Home /News /trending /

GURUGRAM SHOCKER NIGHTCLUB BOUNCERS BEAT 4 WOMEN OTHERS SNATCH CASH VIDEO GOES VIRAL PAH

నైట్ క్లబ్ లో అరాచకం.. 4 గురు అమ్మాయిలపై బౌన్సర్ ల దాడి.. షాకింగ్ వీడియో వైరల్..

అమ్మాయిలపై బౌన్సర్ ల దాడి

అమ్మాయిలపై బౌన్సర్ ల దాడి

Delhi: బౌన్సర్ లు రెచ్చిపోయారు. నలుగురు అమ్మాయిలపై పిడిగుద్దులు కురిపించారు. అడ్డం వచ్చిన యువకుడిని కూడా ఇష్టమోచ్చినట్లు చితకబాదారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India
కొన్నిచోట్ల అమ్మాయిలు, అబ్బాయిలు రాత్రుళ్లు.. పార్టీలు, పబ్ లకని వెళ్తుంటారు. అక్కడ పీకల దాగి, ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. కొందరు బార్ లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. కావాలని తాకుతూ.. వారిని ఇబ్బందులు పెడుతుంటారు. అంతే కాకుండా.. మరికొందరు వాగ్వాదానికి దిగుతుంటారు. మద్యం మత్తులో ఇష్టమోచ్చినట్లు వ్యవహరిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలోని  (Delhi) గురుగ్రామ్ లో ఉన్న కాసా డాన్జా క్లబ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నలుగురు మహిళలు,తమ స్నేహితుడితో కలిసి నైట్ క్లబ్ కు వచ్చారు. అప్పుడు 8 నుంచి 10 మంది బౌన్సర్ వారిలోని ఒక యువతిని అసభ్యంగా తాకుతూ ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. దీంతో అక్కడ ఉన్న మరికొందరు బౌన్సర్ లు రెచ్చిపోయారు. యువతలను బయటకు తోసేశారు. అంతే కాకుండా.. అడ్డుకున్న బాయ్ ఫ్రెండ్ ను ఇష్టమోచ్చినట్లు కొట్టారు.





యువతులు వద్దని వారించిన, కనికరం చూపలేదు. యువతులను, వారితో వచ్చిన వ్యక్తిని చితకొట్టారు. అంతే కాకుండా బాధితుల దగ్గర ఉన్నడబ్బులను కూడా లాక్కున్నారు. ప్రస్తుతం ఈ ఘటనను అక్కడ ఉన్న కొంత మంది వీడియో రికార్డు చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ గా (Viral video) మారింది. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన జరిగింది.

లలిత్ పూర్ నియోజక వర్గానికి చెందిన సచిన్ సాహు అనే పొలిటిషియన్, అభయ్ నామ్ దేవ్ అనే 16 ఏళ్ల బాలుడిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అయితే.. అతను ఇంట్లో పనిచేస్తుండగా ఏదో పొరపాటు చేశారు. దీంతో సచిన్ సాహు రెచ్చిపోయాడు.

అభయ్ నామ్ దేవ్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతే కాకుండా.. కోపంతో అతని ముక్కును కసితీరా కొరికాడు. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఝాన్సీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందించారు. అయితే.. బాలుడు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో (Social media) లో తెగ చక్కర్లు కొడుతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Delhi, Viral Video

తదుపరి వార్తలు