హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు వినూత్న ఆహ్వానం.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు వినూత్న ఆహ్వానం.. వైరల్ అవుతున్న వీడియో..

డ్యాన్స్ వేస్తున్న వరుడు

డ్యాన్స్ వేస్తున్న వరుడు

భారతీయులు పెళ్లి వేడుకలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల పెళ్లి ట్రెండ్ మారింది. పెళ్లిలో సందడి మరింత పెరిగింది. దీంతో వధూవరులు చేస్తున్న వింత పనులు వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల తెలంగాణలోని ఒక వధువు ‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్ వేసినప్పటి వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది.

ఇంకా చదవండి ...

భారతీయులు పెళ్లి వేడుకలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల పెళ్లి ట్రెండ్ మారింది. పెళ్లిలో సందడి మరింత పెరిగింది. దీంతో వధూవరులు చేస్తున్న వింత పనులు వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల తెలంగాణలోని ఒక వధువు ‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్ వేసినప్పటి వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. తాజాగా ఇలాంటి మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈసారి ఒక వరుడు.. వినూత్నంగా డ్యాన్స్‌ చేస్తూ నవ వధువుకు ఆహ్వానం పలికాడు. దీంతో అక్కడ ఉన్న బంధువులంతా ఆశ్చర్యపోయారు.

జస్ట్ రూ.20 లక్షలతో పోయేదానికి.. వీళ్లు చేసిన పని వల్ల ఎన్ని కోట్లు కట్టాల్సొచ్చిందంటే..


సాధారణంగా పెళ్లి జరిగేటప్పుడు వధూవరుల స్నేహితులు, రక్తసంబంధీకులు చేసే సందడి ఆకర్షణగా ఉండేది. ఇప్పుడు పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకు సొంతంగా ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చేలా వివాహ వేడుకలను ప్లాన్ చేసుకుంటున్నారు. తాజా వీడియోలో కనిపిస్తున్న వరుడు కూడా ఇలాంటి ప్లాన్ చేశాడు. పెళ్లి మండపానికి వచ్చిన వధువును వేదిక మీదకు ఆహ్వానించడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.

Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి


THE CHOPRA EVENTS (@thechopraevents) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడిందిSuccess Story: ఆ మహిళ విజయ ప్రస్థానం.. ప్రతీ ఒక్కరికీ ఆదర్శం.. ఆమె విజయగాధ మీకోసం..


ఈ వీడియోను 'ది చోప్రా ఈవెంట్' అనే ఇన్‌స్టా పేజ్‌ షేర్ చేసింది. "వీడియోను చివరి వరకు చూడండి. అందమైన వధువును వరుడు ఇలా వినూత్నంగా స్వాగతించాడు" అని వీడియోకి క్యాప్షన్ పెట్టారు. వధువు తన సోదరులు, స్నేహితులతో కలిసి పెళ్లి మండపం వద్దకు వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాబోయే భార్యతో పాటు ఆమెతో పాటు వచ్చిన వారి వద్దకు పెళ్లికొడుకు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లినట్లు వీడియోలో ఉంది. తరువాత పెళ్లి దుస్తుల్లో ముస్తాబై వచ్చిన నవ వధువును ప్రేమగా కౌగిలించుకున్నాడు. అనంతరం ఆమె చెయ్యి పట్టుకొని వేదిక వద్దకు స్వయంగా తీసుకొని వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అక్కడే ఉన్న అతిథులు సైతం సంతోషంతో అరుస్తూ, వారిని ప్రోత్సహించడం చూడవచ్చు.

రెండేళ్ల క్రితం వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భార్య చేసిన పనికి అతడు ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడో తెలుసా..


ఇప్పటివరకు ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. అయితే ఈ వీడియోలో ఉన్న వారి వివరాలపై స్పష్టత లేదు. చోప్రా ఈవెంట్ అనే సంస్థ వరుడితో ఇలా డ్యాన్స్ ప్లాన్ చేసినట్లు కామెంట్ల ద్వారా తెలుస్తోంది.

First published:

Tags: Viral Video, Viral Videos, Wedding

ఉత్తమ కథలు