Home /News /trending /

GUJARAT 12 FEET LONG PYTHON RESCUED BY WILDLIFE RESCUE TEAM IN VADODARA PAH

Huge python: వామ్మో.. నిర్మాణ భవనం దగ్గర 12 అడుగుల కొండ చిలువ.. ఏం చేస్తుందో తెలుసా..

కొండ చిలువ

కొండ చిలువ

Shocking: ఒక్కొసారి పాములు, కొండ చిలువలు దారితప్పి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు వాటిపై దాడులకు పాల్పడుతుంటే.. మరికొందరు వాటిని కాపాడి సమీపంలోని అడవి లోనికి వదిలేస్తారు.

Gujarat Huge Python: గుజరాత్ లోని వడోదరలో..  12 అడుగులో కొండ చిలువ కలకలం రేపింది. దాన్ని చూడగానే అందరు భయంతో వణికిపోయారు. వెంటనే కొందరు అక్కడి నుంచి పారిపోయారు. మరికొందరు మాత్రం దాన్ని కాపాడి ... అడవిలో వదిలేస్తే.. అయిపోతుందని భావించారు. ఈ క్రమంలో వారు దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. సాధారణంగా పాములంటే ప్రతి ఒక్కరికి చెప్పలేని భయం. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతుంటారు. దాని పేరు ఎత్తడానికి కూడా కొంత మంది ఇష్టపడరు.

ఒక వేళ పాము కనిపిస్తే.. అక్కడి దారిదాపుల్లోకి వెళ్లడానికి సాహాసించరు. ఒక్కొసారి ఆహారం కోసం, ఆవాసం కోసం అవి దారితప్పి మానవ ఆవాసాలకు వస్తాయి. ఈ క్రమంలో మనం.. వాటి కాటుకు మనం ఒక్కొసారి బలౌతుంటాం. కొన్ని సార్లు.. వాటిని మానవులు చంపేస్తారు. కానీ గుజరాత్ లో కొందరు దారి తప్పి మానవ ఆవాసాలకు చేరిన కొండ చిలువకు అపాయం కల్గించలేదు. దాన్నికాపాడి మానవత్వం చాటు కున్నారు.





పూర్తి వివరాలు.. గుజరాత్ లోని వడోదరలో ఒక నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర కొండ చిలువ బయటపడింది. దాన్నిచూడగానే అక్కడి పనివారంతా భయంతో అక్కడి నుంచి పారిపోయారు. కొందరు దాన్ని చంపేయాలంటు కేకలు వేశారు. మరికొందరు మాత్రం.. దాన్ని ఎలాగైన కాపాడాలని పాములను,కొండ చిలువలను రెస్క్యూచేసే వారికి సమాచారం అందించారు. ఈ క్రమంలో.. రెస్క్యూ సిబ్బంది వెంటనే కొండ చిలువ బయటపడిన ప్రాంతానికి చేరుకున్నారు.

అక్కడ దాదాపు.. 12 అడుగులు ఉన్నన కొండ చిలువను గమనించారు. వెంటనే తమ సిబ్బందితో కలిసి దాన్ని పట్టుకున్నారు. అది దాదాపు 12 అడుగుల పొడవు ఉంది. కొండ చిలువను పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ క్రమంలో వారు.. కొండ చిలువకు వైద్యపరీక్షలు జరిపి.. దగ్గరలోని అడవి లోనికి తిరిగి వదిలేస్తామని అధికారులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Gujarat, Python

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు