హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Haryana: పీటల మీద పెళ్లి చెడగొట్టుకున్న వరుడు..వాడు ఏం చేశాడో తెలుసా

Haryana: పీటల మీద పెళ్లి చెడగొట్టుకున్న వరుడు..వాడు ఏం చేశాడో తెలుసా

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Haryana:పీఠల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది.చివరి క్షణంలో పెళ్లి కొడుకు చేసిన రచ్చతో పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఇంతకీ పెళ్లి కొడుకు ఆ రాత్రి చేసిన రచ్చ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.

హర్యానా(Haryana)లో ఓ పెళ్లి పీఠల వరకు వచ్చి ఆగిపోయింది. చివరి క్షణంలో పెళ్లి కొడుకు చేసిన రచ్చతో కాసేపట్లో జరగాల్సిన వివాహం రద్దు అయింది. ఒకే రోజు ఇద్దరు కుమార్తెల పెళ్లి చేద్దామనుకున్న అమ్మాయి తల్లిదండ్రులకు చిన్న కూతురిని చేసుకోబోయే వరుడు ఇచ్చిన ఝలక్‌కి మైండ్ బ్లాక్ అయింది. పెద్ద కూతురి వివాహం గ్రాండ్‌గా ముగిసింది. చిన్న కుమార్తె పెళ్లి పేటాకులైంది. హర్యానా మహేంద్రగఢ్‌(Mahendragarh)జిల్లాలో ఈఘటన జరిగింది. మే(May) 12వ తేదిన ఇద్దరు కుమార్తెలకు పెళ్లి నిశ్చయించారు అమ్మాయిల తల్లిదండ్రులు. పెళ్లి వేదికను రంగుల పూలతో డెకరేషన్ (Decoration)చేశారు, డీజే ఏర్పాటు చేశారు. డిన్నర్(Dinner)కోసం రుచికరమైన వంటకాలను వడ్డి వార్చారు. అయితే కేవలం పెళ్లి కొడుకు ఓవర్ యాక్షన్(Over action) వల్లే పీఠల వరకు వచ్చిన పెళ్లి( Marriage)పంచాయితీకి దారి తీసింది. రెండు వివాహాలకు సంబంధించిన పెళ్లి కొడుకులు వేర్వేరు చోట్ల నుంచి రావాల్సి ఉండగా ముందుగా పెద్ద కుమార్తెను చేసుకోబోయే వరుడు రావడంతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు.

పెళ్లింటికి తాగొచ్చి తందనాలు..

మరో కుమార్తె వివాహం కోసం బంధు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. సాయంత్రం ఊరేగింపుగా బయల్దేరిన పెళ్లి కొడుకు తన స్నేహితులతో కలిసి బారాత్‌ పేరుతో రోడ్లపై మద్యం తాగి నానా యాగి చేశాడు. రాత్రి వరకు పెళ్లి వేదికకు చేరుకోలేదు. బారాత్ పేరుతో పెళ్లి కొడుకు అతని స్నేహితులు చేసిన రచ్చ భరించలేక స్థానికులు డయల్ 112కి కాల్ చేశారు. దీంతో డీజే ఆపించారు పోలీసులు. లేదు తనకు బ్యాండ్‌ మేళం ఏర్పాటు చేయాల్సిందేనంటూ పట్టుబట్టడంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు మేళాలను పిలిపించారు. మద్యం మత్తు తలకెక్కడంతో అర్దరాత్రి సమయానికి పెళ్లి వేదికకు చేరుకున్నాడు వరుడు.


బారాత్‌ పేరుతో రచ్చ..

పెళ్లి వారింటికి వచ్చిన పెళ్లి కొడుకు అతని స్నేహితులు బారాత్ పేరుతో డ్యాన్స్‌లు చేయడమే కాకుండా పెళ్లికి వచ్చిన అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో రెండో కుమార్తె పెళ్లి కోసం అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తల్లిదండ్రులకు పెళ్లి కొడుకు నిజస్వరూపాన్ని కళ్లారా చూసి పెళ్లి రద్దు చేసుకున్నారు. ఎక్కడైనా వరుడి స్నేహితులు మద్యం తాగొచ్చి గోల చేస్తే సర్ది చెప్పాల్సింది పోయి అతనే మద్యం తాగొచ్చి గొడవ చేస్తే ఎలా మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని అందుకే రద్దు చేసుకున్నామని తల్లిదండ్రులు తెలిపారు.

పెటాకులైన పెళ్లి..

ఇంత జరిగిన తర్వాత కూడా పెళ్లి కొడుకు తిరిగి వెనక్కి వెళ్లలేదు. పెళ్లి క్యాన్సిల్ చేశారనే కోపంతో వధువు తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్లను ధ్వంసం చేశారు. అంతే కాదు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని చెబితే తనను కొట్టారని గొడవపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు స్పాట్‌కి చేరుకొని అమ్మాయి తరపు బంధువులు చెప్పింది విని సమస్యను సున్నితంగా పరిష్కరించారు.

First published:

Tags: Haryana, VIRAL NEWS, Wedding