సమాజంలో కొంత మంది వివాహ బంధానికి ఉన్న గొప్పతనానికి మచ్చ తీసుకువస్తున్నారు. ఉన్నత స్థానంలో ఉండి, వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో తమ పరువును, తమ కుటుంబపు పరువును తీస్తున్నారు. ఇలాంటి ఘటన ప్రస్తుతం గుజరాత్ లో వెలుగులోనికి వచ్చింది. గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత భార్యకు (Extra marital affair) అడ్డంగా దొరికిపోయారు. వేరే మహిళతో లాడ్జీలో ఉండగా భార్య కాపుకాసి పట్టుకుంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భరత్ సింగ్ సోలంకి (Bharat singh solanki) మరో యువతితో ఉండగా, ఆయన భార్య పట్టుకుంది. మహిళ లోపలికి ప్రవేశించి ఆగ్రహంతో ఊగిపోయింది. యువతిపై (Affair) దాడికి తెగపడింది. తన భర్త నిర్వాకాన్ని రికార్డు చేసింది. లాడ్జీగా ఉండగా, భార్య ఎంట్రీ ఇవ్వడంతో మంత్రి షాక్ కు గురయ్యాడు. తన భార్య.. యువతిపై దాడిచేస్తుంటే అడ్డుకున్నాడు. వద్దని వారించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసుకొమ్మని ఉచిత సలహ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా ఈడీ అధికారులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీచేశారు
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు కాంగ్రెస్ అగ్రనాయకులకు సమన్లు జారీ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై (Rahul gandhi) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా బుధవారం ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాగా, 2015లో దర్యాప్తు సంస్థలు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కేసును దర్యాప్తు ఆపివేశాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia gandhi) , పార్టీ ఎంపీ రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడం పై కాంగ్రెస్ నేతలు, బీజేపీని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని, ప్రతి పక్షాలను భయపెట్టడానికి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఎద్దెవా చేశారు. రాజకీయంగా కక్ష సాధించడం కోసం మళ్లీ పాత కేసును తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రభుత్వంపై నెలకొన్న.. వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ఈ విధంగా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాగా, జూన్ 2న రాహుల్ గాంధీ, జూన్ 8న సోనియా గాంధీలను తమ ముందు హజరవ్వాలని ఈడీ సమన్లు అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Extra marital affair, Gujarat, Illegal affairs, Viral Video