హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

16 ఏళ్ల క్రితం వ్యాపారికి దొరికిన డైమండ్ గణేషా.. ప్రతి ఏడాది భక్తితో ప్రతిష్టించి..

16 ఏళ్ల క్రితం వ్యాపారికి దొరికిన డైమండ్ గణేషా.. ప్రతి ఏడాది భక్తితో ప్రతిష్టించి..

డైమండ్ ఆకారంలో ఉన్న గణేషుడు

డైమండ్ ఆకారంలో ఉన్న గణేషుడు

Gujarat: సూరత్ లోని వ్యాపారికి 16 ఏళ్ల క్రితం ఒక డైమండ్ దొరికింది. అది అచ్చం వినాయకుడి పోలి ఉంది. దీన్ని ప్రతి ఏడాది పాలతో కడిగి పదిరోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

దేశమంతట వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల మట్టిగణపతితో పాటు.. వివిధ రూపాలలో గణేషుడిని ప్రతిష్టించి భక్తులు కొలుస్తున్నారు. తమ విఘ్నాలను దూరం చేయాలని ఆ లంబోదరుడిని, భక్తితో వేడుకుంటున్నారు. ఆ బొజ్జ గణపయ్యకు.. కుడుములు, పాయసం, ఉండ్రాళ్లు సమర్పించి.. తమను చల్లగా చూడాలంటూ తమ కోరికలను గజననుడికి చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా దేశంలో అనేక చోట్ల భిన్నరకాల గణపతులను ప్రతిష్టిస్తున్నారు. కొన్ని చోట్ల బంగారం, వెండి, మట్టిగణపయ్యలను ప్రతిష్టిస్తున్నారు. అయితే.. ఇంకొన్ని చోట్ల.. తాజాగా, విడుదలైన సినిమాలలోని, హీరోల మాదిరిగా కూడా వినాయకుడిని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.ఈ మధ్య విడుదలై బ్లాక్ బాస్టర్ గా మూవి పుష్ప . దీనిలో హీరో అల్లు అర్జున్ ఫెమస్ డైలాగ్ తగ్గెదేలే.. ఎంత ట్రెండింగ్ లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అచ్చం అలాంటి డైలాగ్ కొడుతున్నప్పుడు అల్లుఅర్జున్ చూపించిన ఫెస్ ఎక్స్ ప్రెషన్ మాదిరిగా గణపయ్యలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదిలా ఉండగా.. గుజరాత్ లోని సూరత్ లోని డైమండ్ వ్యాపారికి 16 ఏళ్ల క్రితం ఒక డైమండ్ దొరికింది. ఇప్పుడది మరోసారి వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. గుజరాత్ లోని (Gujarat)  సూరత్ కు చెందిన వ్యాపారికి 16 ఏళ్ల క్రితం ఒక డైమండ్ దొరికింది. స్థానికంగా ఉన్న కతర్గామ్ ప్రాంతానికి చెందిన పాండవ కుటుంబానికి 16 ఏళ్ల క్రితం, 27 క్యారెట్ల నిజమైన వజ్రం దొరికింది. ఇది అచ్చం గణపతి (Diamond ganesha) పరిమాణంలో ఉంది. దీంతో వీరి కుటుంబం ఈ వజ్రాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈ రోజున కుటుంబాలు ఇంట్లో ఝాస్ గణపతిని ప్రతిష్టిస్తారు. అయితే.. ప్రతి ఏడాది ఈ గణపతి విలువ డబుల్ అవుతువస్తుంది. ఈ ఏటా మార్కెట్ ధరను పరిశీలిస్తే.. ప్రస్తుత మార్కెట్ ప్రకారం గణేష్ ఆకారంలో ఉన్న ఈ వజ్రం ధర రూ. 500 కోట్లు పలుకుతోంది.
ఈరోజు గణేశ్ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. డైమండ్ సిటీగా ప్రసిద్ధి చెందిన సూరత్‌లో.. రియల్ డైమండ్ గణేష్ కూడా స్థాపించబడింది. సూరత్‌లోని కతర్‌గాం ప్రాంతంలో నివసిస్తున్న పాండవ కుటుంబానికి డైమండ్ బ్రోకర్‌గా పనిచేస్తుండగా ఈ వజ్రం లభించింది. అయితే, కుటుంబ సభ్యుల భావన కారణంగా 27 క్యారెట్ల వజ్రాన్ని అతని వద్ద ఉంచారు. అతను ఎప్పుడూ దీన్ని విక్రయించలేదు. ఈ గణపతి దొరికాక తమకు మరింత కలసి వచ్చిందని..ఈ డైమండ్ గణేషుడు మండుతున్న గణపతిలా కనిపించాడని వ్యాపారి చెబుతుంటాడు.
వీరి కుటుంబాలు ఈ రోజు వరకు సంవత్సరాల తరబడి ఇంట్లో దీన్ని ప్రతిష్టించి, పూజలు చేస్తున్నారు. అయితే, పాండవ కుటుంబాన్ని డైమండ్స్ ఆఫ్ ఇండియా కూడా విచారించింది. ఇందులో ఇది సహజ వజ్రమని గుర్తించి, అది సింగిల్ పీస్ అని సర్టిఫికేట్ కూడా కలిగి ఉన్నారు. అయితే నేటి మార్కెట్ ధర ప్రకారం ఈ వజ్రం ధరను పరిశీలిస్తే దీని విలువ రూ.500 కోట్లుగా అంచనా వేశారు. ఈ వజ్రాన్ని గత 16 ఏళ్లుగా ఈ కుటుంబం భద్రపరుస్తోంది. ఈ రోజున వాటిని ప్రతిష్టించి పది రోజుల తర్వాత వజ్రాన్ని పాలలో కడిగి మళ్లీ ఖజానాలో ఉంచుతారు. ఈ వజ్రం సూరత్‌లోని ఖతర్‌గామ్ ప్రాంతంలోని ఇప్పటికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రజలు ఈ డైమండ్ గణేషుడిని వెళ్లి దర్శించుకుంటారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Gujarat, Vinayaka Chavithi 2022, VIRAL NEWS

ఉత్తమ కథలు