హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Villagers-Leopard: ఆ పులి పిల్లను దత్తత తీసుకున్న గ్రామస్థులు.. కారణం ఏంటో తెలుసా..?

Villagers-Leopard: ఆ పులి పిల్లను దత్తత తీసుకున్న గ్రామస్థులు.. కారణం ఏంటో తెలుసా..?

గ్రామస్తులు దత్తత తీసుకున్న పులి పిల్ల

గ్రామస్తులు దత్తత తీసుకున్న పులి పిల్ల

చిరుతపులి(Leopard) కనిపిస్తే భయంతో ఆమడ దూరం పరుగెత్తుతాం. కానీ, గుజరాత్​లో(Gujarat)ని ఓ గ్రామ ప్రజలు మాత్రం ఏ మాత్రం భయపడకుండా చిరుతపులిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చిరుతపులి(Leopard) కనిపిస్తే భయంతో ఆమడ దూరం పరుగెత్తుతాం. కానీ, గుజరాత్​లోని(Gujrat) ఓ గ్రామ ప్రజలు మాత్రం ఏ మాత్రం భయపడకుండా చిరుతపులిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐదు రోజుల క్రితం పంచమహల్‌ దేవ్ డ్యామ్ సమీపంలోని పొలాల గుండా ఓ చిరుతపులి సంచరించింది. అటువైపు సైకిల్​​పై వెళ్తున్న ఎంబీఏ విద్యార్థి(Student) పార్థ్ వ్యాస్‌ను అది బలంగా ఢీకొట్టింది. దీంతో, అతడు కింద పడిపోయాడు. అయితే ఆశ్చర్యకరంగా అతడిపై దాడి చేయకుండా పులి ఓ గుడిసె దగ్గరకు వెళ్లి దాక్కుంది. ఈ పరిణామాన్ని చూసిన పార్థ్​ వ్యాస్​ తన కళ్లను నమ్మలేకపోయాడు. ఆ తర్వాత, స్థానికంగా ఉన్న దహిసర్ గ్రామస్థులు ఈ పులి పిల్లను పెంచుకుంటున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

దీనిపై స్థానిక గ్రామస్థులను అడగ్గా.. ‘‘అటవీ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో చిరుతపులులు సంచరించడం మామూలే. కేవలం రెండు నెలల వయసున్న ఈ పులి పిల్ల తన తల్లి నుంచి విడిపోయి ఉండవచ్చని భావిస్తున్నాం. అందుకే చిరుత పులిని చూసి భయపడకుండా, దాన్ని పోషించే బాధ్యతను తీసుకున్నాం. ఈ పులి పిల్ల మాతో బాగా కలిసిపోయింది. ఇది మాకు ఎటువంటి హాని చేయడం లేదు. చిరుతపులి తల్లి వస్తే దానికి అప్పగిస్తాం.” అని వ్యాస్​కు తెలిపారు. కాగా, ఈ పులి పిల్ల ఇష్టానుసారం మా ఇంట్లోకి, బయటకి వెళ్లగలదని, రాత్రి మా ఇళ్లలోనే నిద్రిస్తుందని, తమ హృదయాల్లో స్థానం సంపాదించి బాగా దగ్గరైందని గ్రామస్థులు చెప్పుకొచ్చారు.

Dream Comes True: ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి.. ప్రాణాలు పోసే స్థితికి.. ఆమె కథ ఒక స్పూర్తిదాయకం..


పులి పిల్ల ఆలనా పాలనా చూసుకుంటున్న గ్రామస్థులు..

దహిసర్ గ్రామస్థుల ఇళ్ళు చాలా చిన్నవి, సంపాదన కూడా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, వారు ఆ చిరుతపులి పిల్లని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. దానికి కావాల్సిన ఆహారం కోసం ఖర్చుకు సైతం వెనకాడకుండా చూసుకుంటున్నారు. కాగా,​ పులిపిల్లను పెంచుకుంటున్న గ్రామస్థులను ప్రశంసించిన వ్యాస్​.. వారికిఅటవీ నిబంధనలపై అవగాహన కల్పించాలనుకున్నాడు. ‘‘అటవీ నియమాలు, చిరుత పులి గురించి అధికారులకు తెలియజేయడం తప్పనిసరి అని గ్రామస్థులకు వివరించాను. వారి ఉద్దేశాలు గొప్పవి. కానీ అడవి జంతువులను ఇంట్లో ఉంచకూడదని చట్టం చెబుతోంది. కాబట్టి, చిరుత పిల్ల గురించి అటవీ అధికారులకు తెలియజేశాను.” అని అతడు చెబుతున్నాడు.

విషయం తెలుసుకున్న స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రణ్‌వీర్‌సిన్హ్ పువార్ గ్రామస్థులను ప్రశంసించాడు. ఆయన మాట్లాడుతూ ‘‘గ్రామస్థులు ఒక ప్రాణాన్ని కాపాడారు. వన్యప్రాణులు, మానవుల సహజీవనం ఎల్లప్పుడూ ప్రశంసించాల్సిన విషయమే. మేము ఇప్పుడు ఈ పులి కూన తల్లి కోసం వెతుకుతున్నాం. త్వరలోనే దాన్ని కనిపెడతామనే నమ్మకం ఉంది." అని అన్నారు.

First published:

Tags: Gujarat, Leopard, Trending news

ఉత్తమ కథలు