హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ప్రపంచంలోనే అరుదైన ఘటన.. తన వీర్యంతోనే గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వనున్న ట్రాన్స్ జెండర్

ప్రపంచంలోనే అరుదైన ఘటన.. తన వీర్యంతోనే గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వనున్న ట్రాన్స్ జెండర్

జెస్నూర్ దయారా (Image : Twitter)

జెస్నూర్ దయారా (Image : Twitter)

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో స్త్రీ లక్షణాలు కూడా పెరుగుతుండటంతో తానో ట్రాన్స్ జెండర్ అనే విషయం తెలుసుకున్నాడు. దీంతో స్త్రీగా మారిపోవాలని నిర్ణయించుకున్నాడు. స్త్రీగా మారిన తర్వాత తాను తల్లిని కావాలని కూడా నిర్ణయించుకున్నాడు.

  • News18
  • Last Updated :

సృష్టిలో ఏ బిడ్డకైనా తల్లి, తండ్రి ఇద్దరూ ఉంటారు. కానీ, ఒక ట్రాన్స్ జండర్ మాత్రం తల్లి, తండ్రి రెండూ తానే అయి ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. అంటే తన వీర్యంతో తనే బిడ్డకు జన్మనిచ్చి తల్లి కావాలని తను ప్రయత్నిస్తోంది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కాదా..? ఇది అతి త్వరలోనే నిజం కాబోతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ పంచమహల్ జిల్లాలోని గోద్రా అనే గ్రామంలో నివసించే డాక్టర్ జెస్నూర్ దయారా పుట్టుకతో మగవాడిగా జన్మించాడు.

అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో స్త్రీ లక్షణాలు కూడా పెరుగుతుండటంతో తానో ట్రాన్స్ జెండర్ అనే విషయం తెలుసుకున్నాడు. దీంతో స్త్రీగా మారిపోవాలని నిర్ణయించుకున్నాడు. స్త్రీగా మారిన తర్వాత తాను తల్లిని కావాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తానే మగాడిలా ఉన్న ప్రస్తుత సమయంలోనే తన వీర్యాన్ని భద్రపర్చుకున్నాడు. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించి తను బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తున్నాడు. ఈ ప్రక్రియ ద్వారా జన్మించే బిడ్డకు దయారానే తల్లి, తండ్రి అవుతారు.

ఈ నిర్ణయంపై దయారా మాట్లాడుతూ ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఆడవారిగా జీవించాలని ఉండేది. మా అమ్మ, సోదరిలాగా చీర కట్టుకోవాలని ఉండేది. లిప్ స్టిక్ వేసుకోవాలని ఆరాటపడేవాన్ని. కానీ చుట్టూ ఉన్న సమాజానికి భయపడి.. నాలోని స్త్రీని బయటకు రానివ్వలేదు. ఇదే సందర్భంలో ఎంబీబీఎస్ చదవడానికి నేను రష్యా వెళ్లాను. అక్కడ నాలాగే ఉన్న చాలా మందిని చూశాను. వారు తమకు ఇష్ట ప్రకారం స్వేచ్ఛగా జీవించేవారు. వారిని చూసి నాలోని భయాన్ని తొలగించుకొని, నాకు నచ్చిన విధంగా బతకడం మొదలుపెట్టాను. నాలో ఈ మార్పును చూసి మొదట్లో నా తల్లిదండ్రులు ఇబ్బందిపడ్డారు. కానీ క్రమంగా వారు నన్ను అర్థం చేసుకున్నారు. నా చుట్టూ ఉన్న సమాజం కూడా నన్ను అంగీకరించడం ప్రారంభించింది”అని అన్నారు.

తల్లి, తండ్రి రెండూ తానే..

కాగా, త్వరలోనే శస్త్ర చికిత్స ద్వారా పూర్తి స్థాయిలో స్త్రీగా మారనుంది దయారా. అందరు స్త్రీల లాగే తాను కూడా స్వయంగా మాతృత్వపు అనుభూతిని పొందాలనుకుంటుంది. అందుకే శస్త్ర చికిత్సకు ముందే తన వీర్యాన్ని భద్రపర్చాలని భావించింది. ఇందుకు గాను అహ్మదాబాద్ ఆనంద్ లోని సంతానోత్పత్తి కేంద్రాన్ని సందర్శించి తన నిర్ణయం చెప్పింది. వారుకూడా తన నిర్ణయాన్ని గౌరవించి వీర్యాన్ని భద్రపరిచేందకు అంగీకరించారు. శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా స్త్రీగా మారిన తర్వాత ఈ వీర్యాన్ని ఉపయోగించి తాను బిడ్డను కనాలని భావిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఒక బిడ్డకు తల్లి, తండ్రి రెండూ తానే అయిన ఏకైక వ్యక్తిగా దయారా రికార్డు సృష్టించనుంది.

Published by:Srinivas Munigala
First published:

Tags: Gujarat, Transgender, Trending, Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు