Goats Dance: ఇంటర్నెట్​ను ఊపేస్తున్న మేకల డ్యాన్స్.. స్టెప్పులు కేక.. మీరూ చూసేయండి..

మేకల డాన్స్

Goat Dance: మేకల కాపరి కొన్ని మేకలను మేతకు తీసుకెళ్తూ, ఇంగ్లీష్​ మ్యూజిక్​ ప్లే చేశాడు. పాట వినగానే మేకలు కూడా మనుషుల్లాగే సంగీతాన్ని ఆస్వాదిస్తూ, పాట బీట్లకు అనుగుణంగా కాళ్ళు కదిలించాయి.

  • Share this:
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే అనేక వింతలు మన అరచేతిలోని స్మార్ట్​ఫోన్​లో చూసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా జంతువులు చేసే వింతలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిరుత పులి, కొండ చిలువ, ఎలుగు బంటి, కుక్కలు ఇలా అన్ని జంతువులు చేసే వింతలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూస్తూ.. అరెరే.. భలే ఉందే.. అనుకుంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. సోషల్ మీడియాలో వాటిని వీక్షించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అంతటితో ఆగకుండా లైక్​లు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.

తాజాగా సోషల్​ మీడియాలో మరో వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒక గ్రామంలో మేకల కాపరి కొన్ని మేకలను మేతకు తీసుకెళ్తూ, ఇంగ్లీష్​ మ్యూజిక్​ ప్లే చేశాడు. పాట వినగానే మేకలు కూడా మనుషుల్లాగే సంగీతాన్ని ఆస్వాదిస్తూ, పాట బీట్లకు అనుగుణంగా కాళ్ళు కదిలించాయి. ఆ మేకల మంద యజమానిని అనుకరిస్తూ కాళ్లు, మెడ ఊపుతూ స్టెప్పులేశాయి. 34 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను పెలియా వై ఫ్యూరియా డి యానిమల్స్ తన ఫేస్​బుక్ పేజీలో షేర్ చేయగా, వైరల్​గా మారింది. దీని తరువాత, మన్మౌజీ అనే నెటిజన్​ తన ట్విట్టర్​ అకౌంట్​ ద్వారా షేర్​ చేశాడు. ‘‘మేకల​ డ్యాన్స్​ను చూసి ఆనందించండి’’​ అంటూ క్యాప్షన్​ ఇచ్చి వీడియోను పోస్ట్​​ చేశాడు. దీంతో ఇప్పడు ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.


ఇక, ట్విట్టర్​లో వీటి డాన్స్​ను చూసిన వారంతా.. తాము వీటి డాన్స్​కు ఫిదా అయ్యామని, వీటి ప్రేమలో పడ్డామని వ్యాఖ్యానిస్తున్నారు. తక్కువ సమయం మాత్రమే ఉన్న వీడియోలో మేకల మంద డాన్స్ చూసి.. ఏదోక బాలీవుడ్ సినిమాలో వీటికి అవకాశం ఇవ్వాలని, అప్పుడు అవి మంచి డాన్సర్ అవుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.


ఇటీవల, ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో వైరల్​గా మారింది. ఒక ఎలుగు బంటి డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. ‘డ్యాన్సింగ్ స్టార్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఒక నెటిజన్​ ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. ఒక ఎలుగు బంటి చెట్టుకి దాని వీపు రుద్దుకుంటూ కాళ్ళు ఆడిస్తుంది.. ఇది చూడటానికి అచ్చం డాన్స్ లాగే ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక, ఆ ఎలుగుబంటి డాన్స్ చేస్తున్న సమయంలో దాని హావ భావాలు కూడా జంతు ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏదేమైనప్పటికీ, సంగీతానికి పక్షులు, జంతువులు కూడా స్పందిస్తాయనే మాటను ఇవి నిజం చేస్తున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: