Fathers Day 2021 : ఫాదర్స్ డేకీ మన పురాణాలకీ లింక్ ఉంది. ఎందుకంటే మన పురాణాల్లో తండ్రులు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. రామాయణాన్నే తీసుకుంటే... రాముడి తండ్రి అయిన దశరథుడు... నలుగురు పిల్లలు ఉండి కూడా ఏనాడూ సంతోషంగా లేడు. పైగా... కైకేయి పుణ్యమా అని రాముణ్ని అడవులకు పంపాల్సి వచ్చింది. దశరథుడి ముగ్గురి భార్యల్లో చిన్నదైన కైకేయి... తన కొడుకైన భరతుడే... భారత దేశానికి రాజు కావాలని కోరుకుంది. అందుకు ఆమె తెలివిగా ఎత్తుగడ వేసింది. ఓ యుద్ధంలో తనకు సాయపడిన కైకేయిని మూడు వరాలు కోరుకోమని దశరథుడు అనడంతో... ఇప్పుడు కాదంటూ... సరిగ్గా పెద్ద కొడుకైన రాముడి (దశరథుడి మొదటి కొడుకు, కౌశల్య కొడుకు) పట్టాభిషేకం సమయంలో లిటిగేషన్ పెట్టింది.
పట్టాభిషేకాన్ని అడ్డుకొని... ఒకటో వరంగా రాముడి పట్టాభిషేకం రద్దుచెయ్యాలంది. రెండో వరంగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలంది. మూడో వరంగా రాముణ్ని 14 సంవత్సరాలు అడవులకు వెంటనే పంపాలంది. అలా తన కొడుకుకు బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఐతే... ఆమె ఇలాంటి వరాలు కోరుకుంటుందని ఊహించని దశరథుడు... అడ్డంగా బుక్కయ్యాడు. తండ్రి ఇబ్బంది పడుతుండగా గమనించిన రాముడు... డోండ్ వర్రీ నాన్నా... నేను అడవులకు వెళ్తానంటూ... అప్పటికప్పుడు బయల్దేరాడు. తండ్రి మాటకు ఎదురుచెప్పని కొడుకుగా చరిత్రకెక్కాడు. ఆ తర్వాత రాముడి వెంట సీతాదేవి, లక్షణుడు వెళ్లడం... అదంతా ప్రత్యేక స్టోరీ.
భరతుడు పట్టాభిషిక్తుడు అయ్యాక... దేశాన్ని పాలించాడు. కానీ... దశరథుడికి రాముడంటే అత్యంత ఇష్టం. అల్లారు ముద్దుగా సకల సౌకర్యాలతో పెంచాడు. అలాంటి కొడుకు అడవుల్లో... ముళ్లబాటలో వెళ్లడాన్ని దశరథుడు తట్టుకోలేకపోయాడు. ఇప్పట్లోలా అప్పట్లో సెల్ఫోన్లు లేవు కదా... కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఇలా దశరథుడు ఏళ్ల తరబడి కుంగిపోయాడు. ఓ తండ్రిగా ఆయన ఏ తప్పూ చెయ్యకపోయినా... పరిస్థితులు ఆయన చేతులు కట్టేశాయి. ఎంతో కుమిలిపోయాడు.
రాముడు తిరిగి వచ్చిన తర్వాత... పట్టాభిషిక్తుణ్ని చేసినా... ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సీతాదేవి... తల్లి భూదేవి చెంతకు వెళ్లిపోయిన ఘటనలు ఇవన్నీ... దశరథుణ్ని కుంగదీశాయి. ఐతే... దేశ ప్రజలు ఏనాడూ దశరథుడిపై గౌరవాన్ని తగ్గించలేదు. కారణం రాముడే. అంత మంచి కొడుకును కన్నాడన్న ఉద్దేశంతో... దశరథుడు ఓ తండ్రిగా తిరుగులేని పాత్రను పోషించినట్లైంది. ఇలా తండ్రీ కొడుకుల బంధం... పిత్రు దినోత్సవం నాడు... ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.