New Year 2020: న్యూ ఇయర్ పార్టీ ఇష్టం లేదా? ఈ 10 పనులు చేయొచ్చు

New Year 2020: న్యూ ఇయర్ పార్టీ ఇష్టం లేదా? ఈ 10 పనులు చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Happy New Year 2020 | న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి తెలుసు కదా? కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి కొత్త సంవత్సరానికి మించిన ముహూర్తం ఉండదు. కొత్తకొత్త గేమ్స్ ఏవైనా నేర్చుకోండి. వారితో కలిసి ఆడండి. ఆ ఒక్కరోజు నేర్చుకున్న గేమ్స్ ఇకపై మీకు వీకెండ్స్‌లో మంచి వినోదాన్ని పంచుతాయి.

 • Share this:
  డిసెంబర్ 31 వస్తుందంటే కుర్రాళ్లకు పండగే. 10 రోజుల ముందు నుంచే న్యూ ఇయర్ పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని ప్లాన్ చేస్తుంటారు. జనవరి 1న రోజంతా ఎంజాయ్ చేస్తారు. అయితే కొందరికి మాత్రం ఇలా డబ్బు వృథాగా ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేయాలంటే ఖర్చు తక్కువేమీ కాదు. ఎవరి బడ్జెట్‌లో వాళ్లు పార్టీలు చేసుకుంటారు. న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేస్తారు. రూ.5,000-రూ.10,000 మధ్య ఖర్చు చేసేవాళ్లు ఎక్కువే. అయితే అంతే ఖర్చు పెట్టినా ఎప్పట్లా కాకుండా కొత్తగా న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి.

  1. ఇంటి అలంకరణ
  కొత్త సంవత్సరంలో మీ ఇంటిని కొత్తగా మార్చేయండి. జనవరి 1న సెలవు పెట్టడం చాలామందికి అలవాటు. మీరు కూడా సెలవు పెడితే ఇంటిని అలంకరించేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. పార్టీకి ఖర్చు చేసే డబ్బుతో ఏవైనా డెకరేటీవ్ ఐటమ్స్ కొనుక్కొని ఇంటిని చక్కగా అలంకరించండి. జిగేల్మనిపించే లైటింగ్‌ ఏర్పాటు చేయండి. న్యూ ఇయర్ పార్టీతో ఆ ఒక్కరోజే ఆనందం దొరుకుతుందేమో కానీ... ఇంటిని మంచి మంచి డెకరేటీవ్ ఐటమ్స్‌తో అందంగా అలంకరిస్తే... వాటిని చూసినప్పుడల్లా మీకు ఆనందమే ఆనందం. ఎవరైనా గెస్ట్‌లు వస్తే వారి నుంచి పొగడ్తలూ మీకు బోనస్సే.

  2. ఫ్యామిలీ గెట్-టుగెదర్
  మీ కుటుంబమంతా ఒకే చోట కలిసి విందు చేసుకొని ఎన్నాళ్లయిందో ఓసారి గుర్తుతెచ్చుకోండి. ఈ రోజుల్లో ఎవరికివాళ్లు ఎవరి పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. కుటుంబమంతా కలిసే సమయమే దొరకట్లేదు. అందుకే కుటుంబంతో కలిసి గడిపేందుకు కేటాయించండి. పిల్లలతో గడిపేందుకు సమయం దొరకట్లేదనుకునేవాళ్లు... కొత్త సంవత్సరాన్ని ఫ్యామిలీ గెట్-టుగెదర్‌తో ప్రారంభించండి.

  న్యూ ఇయర్ పార్టీకి బదులు ఈ 10 పనులు చేయండి | 10 Alternative ways to celebrate New Year Party

  3. విందు
  మీ బంధువుల్ని, స్నేహితుల్ని ఇంటికి పిలిచి చక్కని విందు ఏర్పాటు చేయండి. వారికి ఇష్టమైన డిషెస్‌ని మీరే స్వయంగా తయారు చేయండి. రుచి ఎలా ఉంటుందో అన్న ఆలోచన వద్దు. మీరు స్వయంగా వండి వడ్డించారంటే... అతిథులకు ఆ ఆనందమే వేరు. కొత్త సంవత్సరం తొలిరోజున స్నేహితులు, బంధువులతో మీ ఇల్లు కళకళలాడటం ఖాయం.

  4. టూర్ ప్లాన్ చేయండి
  టూర్ అంటే... వారం రోజులే వెళ్లక్కర్లేదు. రెండు రోజులకు దగ్గర్లో ఏదైనా మంచి టూరిస్ట్ స్పాట్ ఉంటే వెళ్లొచ్చు. పార్టీకి కేటాయించిన బడ్జెట్‌తో ఫ్యామిలీ మొత్తం హాయిగా టూర్ ఎంజాయ్ చేయొచ్చు.

  5. బహుమతులు పంచండి
  జాయ్ ఆఫ్ గివింగ్ అంటారు తెలుసుకదా? ఏదైనా తీసుకుంటే వచ్చే ఆనందం కన్నా మనమే ఇతరులకు ఇస్తే ఆ ఆనందమే వేరు. మీ కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం బహుమతులు కొనండి. బహుమతులు పంచుకోడవం మన సంప్రదాయంలో భాగం.

  న్యూ ఇయర్ పార్టీకి బదులు ఈ 10 పనులు చేయండి | 10 Alternative ways to celebrate New Year Party

  6. ఎవరికైనా సాయం చేయండి
  మీరు రూ.5,000-రూ.10,000 ఖర్చు చేసి పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. కానీ కొందరికి ఆ డబ్బుతో ఓ నెలంతా గడిచిపోతుంది. అలాంటివారికి ఏదైనా సాయం చేయండి. నిరుపేద పిల్లలకు మంచిమంచి బొమ్మలు, పుస్తకాలు, దుస్తులు కొనివ్వండి. వారి కళ్లల్లో ఆనందం చూడండి.

  7. కొత్తగా ఏదైనా నేర్చుకోండి
  న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి తెలుసు కదా? కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి కొత్త సంవత్సరానికి మించిన ముహూర్తం ఉండదు. కొత్తకొత్త గేమ్స్ ఏవైనా నేర్చుకోండి. వారితో కలిసి ఆడండి. ఆ ఒక్కరోజు నేర్చుకున్న గేమ్స్ ఇకపై మీకు వీకెండ్స్‌లో మంచి వినోదాన్ని పంచుతాయి.

  8. బంధువుల ఇళ్లకు వెళ్లండి
  బిజీ లైఫ్‌లో బంధువుల ఇళ్లకు వెళ్లడం కాదు కదా... వారికి కనీసం ఫోన్ చేసి పలకరించే తీరిక ఉండట్లేదు. అందుకే బంధువుల ఇళ్లకు వెళ్లండి. అందరి దగ్గర కాస్త సమయం గడపండి. మంచి మంచి బహుమతులు ఇవ్వండి. మీరు ఉండేది అక్కడ ఒక్క పూట అయినా వారికి ఆ సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

  9. మీ తల్లిదండ్రుల్ని పట్టించుకోండి
  ఉద్యోగాలు, వృత్తి, పిల్లల చదువులు... ఇలా పలు కారణాలతో చాలామంది తల్లిదండ్రుల్ని సొంతూళ్లో వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అమ్మానాన్నల్ని పలకరించి వారి ఆరోగ్యం గురించి ఆరా తీయండి. ఆస్పత్రి ఖర్చులు, మందులు, ఇతర అవసరాలేంటో తెలుసుకోండి. ఇలాంటి సమయంలో వారికి తోడుగా ఉంటే వచ్చే ఆనందం... మీకు లక్ష రూపాయలతో పార్టీ చేసుకున్నా రాదు.

  10. ఏదైనా హోమ్‌కు వెళ్లండి
  అనాథలు, వికలాంగులు, వృద్ధుల కోసం చాలా ఆశ్రమాలున్నాయి. వారి జీవితంలో ఏ వేడుక ఉండదు. అలాంటిచోటికి వెళ్లి పార్టీ సెలబ్రేట్ చేసుకోండి. అనాథలు, వికలాంగులకు ఏవైనా వస్తువులు అవసరమైతే కొనివ్వండి. ఖర్చు ఎక్కువైనా పర్లేదు. కానీ... ఆ ఒక్కరోజు వారిది దొరికే ఆనందం వెలకట్టలేనిది.

  రూ.8,199 ధరకే నోకియా 2.3 సేల్... ఫోన్ ఎలా ఉందో చూడండి  ఇవి కూడా చదవండి:

  January 1 New Rules: రేపటి నుంచి మారే రూల్స్ ఇవే... తెలుసుకోండి

  New Year Stickers: వాట్సప్‌లో న్యూ ఇయర్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

  Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్... మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే
  Published by:Santhosh Kumar S
  First published: