GUJARRAT SINGER RADHADHIYA SHOCKED FANS SHOWERED OF BUCKET OF CASH ON HER NGS
Currency Rain: గుజరాత్ లో సంగీత కచేరీకి వెళ్తే నోట్ల వర్షం.. సోషల్ మీడియా వైరల్ అవుతున్న వీడియో
సింగర్ పై నోట్ల వర్షం
Buckets of cash: కరోనా కష్టాలతో చాలామంది డబ్బులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడుపూటల ఆహారానికి సరిపడ డబ్బులు లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. కానీ మరికొందరు ఇలా బకేట్లతో నోట్ల వర్షం కురిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది..
Showered buckets of cash: అసలే కరోనా వైరస్ (Corona Virus) కాలం.. లాక్ డౌన్ (Lock down).. కరోనా సెకెండ్ వేవ్(Corona Second Wave) తో సగం మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. చిన్నా చితక ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. మధ్య తరగతి ప్రజలు కూడా పేద వారిగా మారారు. ప్రైవేటు ఉద్యోగులు చాలామంది పరిస్థితి ఇది. ఇక చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారి బతుకు దుర్బరంగానే ఉంది. అందుకు ప్రధాన కారణం కరోనా కాటు. ఆ మహమ్మారి నుంచి పూర్తిగా అంతా కోలుకోలేదు. దీంతో చాలా మంది మూడు పూటల తినడానికి సరిపడేంత డబ్బులు లేక.. పస్తులుండే పరిస్థితి. ఒక పూట భోజనం చేసి.. మరోపూట పస్తులు ఉన్నవారు కూడా ఉన్నారు. ఇదంతా కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) వస్తుందని హెచ్చరికలు భయపెడుతున్నాయి. అయితే ఇప్పటికే చాలామంది ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం అవసరాలకు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కూడా.. కానీ ఇలాంటి సమయంలో కొందరు పిచ్చి అభిమానం పేరుతో నగదు వేస్ట్ చేస్తున్నారు. తాజాగా గుజరాత్ (Gujarat) లో జరిగిన సంగటన చూస్తే అంతా ముక్కుపై వేలేస్తారు..
తాజాగా గుజరాత్ లో నోట్ల వర్షం కురిసింది. నిజమే బకెట్లతో డబ్బులు వర్షంలా పడ్డాయి. ఇది కేవలం ఓ సంగీత కచేరీలో గుజారాత్ కు చెందిన జానపద గాయనిపై ఆ వర్షం కురిసింది. స్టేజి మీద ఆమె పాడుతున్నంతసేపు అభిమానులు రెచ్చిపోయారు. విరామం లేకుండా బకెట్లతో కరెన్సీ కట్టలను వెదజల్లుతూనే ఉన్నారు. బకెట్లతో డబ్బులు తీసుకొచ్చి ఆమెపై విపరీతంగా కుమ్మరించారు. కేవలం ఆ నోట్ల కట్టలతోనే వేదిక మొత్తం నిండిపోయింది.
గుజరాత్‌కు చెందిన శ్రీ సమస్త్ హరిద్వార్ సంఘం ఆధ్వర్యంలో ఓ సంగీత కచేరీకి ప్రముఖ జానపద గాయని రాధాదియాను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు తన బృందంతో గాయని అక్కడికి వచ్చి.. అభిమానులు కోరిన పాటలను వినిపించారు. ఇలా ఆమె పాటలు పడుతున్నంత సేపు.. అసలిపోకుండా స్టేజి మీద ఉన్న సంఘం సభ్యులు, కింద ఉన్న ప్రేక్షకులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. బకెట్లలో డబ్బులు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరించారు. దీంతో ఆ స్టేజిపై కుప్పల కొద్దీ కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నోట్ల వర్షానాకి సంబంధించిన వీడియోను సదరు గాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకొని అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది వెలకట్టలేని ప్రేమ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటికే లక్షల మంది వీక్షించగా.. వేల మంది లైక్ చేశారు. ఆమె గాత్రం అద్భుతంగా ఉంటుందని మరికొందరి కామెంట్ చేశారు.
అయితే అభిమానం చూపించడం తప్పుకాదని.. ఇలా నోట్ల కట్టలు చల్లడం దేనికని విమర్శిస్తన్నారు. అంత డబ్బు ఎక్కువ అయితే.. పేదలకు పంచి పెట్టొచ్చుగా అంటూ.. సోషల్ మీడియా విమర్శలు చేస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.