హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ కార్డ్ ఉంటేనే దావత్ కు పర్మిషన్.. వీడియో వైరల్..

పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ కార్డ్ ఉంటేనే దావత్ కు పర్మిషన్.. వీడియో వైరల్..

ఆధార్ కార్డు చూపిస్తున్న అతిథులు

ఆధార్ కార్డు చూపిస్తున్న అతిథులు

Wedding Video: ఒకే వేదికపై ఇద్దరు అక్కాచెల్లెళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత.. విందు కూడా ఏర్పాటు చేశారు. ఇంతలో.. పెళ్లికి వచ్చిన అతిథులకు షాకింగ్ ఘటన ఎదురైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

పెళ్లికి (Wedding) సంబంధించిన వింత ఘటనలు నిత్యం వార్తలలో ఉంటునే ఉంటాయి. పెళ్లిలో జరిగే సరదా పని వల్ల ఆ పెళ్లి కాస్త వైరల్ గామారిపోతుంది. మరీ అనుకోకుండా జరుగుతుందో, పబ్లిసిటీ కోసం చేస్తారో కానీ నిత్యం పెళ్లిలో ఏదో ఒక వెరైటీ ఘటనలను జరుగుతుంటాయి. దీంతో ఆ పెళ్లిళ్లు కాస్త వార్తలలో ఉంటాయి. కొన్ని పెళ్లిళ్లలో వధువు వేదికపైన గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఘటనలు వైరల్ గా అయ్యాయి. మరికొన్ని చోట్ల పెళ్లిలో వధువరులు ఎమోషనల్ కావడంతో ఆ వేడుక వార్తలలో నిలిచింది. ఇంకొన్ని చోట్ల వేదికపైకి మాజీ ప్రియుడు ఎంట్రీ ఇవ్వడం, వధువు, వరుడు కొట్టుకొవడం వంటి ఘటనలతో పెళ్లిళ్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో వింత ఘటనతో ఒక పెళ్లి ట్రెండింగ్ (Trending video) మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  జరిగిన ఒక పెళ్లి సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. ఈ పెళ్లి యూపీలోని అమ్రోహా జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉన్న హసన్ పూర్ లోని ఒక పెళ్లి జరిగింది. అక్కడ అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు ఒకేసారి జరిగాయి. అయితే.. వేడుకలో జనాలు పిలిచిన దానికంటే ఎక్కువగా కన్పించారు. దీంతో పెళ్లి వారు తలలు పట్టుకున్నారు. కల్యాణ మండపం సరిపోక బంధువులు ఇబ్బంది పడ్డారు. కొందరు పిలువని వారు కూడా పెళ్ళికి వచ్చినట్లుగా , పెళ్లివారు గుర్తించారు.

అయితే.. విందుకు మాత్రం హజరయ్యే వారు తప్పకుండా ఆధార్ కార్డు చూపించాలంటూ కండీషన్ పెట్టారు. విందుకు వెళ్లే డోర్ దగ్గరు కొందరిని నిలబెట్టారు. వరుసగా.. ఒక్కొక్కరి ఆధార్ కార్డు (Aadhaar Cards) చూసిన తర్వాత లోపలికి పంపుతున్నారు. అయితే.. కొంత మంది బంధువులు దీన్ని అవమానంగా భావించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం ఆధార్ కార్డు చూపించి మరీ విందు భోజనం (Dinner)  హల్ కు చేరుకున్నారు. దీన్ని అక్కడున్న వారు తమ ఫోన్ లో రికార్డు చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, Viral Video, Wedding

ఉత్తమ కథలు