హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

PM Modi: ఆహా గురు శిష్యుల అద్భుత బంధం.. తనకు పాఠాలు చెప్పిన గురువును కలిసిన ప్రధాని మోదీ..

PM Modi: ఆహా గురు శిష్యుల అద్భుత బంధం.. తనకు పాఠాలు చెప్పిన గురువును కలిసిన ప్రధాని మోదీ..

తనకు పాఠాలు చెప్పిన గురువుతో మోదీ

తనకు పాఠాలు చెప్పిన గురువుతో మోదీ

Gujarat: ప్రధాని నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తనకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువును కలుసుకున్నారు.

దేశ ప్రధాని మోదీ శుక్రవారం గుజరాత్ (Gujarat tour) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నవ్వారి పట్టణంలో ఉంటున్న తన ఉపాధ్యాయుడు జగదీష్ నాయక్ (88) ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో కొంత సమయం గడిపారు. జగదీష్ నాయక్.. మోదీని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని.. తన చిన్న నాటి విషయాలను ఆయన గురువు గారితో పంచుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి ఆవరణలో (Former Teacher) గురుశిష్యులు ఇద్దరు ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఆయన తాపీ జిల్లాలోని వ్యారాలో ఉంటున్నారు.

ప్రధాని మోదీ (PM Modi) తన కుటుంబంతో కలిసి వాద్ నగర్ లో ఉన్నప్పుడు ప్రధానికి, ఆయన బోధించారు. అక్కడే ఆయన నిరాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. సమావేశం తర్వాత.. జగదీష్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. ఇది కేవలం ఒక చిన్న సమావేశం కాదని అన్నారు. మోదీకి తన పట్ల చూపిన గౌరవం, అభిమానం.. ఎప్పుడు తన మనసులో గుర్తుండిపోతాయని అన్నారు. మోదీని (Narendra modi) కలవడంపై.. జగదీష్ నాయక్ మనవడు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

మా తాత తన నవ్‌సారి పర్యటనకు వస్తున్న.. మోదీజీని కలవాలనుకున్నారు. అందుకే నేను నిన్న PMOకి కాల్ చేసి అపాయింట్‌మెంట్ కోరాను. నన్ను ఆశ్చర్యపరిచే విధంగా.. మోదీ గారే మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి మాతో మాట్లాడారు. ఆయన గొప్ప స్థానంలో ఉన్నప్పటికి చాలా వినయంగా, సౌమ్యంగా మాట్లాడారు. ఆయనోక గొప్ప వ్యక్తి.. డౌన్ టు ఎర్త్. నా జీవితంలో నేను ఒక గొప్ప వ్యక్తిని కలిశాను. ఈ రోజు అతని నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాను.. అని పార్థ్ నాయక్ అన్నారు. ప్రస్తుతం మోదీ, ఆయన గురువు అప్యాయంగా దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Gujarat, Narendra modi, Pm modi

ఉత్తమ కథలు