తాగింది దిగలేదా... ఐతే ఆఫీస్‌ సెలవు... ఉద్యోగులకు కిక్కిచ్చే ఆఫర్...

ఇలాంటి ఆఫర్ ఉంటే ఎంత బావుండు అనుకుంటారు చాలా మంది. నిజంగానే అది ప్రకటించి ఉద్యోగులను పండగ చేసుకోమంటోంది ఆ కంపెనీ.

news18-telugu
Updated: December 17, 2019, 9:36 AM IST
తాగింది దిగలేదా... ఐతే ఆఫీస్‌ సెలవు... ఉద్యోగులకు కిక్కిచ్చే ఆఫర్...
తాగింది దిగలేదా... ఐతే ఆఫీస్‌ సెలవు... ఉద్యోగులకు కిక్కిచ్చే ఆఫర్...
  • Share this:
హ్యాంగోవర్ సమస్య చాలా మందికి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు... పెగ్గు మీద పెగ్గు వేసేస్తారు. తెల్లారే తల పట్టేస్తు్ంది. తప్పనిసరై ఆఫీస్‌కి వెళ్తారు. బాస్‌తో తలనొప్పులు తప్పవు. ఈ తిప్పలు లేకుండా... బ్రిటన్... ఇంగ్లండ్ లోని ఓ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ... హ్యాంగ్ ఓవర్ డే హాలిడేస్ తెచ్చింది. రాత్రి బాగా తాగిన వాళ్లకు మార్నింగ్ మత్తు దిగకపోతే... ఈ సెలవుల్ని వాడుకోవచ్చు. ఇలా ఎందుకు చేసిందంటే... చాలా మంది తాగింది దిగకపోయినా ఆఫీస్‌కి వస్తున్నారు. కానీ సరిగా పని చెయ్యట్లేదు. పని చేస్తూ నిద్రపోతున్నారు. ఒక్కసారి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆఫీస్‌కి వస్తూ యాక్సిడెంట్లు కూడా చేస్తున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే ఆ కంపెనీ యాజమాన్యం ఈ కిక్కిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. మందు తాగని వాళ్ల సంగతేంటని. వాళ్లకూ ఈ రూల్ వర్తిస్తుంది. ఎలాగంటే... వాళ్లు రాత్రంతా ఏదైనా పనిలో నిమగ్నమై సరిగా నిద్రపోలేకపోతే... తెల్లారి ఆఫీస్‌కి వెళ్లకుండా... ఇంట్లోనే నిద్రపోవచ్చు. వీలైతే వర్క్ ఫ్రం హోమ్ కింద ఇంటి నుంచీ పనిచెయ్యవచ్చు. ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన కంపెనీని మెచ్చుకోకుండా ఎలా ఉంటారు. సోషల్ మీడియాలో ఒకటే ప్రశంసలు. మాకు కూడా అలాంటి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు కొందరు.

First published: December 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు