బీసీసీఐ సంచలన నిర్ణయం... పాండ్యా, రాహుల్‌‌లపై నిరవధిక సస్పెన్షన్...

పాండ్యా ప్లేస్‌లో రవీంద్ర జడేజాను తీసుకుంటామని చెప్పిన కెప్టెన్ కోహ్లీ... లీగల్ బెంచ్ నిర్ణయం తీసుకునేదాకా ఎదురుచూడడం ఎందుకని భావిస్తున్న సెలక్టర్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 7:52 PM IST
బీసీసీఐ సంచలన నిర్ణయం... పాండ్యా, రాహుల్‌‌లపై నిరవధిక సస్పెన్షన్...
‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో పాల్గొన్న సమయంలో హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 7:52 PM IST
బీసీసీఐ సీఓఏ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో క్రికెటర్లు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల గురించి విచారణ పూర్తయ్యేవరకూ... హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్‌లపై నిరవధిక సస్పెన్షన్ విధించింది. విచారణ మొత్తం పూర్తయ్యే, సీఓఏ నిర్ణయం ప్రకటించేవరకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనే కాకుండా ఐపీఎల్ లాంటి ఆర్గనైజ్డ్ పోటీల్లోనూ పాల్గొనకూడదని నిర్ణయం వెల్లడించింది. దీంతో ఆసీస్‌తో వన్డే సిరీస్ మొత్తానికే కాదు... న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు దూరం కానున్నారు ఈ ఇద్దరూ యువ క్రికెటర్లు. ఏం ఆశించి... ‘కాఫీ విత్ కరణ్’ షోకి వెళ్లారో తెలీదు కానీ ఆ ఎఫెక్ట్ హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్‌పై మామూలుగా పడలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేక పాండ్యా తలలు పట్టుకుంటున్న... ఈ ఆల్‌రౌండర్‌కు సస్పెన్షన్ వేటు మరింత ఆవేదనకు గురి చేయనుంది.. ఇప్పటికే ఫామ్ లేని కారణంగా జట్టులో చోటు కోల్పోయిన కెఎల్ రాహుల్‌ కష్టాలు ఇప్పుడు మరింత పెరగనున్నాయి. అసలే ఫామ్‌లో లేడు... అందులోనూ వివాదాల్లో చిక్కుకున్నాడు దాంతో రాహుల్‌ను ఈజీగా పక్కనపెట్టేస్తాడు కోహ్లీ. దానికి తోడు హార్ధిక్ పాండ్యాను తీసుకుని హాట్ కాఫీతో కాల్చుకునేకంటే... అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తీసుకోవడమే బెటర్ అని ఫిక్స్ అయ్యాడు కెప్టెన్ కోహ్లీ.

ఆసీస్ టూర్‌లో ఘోరంగా విఫలమయ్యాడు భారత ఓపెనర్ కెఎల్ రాహుల్... పూజారా, కోహ్లీ, మయాంక్ అగర్వాల్... ఇతర బ్యాట్స్‌మెన్ కొద్దోగొప్పో రాణించడంతో ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది టీమిండియా. గాయం కారణంగా జట్టుకు దూరమై, వన్డే సిరీస్ కోసం వచ్చిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... ఈ ఇద్దరూ అనుకోని చిక్కుల్లో చిక్కుకున్నారు. హిందీ పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొని... రచ్చ రచ్చ చేసిన ఈ ఇద్దరు యంగ్ క్రికెటర్లు, ఆ షోలో మాట్లాడిన కొన్ని అనుచిత వ్యాఖ్యల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.

Hardik Pandya, KL Rahul Face Two-ODI Ban for 'Sexist' Remarks on Koffee With Karan పాండ్యా, రాహుల్‌లను రెండు వన్డేల నుంచి తప్పించండి... బీసీసీఐకి వినోద్ రాయ్ సూచన
హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ (Photo: twitter)


ఇప్పటికే ఫామ్ కోల్పోయి సోషల్ మీడియా జనాల ట్రోలింగ్ బారిన పడిన ఓపెనర్ కెఎల్ రాహుల్... పాండ్యా చేసిన ఓ చిలిపి వ్యాఖ్య కారణంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ‘టాక్ షో’ రచ్చ ఎంతవరకూ వెళ్లిందంటే... ‘అక్కడ అలా ఎందుకు మాట్లాడారు... మాకు 24 గంటల్లో వివరణ ఇవ్వాలి...’ అంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షోకాజ్ నోటీసులు ఇచ్చేదాకా! తాజాగా పాండ్యా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ సీఓఏ (కమిటీ ఆడ్మినిస్టేటర్ చీఫ్) వినోద్ రాయ్... ఇద్దరికీ రెండు వన్డేల నుంచి తప్పించాలని సూచించారు. అయితే మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకునేదాకా ఎదురు చూసే కంటే... పాండ్యాను తప్పించి జడేజాను జట్టులో చేర్చుకోవడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు సెలక్టర్లు. ఇంతలోనే సంచలన నిర్ణయం తీసుకుంది సీఓఏ.



బీసీసీఐ లీగల్ సెల్‌కు ఈ వివాదాన్ని మళ్లిచ్చిన వినోద్ రాయ్... ‘హార్ధిక్ పాండ్యా ఇచ్చిన వివరణ నాకు సంతృప్తినివ్వలేదు. అందుకే ఇద్దరికీ రెండు వన్డేల నుంచి తప్పిస్తే తిక్క కుదురుతుంది. సీఓఏ డయానా ఎడుల్జీకే ఫైనల్ డిసిషన్ తీసుకునే అధికారాన్ని ఇచ్చేశాం. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి...’ అన్నారు. తాజాగా ఆమె ఈ ఇద్దరిపై నిరవధిక సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే... కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహారించే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో సహచరుడు కెఎల్ రాహుల్‌తో కలిసి పాల్గొన్నాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఈ సందర్భంగా మనోడు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ... ‘మా ఇంట్లోవాళ్లతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సెక్స్‌కు సంబంధించిన విషయాలు కూడా చెబుతుంటా. అమ్మాయిలతో ఎంజాయ్ చేసినప్పుడు కూడా వారి దగ్గర ఆ విషయాలు దాచను. నేను ఫస్ట్ టైమ్ సెక్స్ చేసిన సందర్భం కూడా చెప్పాను...’ అంటూ వ్యాఖ్యానించిన హార్ధిక్ పాండ్యా... ‘అమ్మాయిల బ్యాక్ నాకెంతో సెక్సీగా అనిపిస్తుంది. వాళ్ల బ్యాక్ అందాలు చూసేందుకే నేను వెనక నడుస్తూ ఉంటా...’ అంటూ రెచ్చిపోయే వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు పురుషాహంకారం స్పష్టంగా కనిపించేలా... ‘అది, ఇది, దాన్ని’ అంటూ ఉచ్ఛరిస్తూ మాట్లాడాడు హార్ధిక్ పాండ్యా. దాంతో మహిళా సంఘాల పాటు క్రికెట్ అభిమానులు మనోడి వైఖరిని కామెంట్లతో చీల్చి చెండాడేస్తున్నారు. దాంతో స్పందించిన హార్ధిక్ పాండ్యా... ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు.

Cricket news in telugu, India vs Australia, Indian All-rounder Ravindra Jadeja, Ravindra Jadeja Hair Styles, Cricketers funny Hair Styles, క్రికెట్, రవీంద్ర జడేజా, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్‌స్టాగ్రామ్
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా
Loading...
‘కాఫీ విత్ కరణ్’ షోలో నేను మాట్లాడిన మాటలు ఎవ్వరినైనా బాధపెట్టిఉంటే నన్ను క్షమించండి... నేను ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయాలని అలా మాట్లాడలేదు. కొంచెం అతి చేశాను...’ అంటూ పేర్కొన్నాడు హార్ధిక్ పాండ్యా. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యాను, అతనితో పాటు టీవీ కార్యక్రమంలో పాల్గొన్న కెఎల్ రాహుల్‌ను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు పంపించింది బీసీసీఐ. 24 గంటల్లో అలా ఎందుకు మాట్లాడారో వివరణ ఇవ్వాలని కోరింది. ఇదే షోలో... ‘సచిన్ టెండుల్కర్ కంటే విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మెన్’ అంటూ ఈ ఇద్దరూ చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...