హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Russia Ukraine War: పరిమళించిన మానవత్వం.. గుజరాత్ సింగర్‌పై డాలర్ల వర్షం.. ఉక్రెయిన్ ప్రజల కోసం..

Russia Ukraine War: పరిమళించిన మానవత్వం.. గుజరాత్ సింగర్‌పై డాలర్ల వర్షం.. ఉక్రెయిన్ ప్రజల కోసం..

గుజరాత్ జంట

గుజరాత్ జంట

Russia Ukraine War:  ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పుతిన్ దళాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ తన రూపురేఖలను కోల్పోయింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది వేరే దేశాలకు వలస పోతున్నారు.

Russia Ukraine Crisis: రష్యన్ సైన్యాలు.. ఉక్రెయిన్ పై గత కొన్ని వారాలుగా ముప్పెట దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్ దళాలు కూడా.. అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. బాంబులు, క్షిపణులు, రాకెట్ లతో రష్యన్ దళాలు.. ఉక్రెయిన్ (Ukraine) ను అల్లకల్లోలం చేస్తున్నాయి. కీవ్, ఖార్కీవ్, సుమీ, పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమైన, ఇప్పటికి పూర్తిగా స్వాధీనం చేసుకొలేకపోయాయి. బాంబులు, రాకెట్లు, క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు శిథిలాలుగా, శవాల దిబ్బలుగా మారాయి.

ప్రపంచ దేశాలు.. ఉక్రెయిన్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నాయి. ప్రపంచదేశాలు.. ప్రత్యక్షంగా యుద్దంలో దిగకపోయిన, పరోక్షంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు, తదితర అవసరాలను తీరుస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్ స్కీ (Zelenskyy) పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇక.. మరికొందరు వేరే దేశాలకు వలస పోతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ (Ukraine) అంతట భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల చిన్న పిల్లలు సరైన వసతులు లేక వేల కిలో మీటర్లు నడుచుకుంటు పోతున్నారు.

పుతిన్ సైన్యం, ఆసుపత్రులు, సినిమా హాల్, భవంతులు వేటిని విచిపెట్టడంలేదు. ఈ క్రమంలో లకల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ అంతటా భీతావహా పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్ కు తమ ఆపన్న హాస్తం అందిస్తున్నాయి. ఆ దేశంలో ఆహారానికి అలమటిస్తున్న వారికి సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మన దేశానికి చెందిన వారు కూడా దీనిలో పాల్గొంటున్నారు.

మన దేశానికి చెందిన గుజరాత్ సింగర్స్ (Gujarati Singers)  ఉక్రెయిన్ కు సహాయం చేయడానికి తమ వంతుగా ముందుకు వచ్చారు. వీరు.. జార్జీయాలోని అట్లాంటాలో ఈనెల 27 న మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. దీంతో ఎంతో మంది ప్రవాస భారతీయులు, భారీ సంఖ్యలు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ లో.. గుజరాత్ చెందిన గీతాబెన్ రబారీ జంట పాటలు పాడారు. లోక్ డేరో పేరుతో మ్యూజికల్ ఈవినింగ్ గ్రాండ్ నిర్వహించారు. వీరు జానపద పాటలు పాడుతూ.. అక్కడి హాజరైన వారిని ఆకట్టుకున్నారు.

దీంతో ఎంతో మంది ఎన్నారైలు, భారతీయులు తమ వంతుగా వారికి డాలర్లు రూపంలో సహాయం అందించారు. తాము.. ఉక్రెయిన్ ప్రజలకు సహాకారం కోసం మ్యూజిక్ కాన్సర్ట్ (Music Concert )నిర్వహించామని తెలిపారు. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ లో దాదాపు.. 2.25 కోట్ల (Helping Hand) సహాయం అందింది. దీంతో అక్కడి ప్రజలకు సహాయం అందిస్తామని గీతాబెన్ తెలిపారు. ఈ జంట గతంలో గుజరాత్ లో కూడా ఒక మ్యూజికల్ షో నిర్వహించారు. అప్పుడు అహ్మదాబాద్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వచ్చారు. నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Russia, Russia-Ukraine War, Viral Video, Vladimir Putin

ఉత్తమ కథలు