వింత జంతువు... ఇదేంటో గుర్తుపట్టారా... వైరల్ వీడియో

ఆ జంతువు ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. తన కంటూ ప్రత్యేక ఫాలోయర్లను సంపాదించుకుంది. ప్రత్యేకంగా ఉండటం వల్లే అది ఫేమస్ అయ్యింది. అదేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 14, 2020, 1:23 PM IST
వింత జంతువు... ఇదేంటో గుర్తుపట్టారా... వైరల్ వీడియో
వింత జంతువు... ఇదేంటో గుర్తుపట్టారా... వైరల్ వీడియో (credit - Facebook)
  • Share this:
80వ దశకంలో... ఓ హర్రర్ సినిమా వచ్చింది. పై జంతువును చూస్తే... ఆ సినిమా గుర్తుకు రావడం సహజం. ఎందుకంటే అందులో జంతువులు రబ్బరు సూట్లతో తయారైనవి, చూడ్డానికి నిజమైన వాటిలా కనిపించేవి. ఈ జంతువు మాత్రం రబ్బరు బొమ్మలా ఉన్నా... ఇది నిజమైనదే. ఇది పిల్లి. బొచ్చు, కను గుడ్లు లేని పిల్లి. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని పేరు జాస్పెర్. ఇది ఇలా ప్రత్యేకంగా కనిపిస్తుంటే... దీన్ని చూస్తూ... చాలా మంది జాలి పడుతూ... కనెక్ట్ అవుతున్నారు. దీనికి ఫేస్‌బుక్, టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్... మూడింట్లోనూ అకౌంట్లు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 72వేల మంది, టిక్‌టాక్‌లో 50వేలకు పైగా, ఫేస్‌బుక్‌లో 12వేల మందికి పైగా ఫ్యాన్స్, ఫాలోయర్స్ ఉన్నారు. అరుదైన పిల్లిలా కనిపించడం వల్లే దీనికి ఇంత గుర్తింపు వచ్చింది.


జాస్పెర్ వయసు 12 ఏళ్లు. దీన్ని కెల్లీ అనే ఓనర్ దత్తత తీసుకున్నారు. మొదట్లో ఇది ఆరోగ్యంగా, మిగతా పిల్లుల లాగే ఉండేది. కొన్నేళ్ల తర్వాత... దీనికి ఫెలైన్ హెర్ప్స్ వైరస్ (Feline Herpes Virus - FHV) సోకింది. దాంతో బొచ్చు ఊడిపోయింది. అదే సమయంలో దీనికి కుడి కన్నుకు కార్నియల్ అల్సర్ వచ్చింది. కొన్ని నెలలకే అది తీవ్రమైంది. కనీసం ఎడమ కంటినైనా కాపాడదామని 2018లో కుడి కన్ను తీసేశారు. కానీ... దురదృష్టం వెంటాడింది. ఎడమకన్నుకూ అదే సమస్య వచ్చింది. దాంతో ఆ కంటిని కూడా తొలగించారు.నిజానికి ఈ పిల్లి చనిపోతుంది అనుకున్నారు. కానీ... ఇది క్రమంగా ఆరోగ్యంగా మారింది. ఇప్పుడు బొచ్చు లేకపోయినా హెల్తీగానే ఉంది. 2019లో దీనికి చిన్నగా గుండె పోటు కూడా వచ్చిందట. ఇప్పుడు మాత్రం ఆరోగ్యంగా ఉన్నా... పూర్తిగా కోలుకోవడానికి మరికొన్నేళ్లు పట్టొచ్చని అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 14, 2020, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading