Wedding Gift: వరుడి ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను కోపంతో విసిరికొట్టిన వధువు.. అందులో ఏముందంటే..

పెళ్లిలో గిఫ్ట్‌ను విసిరికొట్టిన వధువు

కొత్తగా పెళ్లయిన జంట రిసెప్షన్ కోసం స్టేజ్ పై కూర్చొని ఉన్నారు. పెళ్లి కొడుకు స్నేహితులందరూ వారికి శుభాకాంక్షలు చెబుతూ వధువు చేతిలో ఓ వెడ్డింగ్ గిఫ్ట్‌ పెట్టారు. దాన్ని అక్కడే తెరవమని చెప్పగా ఆమె దాన్ని తీసి చూసింది.

  • Share this:
భారతీయ వివాహ వేడుకలు అంటేనే ఆనందానికి, సందడికి మారుపేరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వధూవరుల స్నేహితులు, తోబుట్టువులు, కజిన్స్ లాంటి వారికి ఇది చాలా మంచి ఎంజాయ్‌మెంట్ ఈవెంట్‌. వీరంతా వధూవరులకి వింత వింత బహుమతులు అందిస్తూ వారిని ఆటపట్టించడం చాలా పెళ్లిళ్లలో జరుగుతుంటుంది. కొందరు చిన్న చాక్లెట్‌కి అంత పెద్ద ప్యాకేజింగ్ చుట్టి వారిని ఓపెన్ చేయమని కోరడం.. మరికొందరు వారిద్దరూ తాగాల్సిన కూల్ డ్రింక్ స్ట్రాలు ముడి వేయడం వంటివి చేస్తూ ఆటపట్టిస్తుంటారు. తాజాగా ఓ పెళ్లిలోనూ స్నేహితులు వధూవరులను అలాగే ఆటపట్టించాలని చూశారు. కానీ ఆ వధువుకి మాత్రం అది ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. అందుకే వరుడి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్‌ను ఆమె విసిరి కొట్టింది. దీంతో సరదాగా సాగుతుందనుకున్న కార్యక్రమం సీరియస్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఈ వైరల్ వీడియోలో.. కొత్తగా పెళ్లయిన జంట రిసెప్షన్ కోసం స్టేజ్ పై కూర్చొని ఉన్నారు. పెళ్లి కొడుకు స్నేహితులందరూ వారికి శుభాకాంక్షలు చెబుతూ వధువు చేతిలో ఓ వెడ్డింగ్ గిఫ్ట్‌ పెట్టారు. దాన్ని అక్కడే తెరవమని చెప్పగా ఆమె దాన్ని తీసి చూసింది. అందులో చిన్న పిల్లలు పాలు తాగే బాటిల్ ఉంది. సాధారణంగా ఇంతకుముందు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఆ వీడియోల్లో వధువు వాటిని లైట్‌గా తీసుకొని వారితో పాటు నవ్వేయడం, లేదా సిగ్గుపడుతూ దాన్ని పక్కన పెట్టేయడం మనం చూశాం. కానీ ఈ వధువుకి మాత్రం ఆ స్నేహితులు చేసిన పని అస్సలు నచ్చలేదు. దీంతో ఆ బాటిల్‌ని ఆమె దూరంగా విసిరికొట్టింది.

ఆ గిఫ్ట్‌ను చూసి వధువు చాలా కోపం తెచ్చుకుందని ఆమె హావభావాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఆ బాటిల్‌ని ఆమె విసిరి కొట్టినా తిరిగి తీసుకొచ్చి ఆమెకు ఇచ్చే ప్రయత్నం చేశారు వరుడి స్నేహితులు. కానీ అదే సమయానికి దాన్ని మరెవరో తీసుకోవడం వల్ల సమస్య అక్కడితో ఆగిపోయింది.

బంటీ ఠాకూర్ అనే వ్యక్తి ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో చాలా ట్రెండింగ్‌గా మారింది. ‘వదినతో సరదాగా ఆట’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు పది లక్షల మంది చూశారు. మూడు లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. 1600 మంది దీన్ని షేర్ కూడా చేశారు. సరదా ఆట కోసం ఎవరి గౌరవాన్ని తగ్గించకండి అంటూ ఒక యూజర్ వీడియోకు కామెంట్ పెట్టారు. మరికొందరు యూజర్లు మాత్రం.. వాళ్లు చేసిన సరదా పనిని సరదాగా తీసుకోకుండా కోపం తెచ్చుకోవడం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. ఆ అమ్మాయి చేసిన పనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పాల బాటిలే కదా ఇచ్చింది. ఏదో తప్పుడు వస్తువు ఇచ్చినట్లు పడేయాల్సిన అవసరం ఏముంద’ని కూడా కామెంట్లు చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: