గిన్నీస్ వరల్డ్ రికార్డు(Gunnison world record)లో చోటు సాధించడం అంత ఆషామాషి విషయం కాదు. ప్రపంచంలో చాలా మంది గొప్పగా భావించే పని ఏదైనా చేయాలి. లేదంటే అరుదైన విజయం సాధించాలి. అలాంటి వ్యక్తులు, వ్యవస్థలు, ప్రదేశాలు మాత్రమే గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకుంటాయి. దుబాయ్(Dubai)లో ఓ ఐదు నక్షత్రాల హోటల్ పేరు ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డు (Gunnison world record)సాధించింది. ఎక్కువ మంది కస్టమర్లు వచ్చినందుకో, వెరైటీ వంటకాలు చేసినందుకో కాదు. మరి ఎందుకో తెలుసా..! మందు పార్టీకి అరేంజ్ చేసే గాజు గ్లాసుల్ని వేల సంఖ్యలో ఓ గోపురంగా పేర్చి ఈ రికార్డు నెలకోల్పారు. అయితే ఇది హోటల్ గొప్పతనం అనడం కంటే న్యూఇయర్ సందర్భంగా వేడుకల నిర్వాహకుల క్రెడిట్గానే చూడాలి. ఒకటి రెండు కాదు 54వేల 740 గ్లాసుల్ని 8.23 మీటర్ల ఎత్తు వరకూ ఓ పిరమిడ్‌లా అమర్చారు. ఆ అద్భుతమే గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించేలా చేసింది. స్టార్ హోటల్లో అట్లాంటిస్, ది పామ్(Atlantis,The Palm)అనే ఈవెంట్ ఆర్గనైజేషన్ తలపెట్టిన గ్లాస్ పిరమిడ్ నిర్మాణంలో మోయట్, చాండన్ (Moet & Chandon)అనే సోదరులు దీన్ని రూపొందించారు. ఈనెల 30 తేదిన న్యూఇయర్‌కి స్వాగతం పలుకుతూ హోటల్‌కి చెందిన రిసార్ట్‌లోని అసటీర్ టెంట్లో ఈ విధంగా గాజు గ్లాసుల్ని అందంగా గోపురంగా ఒకదానిపై మరొకటి నిలబెట్టి అందర్ని ఆకట్టుకున్నారు.
గ్లాస్ పిరమిడ్‌కి గిన్నీస్ బుక్‌లో చోటు..
అయితే దుబాయ్‌లోని అట్లాంటిస్, ది పామ్ హోటల్లో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం1548సూట్ రూమ్స్ ఉంచారు. అక్కడికి వచ్చిన కస్టమర్లు పార్టీతో పాటు గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం చేసిన ఈప్రయత్నాన్ని చూసి ఔరా అంటూ బిత్తరపోయారు. ఇంత ఎత్తులో గ్లాస్ పిరమిడ్(Glass pyramid) ఏర్పాటు చేయడం కొత్తేమి కాదు. గతంలో అంటే 2017లో మాడ్రిడ్(Madrid)లో కూడా ఇలాంటి రికార్డే సృష్టించారు. అయితే అప్పుడు కేవలం 50వేల 116 గ్లాసులను మాత్రమే గోపురంగా నిర్మించారు. ఆ రికార్డును ఇప్పుడు దుబాయ్‌లోని స్టార్ హోటల్ బ్రేక్ చేసింది.
గతంలో ఉన్న రికార్డును బ్రేక్ చేసిన దుబాయ్..
గిన్నీస్ వరల్డ్ రికార్డులకు ఎక్కాలని చేసిన ప్రయత్నం ఫలించింది. అయితే దీని వెనుక ఎలాంటి కష్టం ఉంది. వాటిని ఎలా అమర్చారన్న దానిపై గిన్నీ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు సైతం పరిశీలించారు. రాబోయే కాలంలో ఇంతకంటే గొప్పగా, ఎత్తుగా గ్లాస్ పిరమిడ్‌ను మరెవరైనా నిర్మిస్తారేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.