Viral Video: ట్రాక్టర్ టైర్ తల మీద నుంచి దూసుకెళ్లింది.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

బైక్‌‌పై నుంచి కిందపడిన వ్యక్తి తల మీద నుంచి వెళ్తున్న ట్రాక్టర్ టైర్

కొన్ని వీడియోల చూస్తే కొద్దిసేపు గుండె ఆగినంత పని అవుతుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా (social media) మారింది.

  • Share this:
    కొన్ని వీడియోల చూస్తే కొద్దిసేపు గుండె ఆగినంత పని అవుతుంది. భూమి మీద నూకలు ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయిన ప్రాణాలతో బయటపడొచ్చు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా (social media) మారింది. ఓ వ్యక్తి తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లినప్పటికీ.. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరాలో (Vadodara) మంగళవారం మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది. వివరాలు.. వడోదరాలోని దహోద్ ప్రాంతంలో ఓ వ్యక్తి బైక్ ఒక మహిళ, చిన్న శిశువుతో వెళ్తున్నాడు. అయితే రోడ్డుపై వర్షపు నీరు చేరి ఉంది. దీంతో నీటిలో గుంత (pothole) కారణంగా వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు వారి కుడివైపుకు పడిపోయారు.

    వారు కిందపడిన సమయంలోనే రోడ్డుపై వారికి ఎదురుగా ఒక ట్రాక్టర్ వెళ్లసాగింది. ట్రాక్టర్(tractor) ముందు టైర్లు వారిని పూర్తిగా దాటేశాయి. అయితే బైక్ ఉన్న ముగ్గురు ట్రాక్టర్‌కు అటాచ్ చేసిన ట్రాలీ టైర్ కింద పడిపోయారు. అయితే ట్రాక్టర్ టైర్ ఫోర్స్‌కు మహిళ, శిశువు దూరంగా నెట్టివేయబడ్డారు. అయితే ఆ వ్యక్తి మాత్రం అక్కడే పడిపోయాడు. దీంతో అతని తల మీదుగా ట్రాక్టర్ వెనక టైర్ వెళ్లింది. అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ.. అది కూడా పక్కకు జరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో అతడు మరణించి ఉంటాడని అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

    Shocking: గత ఏడాది కాలంగా సెక్స్ చేయలేదు.. అయితే డాక్టర్స్ అలా చెప్పేసరికి..



    ఇక, తర్వాత మహిళ రోడ్డుపై నుంచి లేచి.. శిశువును కూడా తన వద్దకు తీసుకుంది. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్‌ను ప్రశ్నించడాని ఆమె ముందుకు కదిలింది. ఇక, ఈ ప్రమాదాన్ని చూసిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకుని కింద పడిన అతడిని పైకి లేపారు. బైక్‌ను కూడా పైకి లేపి.. అతనికి అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    ఇక, ఇటీవలి కాలంలో దహోద్ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా (Viral Video) మారడం ఇది రెండోది. కొద్ది రోజులు క్రితం చోటుచేసుకున్న ఘటనలో.. బైక్ మీద ఉన్న వ్యక్తి వేగంతో వెళ్తున్నాడు. అదే సమయంలో మూల మలుపు వద్ద బస్సు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతడు బస్సు కిందకు జారుకున్నాడు. అతని బైక్ మాత్రం చాలా దూరం ముందుకు నెట్టివేయబడింది. వెంటనే బస్సు డ్రైవర్ బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేశాడు. బస్సు కిందకు వెళ్లిన వ్యక్తి మరణించి ఉంటాడని అంతా భావించారు. అయితే బస్సు నిలిపివేసిన కాసేపటికి.. అతడు నెమ్మదిగా బస్సు కింద నుంచి మెల్లగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత నడుచుకుంటూ రోడ్డు పక్కకు చేరుకున్నాడు. ఇక, అటుగా వెళ్తున్నవారు కొందరు ప్రమాదానికి గురైన బైక్‌ను రోడ్డు పక్కకు చేర్చి.. అతడికి సాయం అందించారు.
    Published by:Sumanth Kanukula
    First published: