• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • HAPPY FATHERS DAY 2021 FATHERS DAY 2021 WHAT WE LEARN KNOWLEDGE FROM LORD SHIVA TATVA IN VIEW OF FATHERS DAY NK

Fathers Day 2021: తండ్రికి అర్థం చెప్పిన త్రినేత్రుడు... గణేశుడికి పునరుజ్జీవం

తండ్రికి అర్థం చెప్పిన త్రినేత్రుడు... గణేశుడికి పునరుజ్జీవం... (credit - twitter)

Happy Father's Day 2021: మన పురాణాల్లో తండ్రి ఎంత గొప్పవాడో చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వినాయకుడి విషయంలో ఆ పరమశివుడు తన బాధ్యతను ఎలా నిర్వర్తించారో జూన్ 20న ఫాదర్స్ డే సందర్భంగా తెలుసుకుందాం.

  • Share this:
    Happy Father's Day 2021 : పరమశివుడు ఎంత దయామయుడో... అంత కఠినాత్ముడు కూడా. అందుకే... ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. కానీ... ఈశ్వరుడు అలా ఆగ్రహించిన సందర్భాలు తక్కువే. ఐతే... పార్వతీ తనయుడు... వినాయకుడి విషయంలో మాత్రం... పొరపాటు జరిగిపోయింది. కైలాసంలో శివుడు పనిమీద బయటకు వెళ్లిన సందర్భంలో... పార్వతీదేవి... స్నానానికి వెళ్లాలని అనుకుంది. ఆ సమయంలో... అటువైపుగా ఎవరూ రాకుండా ఉండేందుకు... చిట్టి వినాయకుడి ప్రతిమను తయారుచేసి... ప్రాణం పోసింది. కైలాసం ముందు కాపలా ఉంచింది. ఈ విషయం తెలియని శివుడు... ఎప్పటిలాగే కైలాసానికి వచ్చాడు. విఘ్నేశ్వరుడు అడ్డుకున్నాడు. ఆశ్చర్యపోయిన శివుడు... నాకే అడ్డొస్తావా... తప్పుకో అని గద్దించాడు. ఐతే... గణపతి ఎంతకీ వెనక్కి తగ్గలేదు. ఆగ్రహించిన శివుడు వినాయకుడి తలను తీసేశాడు. దాంతో వినాయకుడు నిర్జీవంగా పడిపోయాడు.

    స్నానం చేసిన వచ్చిన పార్వతీ దేవి... వినాయకుడిని చూసి... ఆశ్చర్యపోయింది. మీ కొడుకును మీరే చంపేశారు అంటూ... కన్నీటి సంద్రమైంది. తన కొడుకును తనకు తిరిగి ఇవ్వాల్సిందే అంటూ... ఆగ్రహంతో ఊగిపోయింది. దాంతో... ముక్కోటి దేవతలూ వచ్చి... శివుడిని వేడుకున్నారు. ఏదో ఒకటి చేసి... వినాయకుణ్ని బతికించమన్నారు. ఓ తండ్రిగా తాను పొరపాటు చేశాననీ, చిన్న పిల్లాడిపై ఆగ్రహం చూపించానని గ్రహించిన పరమశివుడు... వినాయకుడికి ఏనుగు తలను సెట్ చెయ్యడం ద్వారా తిరిగి ప్రాణం పోశాడు. ఇలా... తండ్రి అంటే... బాధ్యత కలిగి ఉండాలనీ... తప్పు చేస్తే... సరిదిద్దుకోవాలనే సందేశాన్ని ఇచ్చాడు. విఘ్నేశ్వరుడి పునరుజ్జీవంతో... ముక్కోటి దేవతలూ... పరమానందం పొందారు.

    ఇక్కడే మరో గొప్ప విషయం కూడా ఉంది. వినాయకుడిని విఘ్నాధిపతిగా మార్చిన శివుడు... ఇకపై ఏ పూజ అయినా ముందుగా వినాయకుడికి చేసిన తర్వాతే చెయ్యాలన్నాడు. చివరకు తనకు పూజ చెయ్యాలన్నా... ముందుగా గణేశుణ్ని పూజించాలని కండీషన్ పెట్టాడు. నేను తండ్రిని, నా మాటే నెగ్గాలి అనే అహంభావం అన్నదే లేకుండా... ఆ శివుడు... గణపతిని ముందుంచాడు. ఇలా... ఓ తండ్రిగా శివుడు... తన బాధ్యతల్ని నిర్వర్తించాడు. అందుకే... ముక్కంటి అంటే అందరికీ ఇష్టం. ఆ కైలాసనాథుణ్ని ఇంతలా పూజించడానికి కారణం... ఆ నిరాడంబర తత్వమే.

    తండ్రి గొప్పదనాన్ని తెలుసుకున్న వినాయకుడు కూడా... తల్లిదండ్రుల్ని పూజించడమే అన్నింటికంటే గొప్ప అని చాటిచెప్పాడు. గణేషుడు, కుమారస్వామిలలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాల్ని చుట్టి వస్తారో వారే గణాధిపతి అంటారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయల్దేరతాడు. గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు మనకు సూచించాడు.
    Published by:Krishna Kumar N
    First published: