అమ్మకానికి కాదేదీ అనర్హం అంటే ఇదేనేమో.. అప్పట్లో ఆన్లైన్ మార్కెట్లో ఆవు పేడ పిడకల్ని అమ్మి సంచలనం సృష్టించిన పలు ఈ కామర్స్ సంస్థలు ఇప్పుడు మరో కొత్త దారిని వెతికాయి. వేప పుల్లల అమ్మాకాలను కూడా ప్రారంభించాయి. ఇంటి పెరట్లో, ఇంటి పక్కన.. ఎక్కడ పడితే అక్కడ, కావాల్సినపుడు దొరికే వీలున్న ఈ వేప పుల్లలను ఫ్లిప్‌కార్ట్ అమ్మకానికి పెట్టింది. నగరాల్లో ఉంటూ, సహజసిద్ధ ఆహారం, పద్ధతులు పాటించేవారే లక్ష్యంగా ఈ ఈకామర్స్ సంస్థ వీటిని అమ్మాకానికి ఉంచింది. విశేషమేమిటంటే.. ఇందులో పేర్కొన్న వేప పుల్లల ప్రత్యేకతలే నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో వేప పుల్లల అమ్మకం (Photo: Flipkart)
ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. వాస్తవానికి 50 వేపపుల్లల ధర రూ.999. కానీ, 70 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.298కే కొనొచ్చు. వాటి బరువు 780 గ్రాములు. పురుషులు, మహిళలు ఇద్దరూ వాడొచ్చు. కొన్న తర్వాత సంవత్సరం పాటు మన్నగలవు. ఆయుర్వేద ప్రాడక్ట్ అని, చిగుళ్ల నొప్పితో బాధపడేవాళ్లు, బ్రీత్ ఫ్రెష్‌గా ఉండేందుకు వీటిని వాడాలని సూచిస్తోంది ఈ సంస్థ.
Published by:Shravan Kumar Bommakanti
First published:August 23, 2019, 13:47 IST