Home /News /trending /

HAIR PULLED BEATEN CONGRESS LEADER BV SRINIVAS MANHANDLED BY DELHI POLICE DURING PROTEST VIDEO GOES VIRAL PAH

Shocking: విచక్షణ రహితంగా కొట్టి.. జుట్టుపట్టుకొని లాగి పడేశారు.. కారణం ఏంటంటే..

పోలీసుల దాడి

పోలీసుల దాడి

Delhi: పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో (National herald case)  కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) విచారణను నిరసిస్తు.. దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే.. ఢిల్లీలో (Delhi)  కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ నిరసనలను తెలుపుతున్నారు. బీజేపీ కావాలని.. ఈడీ, సీబీఐలను కాంగ్రెస్ నేతలపై ఉసిగొల్పుతుందని అన్నారు. అదే విధంగా.. కాంగ్రెస్ నేతల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే పనులు చేస్తోందని అన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను విచారణకు పిలవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి.

ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ (Congress)  కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి పోలీసుల వాహనాల్లోకి ఈడ్చుకెళ్లారు. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బివి శ్రీనివాస్ పట్ల పోలీసులు అత్యంత పాశావికంగా ప్రవర్తించారు. పలువురు కాంగ్రెస్ నాయకులను బలవంతంగా పోలీసులు వాహనాల్లో ఎక్కించారు. నిరసన కారులు కూడా..  బీజేపీ తీరును పెద్ద ఎత్తున ఎండగట్టారు. అదే విధంగా.. నిరుద్యోగం, జీఎస్టీ, ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై ఫ్లకార్డులను పట్టుకుని తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఢిల్లీలో భారీ ఎత్తున కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు.


అప్పుడు.. యూత్ కాంగ్రెస్ చీఫ్ బివి శ్రీనివాస్ ను పోలీసులు బలవంతంగా తరలించారు. అతడిని పోలీసు వెహికిల్ లో బలవంతంగా ఎక్కించారు. జుట్టుపట్టుకొని లాగి, కొడుతూ జబర్దస్తీగా కారులో ఎక్కించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా (viral video)  మారింది.

ఇదిలా ఉండగా చైనాలో (China) షాకింగ్ ఘటన జరిగింది.

స్థానికంగా ఉన్న భవంతిపై నుంచి ఒక చిన్నారి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీన్నిగమనించిన మరో వ్యక్తి అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. కాగా, దీన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా పంచుకుంది. షెన్ డాంగ్ అనే వ్యక్తి రోడ్డు మీద ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ఐదో అంతస్థు నుంచి ఒక చిన్నారి కింద అరుస్తు కింద పడ్డాడు.

దీన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్లారు. కింద పడుతున్న చిన్నారిని వెంటనే పట్టుకున్నారు. పాపను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే.. ఈ వీడియో మాత్రం నెట్టింట (Social media)  తెగ వైరల్ గా (Viral video)  మారింది. దీన్నిచూసిన నెటిజన్ లు సదరు వ్యక్తి సమయస్పూర్తికి హ్యట్సాఫ్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు