Home /News /trending /

GUINNESS WORLD RECORD HOLDER SMASHES 150 COCONUTS IN HARYANA WITH ONE HAND IN ONE MINUTE SNR

Guinness World Record: ఒక్క చేత్తో..ఒక్క నిమిషంలో 150కొబ్బరికాయలు పగలగొట్టాడు వీడియో ఇదిగో


Photo Credit:Youtube

Photo Credit:Youtube

OMG:ఒక్క చేత్తో 150 కొబ్బరి కాయల్ని నిమిషంలో పగలగొట్టాడు. హర్యానాకు చెందిన ధర్మేంద్ర ఈ సాహసాన్ని చేశాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లో యూట్యూబ్‌లో వీడియోలు చూసి కొబ్బరి కాయలు పగలగొట్టడం ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసాడు.

ఇంకా చదవండి ...
గుడిలో కొబ్బరికాయ కొట్టడమే చాలా మందికి సరిగా రాదు. అలాంటిది ఒక్క కొబ్బరికాయను నాలుగైదు సార్లు కొడితే కాని పగలదు. కాని హర్యానాలోని ఓ యువకుడికి కొబ్బరికాయల్ని ఒంటి చెత్తో (Single hand)పగలగొట్టగలడు. అది కూడా ఒకటి రెండు కాదు 150 టెంకాయల్ని(150 Coconuts)కేవలం కేవలం నిమిషం (One minute)లో పగలగొట్టాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికి అతను చేసిన సాహసం చూసి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు (Guinness World Record)వాళ్లే నోరు వెళ్లబెట్టారు. అతని టాలెంట్‌ చూసి చప్పట్లు కొట్టి అతని పేరును గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కించారు. హర్యానా(Haryana)లోని రోహ్‌తక్‌(Rohtak)జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానిక కూరగాయల మార్కెట్‌లో పని చేస్తున్న ధర్మేంద్ర (Dharmendra)అనే యువకుడు ఇలా 60సెకన్లలో 150 కొబ్బరికాయలు కొట్టి గతంలో ఉన్న గిన్నీస్‌ బుక్‌ రికార్డును చెరిపేసి తన పేరును కొత్తకా లిఖించుకున్నాడు. కాళీగా ఉంటే కొందరు టైమ్‌ వేస్ట్‌ చేస్తారు. కాని మనోడు..కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌ని ఓ రికార్డ్ సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. ధర్మేంద్రలోని స్పిరిట్‌ని  చూసి స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

వాడి టాలెంట్‌కి ఓ సలామ్..
ఒక స్థిరమైన బల్లపై 150 టెంకాలను నిలబెట్టగా..ధర్మేంద్ర వరుసగా తన ఒక్కచేత్తో వాటిని వేగంగా ఒక దాని తర్వాత మరొకటి పగలగొట్టుకుంటూ 150 టెంకాయల్ని నిమిషంలోపే ముక్కలు చేశాడు. ధర్మేంద్ర చేస్తున్న సాహసం చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో గూమికూడారు. నిజంగా రికార్డ్‌ నెలకోల్పుతాడో లేదో చూద్దామని కొందరు. ఇలాంటి సాహయం చేయడం గొప్ప విషయమే ప్రోత్సహించాలని మరికొందరు చప్పట్లు కొడుతూ అతడ్ని ఎంకరేజ్ చేశారు.అందరూ చూస్తుండగానే ధర్మేంద్ర ఈ రికార్డ్‌ని సృష్టించాడు. మరోవైపు స్థానికులు తమ సెల్‌ఫోన్లలో ఈ వీడియోని రికార్డ్ చేశారు. 150 కొబ్బరికాయల్ని పగలగొట్టగానే అందరూ చప్పట్లు కొట్టి అతడ్ని అభినందించారు.
సింగిల్‌ హ్యాండ్‌తో 150 కొబ్బరికాయలు..

ధర్మేంద్ర స్వస్తలం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్. హర్యానాకు వలస వచ్చిన యువకుడు యూట్యూబ్‌లో ఈతరహా కొబ్బరి కాయలు పగలగొట్టిన వాళ్ల వీడియోలను చూసి స్పూర్తి పొందాడు. ఎలాగైనా వాళ్ల కంటే ఎక్కువ పగలగొట్టాలనుకున్నాడు. అందుకే గతంలో కేరళకు చెందిన యువకుడు 122 టెంకాయలు పగలగొట్టాడు. ఆ తర్వాత జర్మనీకి చెందిన మహ్మద్ అనే మరో వ్యక్తి 148 కొబ్బరి కాయలు పగలగొట్టాడు. వాళ్ల కంటే మరో రెండు కొబ్బరి కాయల్ని ఎక్కువ అదే టైమ్‌లో పగలగొట్టి గిన్నీస్ రికార్డ్‌ సాధించాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లో చేయడానికి పని ఏమి లేకపోతే ఫోన్‌లో యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ..ఈ ప్రయోగాన్ని సాధించానని గర్వంగా చెబుతున్నాడు ధర్మేంద్ర.
Published by:Siva Nanduri
First published:

Tags: Haryana, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు