్నేహితుల డ్యాన్స్ లు, బంధువుల సరదా కబుర్లు, డీజే డ్యాన్స్ లు, అమ్మాయిలు మాస్ స్టెప్పులు అన్ని ఇన్ని కావు. అయితే, కొన్ని సార్లు పెళ్లిలో అనుకొని సంఘటనలు జరిగి కూడా ఆ పెళ్లిళ్లు వార్తలలో నిలిచాయి. మరోక పెళ్లి (Wedding)  ఘటన వార్తలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తరఖండ్ లో (Uttara khand) వింత ఘటన జరిగింది. హరిద్వార్ లోని బహదూరాబాద్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. రవి అనే పెళ్లి కొడుకు.. తన పెళ్లి వేడుకను (Marriage)  గ్రాండ్ గా చేసుకుంటున్నాడు. దీనికోసం ఒక రేంజ్ లో అరెంజ్ మెంట్స్ చేశాడు. అయితే,పెళ్లి రోజు.. బరాత్ వేడుక జరిగింది.

అయితే, వరుడు స్నేహితులు రాకుండానే బరాత్ కు వెళ్లిపోయాడు. దీంతో అతని స్నేహితులు హర్ట్ అయ్యారు. చెప్పిన సమయాని కంటే ముందే వరుడు వెళ్లిపోయాడని, వరుడి స్నేహితులు అలిగారు. తమకు పెళ్లికి పిలిచి అవమానపర్చారని భావించారు. ఈక్రమంలో.. వరుడి స్నేహితుడు చంద్ర శేఖర్, వరుడు రవిపై యాభై లక్షల రూపాయలను పరువు నష్టం దావ వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ వింత ఘటన నెట్టింట (Social media) వైరల్ గా (viral news) మారింది.

ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు.

ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.

అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Uttarakhand, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు