హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Fathers day 2021: జోరు వాన.. కూతురి చదువు.. గొడుగు పట్టిన తండ్రి.. నెటిజన్ల సలామ్

Fathers day 2021: జోరు వాన.. కూతురి చదువు.. గొడుగు పట్టిన తండ్రి.. నెటిజన్ల సలామ్

కూతురి చదువు.. గొడుగు పట్టిన తండ్రి (image credit - twitter)

కూతురి చదువు.. గొడుగు పట్టిన తండ్రి (image credit - twitter)

Father's day 2021: హృదయాల్ని కదిలించే ఘటన ఇది. తండ్రి అనే మాటకు అర్థం చెప్పిన దృశ్యం ఇది. అందుకే నెటిజన్లు జోరుగా స్పందిస్తున్నారు. వారి కళ్ల లోంచీ... ఆనంద భాష్పాలు ప్రవాహంలా పొంగుగొస్తున్నాయి.

Father's day 2021: పిల్లలుగా మనం పేరెంట్స్‌కి ఏం ఇస్తామో గానీ... తల్లిదండ్రులుగా వారు మాత్రం పిల్లలకు అన్నీ ఇచ్చేస్తారు. ఇవళ ఫాదర్స్ డే కదా... ఈ సందర్భంగా ఓ గొప్ప తండ్రి గురించి తెలుసుకుందాం. అది కర్ణాటక రాష్ట్రం... దక్షిణ కన్నడ జిల్లా... సుల్లియా తాలూకాలోని... బల్లాక అనే చిన్న గ్రామం. కర్ణాటకలో కరోనా కాస్త ఎక్కువగానే ఉంది కదా... అందువల్ల అక్కడ ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. బల్లాకలో ఆ అమ్మాయి... SSLC చదువుతోంది. ఇంట్లో సెల్ సిగ్నల్స్ అంతగా రావు. దాంతో... ఆ బాలిక... బయట ఎక్కడో ఉంటూ ఆన్‌లైన్ క్లాసులకు మొబైల్ ద్వారా ప్రిపేర్ అవుతోంది. కానీ తాజాగా జోరు వర్షం పడుతుంటే... అటు ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ కావాల్సి వచ్చింది. కూతురు బాగా చదవడమే తనకు ముఖ్యం అనుకున్న తండ్రి నారాయణ... "నువ్వు చదువుకోమ్మా... నేను గొడుగు పడతాను" అన్నాడు. తన కోసం నాన్న గొడుగు పడతాను అనడంతో... ఆమెకు నోట మాట రాలేదు.

ఇదిగో ఇలా రోడ్డు సైడ్... తండ్రి గొడుగు పడితే... ఆ అమ్మాయి... మొబైల్‌లో ఆన్‌లైన్ క్లాసులు చదవసాగింది. అది స్థానిక జర్నలిస్ట్ పుచ్చపాడి మహేష్ చూశారు. ఆశ్చర్యపోయాడు. వెంటనే ఫొటో తీశాడు. ఆ ఫొటో వైరల్ అయ్యింది. అదే ఇది. ఇది చూసి నెటిజన్లు ఆ తండ్రికి సలాం కొడుతున్నారు.

కూతురి చదువు.. గొడుగు పట్టిన తండ్రి (image credit - twitter)

ఫొటో తీశాక... ఇంత వర్షంలో ఎందుకు చదువుతున్నావు... ఇంటికెళ్లి చదవొచ్చుగా అని అడిగితే... ఇంట్లో సిగ్నల్స్ సరిగా రావనీ... రోజూ తాను ఇక్కడికే వచ్చి చదువుకుంటానని చెప్పింది. దాంతో... మన దేశంలో ఇంటర్నెట్ సరిగా రాని ప్రాంతాలు చాలా ఉన్నాయనే విషయాన్ని మరోసారి ఈ ఘటన గుర్తుచేసినట్లైంది.

ఇది కూడా చదవండి:Fathers Day 2021: ఈ 6 సూత్రాలతో తండ్రుల ఆరోగ్యం పదిలం

ఆమె మాత్రమే కాదు... ఇక్కడి గుత్తిగర్, బల్లాక, కమిలా ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు ఇలాగే బయట ఎక్కడికో వెళ్లి... చదువుకుంటున్నారు. ఈ ఆన్‌లైన్ క్లాసులు కాన్సెప్ట్ బాగానే ఉన్నా... విద్యార్థులకు అది అంతగా ఉపయోగపడట్లేదన్నది నిజం.

ఇది కూడా చదవండి: King Cobra: పామును చేతులతో పట్టుకున్న యువతి... వీడియోకి 80 లక్షల వ్యూస్

ప్రస్తుతం ఆ గ్రామాల్లో BSNL నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఐతే... అక్కడ కరెంటు పోతే... మొబైల్ సరిగా పనిచెయ్యదు. మన తెలుగు రాష్ట్రాల్లో 4జీ నెట్‌వర్క్ ఉంది. అక్కడి గ్రామాల్లో ఇంకా 3జీయే ఉంటోంది. "ఈ సమస్య పరిష్కారానికి మేం ప్రయత్నిస్తున్నాం... భారత్ ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ అక్కడ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాం" అని అక్కడి BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జీఆర్ రవి తెలిపారు.

First published:

Tags: Fathers Day 2021, Happy Fathers Day

ఉత్తమ కథలు