హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. చూస్తుండగానే మంటలు అంటుకున్నాయి.. వీడియో వైరల్..

వామ్మో.. చూస్తుండగానే మంటలు అంటుకున్నాయి.. వీడియో వైరల్..

స్టేజీ మీద వ్యాపించిన మంటలు

స్టేజీ మీద వ్యాపించిన మంటలు

Gujarat: వినాయక చవితి వేడుకలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో ఒక వ్యక్తి భక్తులకు కనువిందు అయ్యేలా నిప్పుతో కొన్ని రకాల స్టంట్ లు వేస్తున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

పొట్ట కూటీ ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిచేస్తుంటారు. కొందరు చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే మరికొంత మంది, బిజినెస్ లు చేస్తుంటారు. ఇంకొందరు మాత్రం.. ఏదో రకంగా డబ్బులను సంపాదిస్తుంటారు. దీని కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. కొందరు పొట్ట కూటీ కోసం రోడ్ల మీద రకారకాల స్టంట్ లు చేస్తుంటారు. కొందరు వివిధ రకాల ప్రొగ్రామ్ లు చేస్తుంటారు. వీరి విన్యాసాలను చూసిన జనాలు.. ఆశ్చర్యపోయి డబ్బులను ఇస్తుంటారు. కొన్నిసార్లు ఈ విన్యాసాలలో అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. గుజరాత్ లోని (Gujarat) వినాయక చవితి వేడుకల్లో అనుకొని ఘటన జరిగింది. సూరత్ లోని పర్వత్ పాటియా ప్రాంతంలో ఒక యువకుడు తన నోటితో మంటలను పీల్చే విన్యాసాలను చేస్తున్నాడు. మనం తరచుగా కొన్ని రకాల కార్యక్రమాలను చూస్తుంటాం. కిరోసిన్ ను నోటిలో వేసుకుంటారు.ఆ తర్వాత.. దానికి మండే పుల్లను అంటిస్తుంటారు. అలాంటి సందర్భాలలో కొన్ని సార్లు.. అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. అప్పుడు ప్రమాదవశాత్తు అతనికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అతని శరీరం అంత మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు మంటలను ఆర్పి అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటన వైరల్ గా (Viral) మారింది.
ఇదిలా ఉండగా పెళ్లై 8 ఏళ్లకు ఒక వ్యక్తి భార్యను టార్చర్ చేశాడు.
ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh)  మీరట్ లో వింత ఘటన జరిగింది. మీరట్ జిల్లాలోని లిసారి గేట్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా జాకీర్ కాలనీకి చెందిన సల్మాన్, నజ్మా భార్యభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఏడెళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కొన్నిరోజుల నుంచి భర్త వేధింపులు (Husband harassment)  ఎక్కువయ్యాయి.

అయితే.. తాను.. లావుగా మారానని, అందుకు తన భర్త.. తన నుంచి విడాకులు కావాలని వేధిస్తున్నాడని నజ్మా వాపోయింది. అందుకే తనకు ట్రిపుల్ తలాక్ కూడా చెప్పాడని తెలిపింది. అతను విడాకుల నోటీసు కూడా పంపించాడు. అందులో బరువు పెరిగినందుకు ట్రిపుల్ తలాఖ్ (Triple talaq)  ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఆమె మనో వేదనకు గురై పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Fire Accident, Gujarat, Viral Video

ఉత్తమ కథలు