HOME »NEWS »TRENDING »hair cutting boy anushrut is back with another hilarious clip video goes viral krs

Haircut 2.1: ఈ బుడ్డోడు మళ్లీ వచ్చేశాడు.. నవ్వించేస్తున్నాడు – Viral Video

Haircut 2.1: ఈ బుడ్డోడు మళ్లీ వచ్చేశాడు.. నవ్వించేస్తున్నాడు – Viral Video
Twitter image

హెయిర్​కట్ వీడియోతో క్యూట్ కిడ్(Cute Kid) ​ అనుశ్రుత్​ మరోసారి నెటిజన్లను నవ్విస్తున్నాడు. ఆ పిల్లాడి తండ్రి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్​గా మారింది.

  • Share this:
    గతేడాది క్లిష్ట సమయంలోనూ లక్షలాది మందిని నవ్వించిన ఆ పిల్లోడు మళ్లీ సోషల్ మీడియాలో హవా చూపిస్తున్నాడు. హెయిర్ కట్ చేసే సమయంలో ఎంతో క్యూట్​గా మాట్లాడుతూ.. ఏడుస్తూ.. బెదిరించిన ఆ చిన్నారి అనుశ్రుత్​ (Anshrut) చాలా మందికి గుర్తే ఉంటాడు. గత నవంబర్​లో ఆ పిల్లాడి తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ హెయిర్ కట్ వీడియో ఏకంగా ట్రెండింగ్​లోకి వెళ్లింది. ఆ అనుశ్రుత్​ క్యూట్​నెస్​కు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు మరోసారి హెయిర్​కట్ 2.1 (Haircut 2.1)తో ఆ నాగ్​పూర్​ బుడ్డోడు వచ్చేశాడు. కంటింగ్ చేసే సమయంలో మరోసారి ముద్దుముద్దు మాటలతో నెటిజన్లు మనసులను దోచేస్తున్నాడు.

    అనుశ్రుత్​​ తండ్రి అనూప్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. “మా పిల్లాడు అన్షుత్ ఈజ్ బ్యాక్​ – 2.1” అని క్యాప్షన్ పెట్టాడు.



    కుర్చీలో కూర్చున్న అన్షురుత్​కు ఓ వ్యక్తి హెయిర్​ కట్ చేశాడు. తన వెంట్రుకలు పోతున్నాయని, గుండు చేస్తారా అని మరోసారి ముద్దుగా బాధపడిన ఆ బుడ్డోడు మాటలతో మాయచేశాడు. క్యూట్​గా కబుర్లు చెప్పాడు. ఈ వీడియో వైరల్​గా మారింది. నెటిజన్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

    సో.. స్వీట్​.. క్యూట్​ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. మరోసారి తమను సంతోషపెట్టాడని, లవ్​యూ అంటూ స్పందిస్తున్నారు.

    Love the little fella ❤️😍💙. We wish you all the very best!

    అమాయకత్వం, క్యూట్​నెస్​.. సూపర్ అంటూ చాలా మంది రాసుకొచ్చారు.
    Published by:Krishna P
    First published:January 25, 2021, 12:56 IST

    टॉप स्टोरीज