హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో ఎంత పెద్ద సైకిల్.. కారు కంటే దీని ఖరీదే ఎక్కువ..

వామ్మో ఎంత పెద్ద సైకిల్.. కారు కంటే దీని ఖరీదే ఎక్కువ..


Photo Credit: Instargam

Photo Credit: Instargam

Guinness World Record: మొత్తానికి సాధించాడు. ఇప్పటి వరకూ ఎవరూ తయారు చేయలేనంత పెద్ద సైకిల్ రెడీ చేశాడు. కేవలం రీసైక్లింగ్‌ వస్తువులతో తయారు చేసిన పొడవైన సైకిల్‌ తొక్కుతున్న వీడియో ఇన్‌స్టాలో షేర్ చేయడంతో గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్‌ల్లోకి ఎక్కించారు .

ఇంకా చదవండి ...

అందరితో శభాష్‌ అనిపించుకోవాలంటే అంతే షార్ప్‌గా ఆలోచించాలి. ఆ ఆలోచనల్లోంచి వచ్చిన ఐడియాను ఆచరణలో పెట్టి మనమేంటో నిరూపించుకోవాలి. ఆడమ్‌ జ్డానోవిచ్ వ్యక్తి చేసిన సాహసం అలాంటిదే. ఏదో ఒకటి చేసి గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆతని ప్రయత్నం ఏకంగా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కేలా చేసింది. గిన్నీస్‌ బుక్ రికార్డ్‌(Guinness World Record) సాధించడం అంత ఆషామాషి విషయం కాదు. కానీ అతనికి మాత్రం అతి సులువుగానే సాధ్యపడిందంటున్నారు. అసలు ఆడమ్‌ జ్డానోవిచ్‌ (Adam Zdanovich)ఏం చేస్తే గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాధించుకున్నాడో తెలుసా. సైకిల్‌ తొక్కి గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కాడు. అదేంటి సైకిల్‌ తొక్కితే గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో (Guinness World Record)లో చోటు దక్కుతుందా అని ప్రశ్నించకండి. అత్యంత పొడవైన సైకిల్‌ని తయారు చేసుకొని దానిపై కూర్చుని కిందపడకుండా తొక్కాడు ఆడమ్ . 24అడుగుల, 3అంగుళాల (24 feet 3 inches)పొడవైన సైకిల్‌ని తానే స్వయంగా తయారు చేసుకున్నాడు. దానిపై రైడింగ్‌ చేస్తూ వీడియో (Video)ని తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్ చేశాడు. అంతే అది కాస్తా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్ ప్రతినిధుల కళ్లలో పడటంతో ఆడమ్‌ పేరును గిన్నీస్‌ వరల్డ్‌ బుక్‌లోకి ఎక్కించారు. ఆ సైకిల్‌ తొక్కుతూ వెళ్తుంటే ఆడమ్‌కి రోడ్డుపై వెళ్తున్న వాళ్లంతా చిన్న పురుగుల్లా కనిపిస్తున్నట్లుగా ఉంది. హైట్ సైకిల్‌పై వెళ్తుంటే చూస్తున్న వాళ్లంతా స్తంభాల కంటే ఎత్తుగా ఉన్న ఈ సైకిల్‌ని రోజు తొక్కడం సాధ్యపడే విషయమేనా అని ప్రశ్నిస్తున్నారు.

తనకు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ రావడానికి కారణమైన అతి ఎత్తైన సైకిల్‌ని ఆడమ్‌ స్వయంగా తయారు చేసుకున్నాడు. రీసైక్లింగ్ వస్తువులతో ఈ అద్భుతమైన సైకిల్‌ రూపొందించాడు. ఈ హైట్‌ సైకిల్‌ సృష్టించడానికి నెల రోజుల సమయం పట్టిందంటున్నాడు ఆడమ్‌ జ్డానోవిచ్‌. తనకు ఏదైనా భారీ ప్రాజెక్టులు చేయడం అంటేనే ఇష్టమని అందుకే దీన్ని రూపొందించినట్లు చెప్పాడు. సైకిల్‌ పనితీరు కోసం ఇంకో వారం రోజులు పడుతుందన్నాడు.


సైకల్‌ తయారవడంతో రైడింగ్‌ మొదలుపెట్టిన ఆడమ్‌కు వెంటనే పేరు, గుర్తింపు వచ్చినందుకు గర్వంగా ఉందని..చెబుతున్నాడు. తనకు ఎక్కువగా పెద్ద ప్రాజెక్టుు చేయడం అంటేనే ఇష్టమని నా ఆలోచనలు కూడా పెద్ద స్థాయిలోనే ఉంటాయన్నాడు ఆడమ్‌ జ్డానోవిచ్. ఇదే కాదు ఇలాంటి మరెన్నో రికార్డులు బద్దలు కొట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. మరికొందరైతే ఇంత పెద్ద సైకిల్‌ ఎలా తయారు చేశావు, ఎంత ఖర్చైందంటూ ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Guinness World Record

ఉత్తమ కథలు