HANUMAN JAYANTI 2022 TEENAGER WITH 70 CM TAIL DUBBED REINCARNATION OF LORD HANUMAN BY LOCALS IN NEPAL SK
Lord Hanuman: హనుమంతుడు ఈ యువకుడి రూపంలో మళ్లీ పుట్టాడా? అందుకు ఆధారం ఇదేనా?
తోకతో దేశాంత్ అధికారి
Nepal Tail Boy: మొదట్లో ఆ తోకతో బయటకు వెళ్లాంటే దేశాంత్ సిగ్గుపడేవాడు. నలుగురిలో కలిసేవాడు కాదు. కానీ ఇప్పుడు అస్సలు సిగ్గుపడడు. అతడికి సంబంధించిన ఎన్నో వీడియోలు యూట్యూబ్‌లో కూడా లభిస్తాయి.
ఈ భూప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయి. సాధారణంగా కంటే భిన్నంగా ఏదైనా జరిగితే.. దానిని అందరూ వింతగా చూస్తారు. పిల్లికి కుక్క పాలివ్వడం, మూడు కన్నులతో గేదె జన్మించడం, గుడి చూట్టూ జంతువులు ప్రదక్షిణలు చేయడం.. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటలను టీవీల్లో చూశాం. నేపాల్‌కు చెందిన ఓ యువకుడి విషయంలో కూడా ఇదే జరిగింది. అతడికి తోక ఉంది. వీపు నుంచి పొడవైన తోక బయటకు రావడంతో.. నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు. ఐతే ఆంజనేయుడికి కూడా ఇలాగే తోక ఉంటుంది. అందువల్ల అతడిని చూసి.. హనుమంతుడు మళ్లీ పుట్టారని చాలా మంది చెబుతున్నారు.
డైలీ స్టార్ కథనం ప్రకారం.. నేపాల్‌లో నివసించే 16 ఏళ్ల దేశాంత్ అధికారి సాధారణ వ్యక్తిలానే కనిపిస్తాడు. అతని వీపును చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దేశాంత్కు తోక ఉంది. ఏదో చిన్న అవయవం..వీపుపై నుంచి వచ్చిందనుకుంటే పొరపాటే. అచ్చం ఆంజనేయస్వామికి ఉన్నట్లుగానే.. వీపు నుంచి ఇతడికి తీక ఉంది. అది కూడా 70 సెంటీమీటర్ల పొడవుఉంది. దానిపై వెంట్రుకలు సైతం మొలుస్తున్నాయి. ఆడవారు జడ వేసుకున్నట్లుగానే..ఇతడు కూడా ఆ తోకని అందంగా అల్లుకుంటాడు. దానిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఆంజనేయస్వామి ప్రతిరూపమని అంటున్నారు. కొందరేమో ఈ కుర్రాడి రూపంలో హనుమంతుడు మళ్లీ పుట్టాడని చెబుతున్నారు.
ఈ తోకను చూసి డాక్టర్లు కూడా షాక్ తింటున్నారు. వెన్నుపాములో ఉండే అతి చిన్న ఎముక కోకిక్స్ నుంచి ఈ తోక ఉద్భవించింది. పుట్టిన 5 రోజుల తర్వాత అతని తల్లిదండ్రులకు కనిపించింది. అది ఎలా వచ్చిందో డాక్టర్లు కూడా తెలియడం లేదు. చాలా మంది వైద్యులు అతడిని పరీక్షించారు. కానీ ఆ తోక ఎలా వచ్చింది? దానిపై వెంట్రుకలు ఎలా మొలుస్తున్నాయన్నది అంతు చిక్కడం లేదు. చివరకు కొందరు పూజారులు, పండితులకు వద్దకు వెళ్లి తన తోక గురించి చెప్పినట్లు ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చెప్పాడు దేశాంత్. ఇది హనుమంతుడి అవతారమని హిందూ పండితులు చెప్పడంతో.. దేశాంత్ దానిని కత్తిరించలేదు. అప్పటి నుంచీ ఆ తోకను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మరింతగా పెంచుతున్నాడు.
మొదట్లో ఆ తోకతో బయటకు వెళ్లాంటే దేశాంత్ సిగ్గుపడేవాడు. నలుగురిలో కలిసేవాడు కాదు. కానీ ఇప్పుడు అస్సలు సిగ్గుపడడు. అతడికి సంబంధించిన ఎన్నో వీడియోలు యూట్యూబ్‌లో కూడా లభిస్తాయి. దేశాంత్కు ఉన్న తోక వల్ల..అతడిని హనుమంతుడి ప్రతిరూపంగా భావిస్తున్నారు స్థానికులు. సాక్షాత్తు ఆంజనేయ స్వామే అతడి రూపంలో పుట్టాడని చెబుతున్నారు. ఐతే కొందరు హేతువాదులు మాత్రం వారి మాటలను తప్పుబట్టుతున్నారు. శరీరం అవయవాల్లో అంతర్గతంగా జరిగిన మార్పుల వల్లే ఇలా జరిగి ఉండవచ్చని.. దానిని దేవుడితో ముడిపెట్టడం కరెక్టు కాదని అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను వ్యాప్తి చేయవద్దని సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.