హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Vijay Deverakonda:లైగర్ లుక్స్ చేంజ్‌..జన గణ మన కోసం న్యూ హెయిర్‌ స్టైల్ పిక్స్‌ వైరల్

Vijay Deverakonda:లైగర్ లుక్స్ చేంజ్‌..జన గణ మన కోసం న్యూ హెయిర్‌ స్టైల్ పిక్స్‌ వైరల్

Viral Pics: బాక్సర్‌ విజయ్‌దేవరకొండ హెయిర్‌ స్టైల్ మారిపోయింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ జన గణ మన సినిమా కోసం ఆర్మీ హెయిర్‌ స్టైల్‌లో ఉన్న రౌడీబాయ్ పిక్స్‌ తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Pics: బాక్సర్‌ విజయ్‌దేవరకొండ హెయిర్‌ స్టైల్ మారిపోయింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ జన గణ మన సినిమా కోసం ఆర్మీ హెయిర్‌ స్టైల్‌లో ఉన్న రౌడీబాయ్ పిక్స్‌ తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Pics: బాక్సర్‌ విజయ్‌దేవరకొండ హెయిర్‌ స్టైల్ మారిపోయింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ జన గణ మన సినిమా కోసం ఆర్మీ హెయిర్‌ స్టైల్‌లో ఉన్న రౌడీబాయ్ పిక్స్‌ తెగ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ క్రేజీ స్టార్‌ విజయ్‌దేవరకొండ(Vijay Deverakonda)తన లుక్కు మార్చేశాడు. తన ప్రెజెంట్‌ ప్రాజెక్ట్ లైగర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందో లేదో నెక్స్ట్ మూవీ కోసం కంప్లీట్‌ హెయిర్‌ స్టైల్, గెటప్ చేంజ్‌ చేశాడు. ప్యాన్‌ ఇండియా మూవీ లైగర్ కోసం ఇన్ని రోజులు జులపాల జుట్టు పెంచుకొని తిరిగిన విజయ్‌ దేవరకొండ తన నెక్ట్స్ సినిమా జన గణ మన (Jana Gana Mana)సినిమా కోసం మిల్ట్రీ కటింగ్‌ (Army hair style)చేయించుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. జన గణ మన సినిమా కోసం రౌడిబాయ్‌ విజయ్‌దేవరకొండ తన హెయిర్‌ స్టైల్‌ని కంప్లీట్‌గా గుండులా మార్చేశాడు. ఒక్కో సినిమాకు ఒక్కో హెయిర్‌ స్టైల్ మార్చుతూ వస్తున్న విజయదేవరకొండ న్యూ హెయిర్‌ స్టైల్‌పై ఇప్పటి నుంచే తెగ క్యూరియాసిటీ మొదలైంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌(Puri Jagannadh), రౌడీబాయ్ విజయ్‌దేవరకొండ కాంబినేషన్‌లోనే జన గణ మన సినిమా తెరకెక్కబోతోంది. అర్జున్‌రెడ్డి సినిమాలో రఫ్ క్యారెక్టర్‌కి తగినట్లుగా హెయిర్‌ స్టైల్, గెడ్డం పెంచిన విజయ్‌దేవరకొండ ఆ తర్వాత వచ్చిన గీతగోవిందం సినిమాలో జెంటిల్‌మెన్‌ హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడు. ఇక బాక్సర్‌గా లైగర్‌ సినిమా కోసం జులపాల జుట్టు పెంచుకున్న విజయ్‌దేవరకొండ మళ్లీ కొత్త సినిమా కోసం ఇలా హెయిర్ కట్ చేయించుకోవడం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌గా మారిపోయింది. పూరి డైరెక్షన్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా జన గణ మన సినిమాని ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈఏడాది ఏప్రిల్‌(April 22, 2022)లో మొదలవుతుందని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇందులో ఫీమేల్ లీడ్‌ రోల్‌ కోసం బాలీవుడ్ నటి (Bollywood actress)జాన్వీకపూర్‌(Janhvi Kapoor)ని కాంటాక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఆర్మీ హెయిర్‌ స్టైల్‌లో రౌడీబాయ్‌..

పూరి జగన్నాథ్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న జన గణ మన సినిమాని ప్యాన్ ఇండియా మూవీ కంటే భారీ స్థాయిలో ఒక ఇంటర్‌నేషనల్‌ రేంజ్‌ మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. సౌతాఫ్రికాలో ఫస్ట్ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ నెలలో షూటింగ్‌ జరుపుకునే జన గణ మన సినిమా ఇప్పటి నుంచే లొకేషన్‌ని వెదికే పనిలో పడ్డారు డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఇంకా ఇంట్రెస్టింగ్‌ న్యూస్ ఏమిటంటే ఈసినిమాలో విజయ్‌దేవరకొండకు జోడిగా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ని హీరోయిన్‌గా పెట్టాలని చూస్తున్నారట మూవీ మేకర్స్.

(జన గణ మన మూవీ కోసం న్యూ హెయిర్‌ స్టైల్)
(జన గణ మన మూవీ కోసం న్యూ హెయిర్‌ స్టైల్)

విజయ్‌దేవరకొండ జులపాల జుట్టు మాయం..

విజయ్‌దేవరకొండతో ఏ హీరోయిన్‌ స్క్రీన్ షేర్ చేసుకున్న వాళ్ల మధ్య ఉండే కెమిస్ట్రీని వేరేలా అర్ధం చేసుకుంటున్నారు నెటిజన్లు. రీసెంట్‌గా గీతగోవిందం సినిమాలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ చేసిన రష్మికా మందనతో విజయ్‌ దేవరకొండ పెళ్లి కాబోతోందట అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. అయితే అవన్ని చెత్త పుకార్లంటూ రౌడీబాయ్‌ కొట్టిపారేయడంతో అందరి దృష్టి ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో విజయ్‌దేవరకొండ హెయిర్‌ స్టైల్‌పై పడింది. ఈసినిమా తర్వాత విజయ్‌దేవరకొండకు ఏ హీరోయిన్‌తో లింకు పెడతారో అని నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Vijay Devarakonda, Viral photos

ఉత్తమ కథలు