నాగపాముకు తలస్నానం చేయించిన యువకుడు.. వైరల్ వీడియో

తల పైనుంచి నీళ్లు పోసి మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోను IFS అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

news18-telugu
Updated: May 25, 2020, 4:07 PM IST
నాగపాముకు తలస్నానం చేయించిన యువకుడు.. వైరల్ వీడియో
నాగుపాముకు స్నానం చేయిస్తున్న యువకుడు
  • Share this:
పాము అదంటే మనలో చాలా మందికి భయం. దాని పేరు చెబితేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇక స్వయంగా కనిపిస్తే.. ప్రాణాలరచేత పట్టుకొని పరుగులు పెడతాం. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పారిపోతాం. కానీ ఓ యువకుడు నాగుపాముకు ఏకంగా స్నానం చేయించాడు. అది చిన్న పాముపిల్ల కాదు.. ఏడెనిమిది ఫీట్ల పొడవున్న భారీ నాగుపాము..! పెద్ద పడగ కలిగిఉన్న ఆ పాముకు బకెట్ నీళ్లతో స్నానం చేయించాడా యువకుడు. తల పైనుంచి నీళ్లు పోసి మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోను IFS అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ యువకుడు పాములను పట్టడంలో శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ఇది ప్రమాదకరమని.. ఎవరూ ప్రయత్నించకూడదని నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు సుశాంత నంద. పాముకు యువకుడు స్నానం చేయిస్తున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published by: Shiva Kumar Addula
First published: May 25, 2020, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading